- Home
- Entertainment
- 1 నేనొక్కడినే బ్లాక్ బస్టర్ అయ్యేది..సుకుమార్ ఎందుకు వదిలేశారో తెలుసా, చిరు ఇచ్చిన భరోసా ఇదే
1 నేనొక్కడినే బ్లాక్ బస్టర్ అయ్యేది..సుకుమార్ ఎందుకు వదిలేశారో తెలుసా, చిరు ఇచ్చిన భరోసా ఇదే
సుకుమార్ కెరీర్ బిగినింగ్ ఆర్య చిత్రం నుంచి పుష్ప వరకు ఏ మూవీ చూసినా దేనికదే ప్రత్యేకం అన్నట్లుగా ఉంటుంది. ఫ్లాప్ చిత్రాలలో సైతం సుకుమార్ తన మార్క్ వదిలిపెడతారు.

సుకుమార్ కెరీర్ బిగినింగ్ ఆర్య చిత్రం నుంచి పుష్ప వరకు ఏ మూవీ చూసినా దేనికదే ప్రత్యేకం అన్నట్లుగా ఉంటుంది. ఫ్లాప్ చిత్రాలలో సైతం సుకుమార్ తన మార్క్ వదిలిపెడతారు. తన చిత్రాల్లో ఏదో ఒక కొత్త పాయింట్ ఉండాలని తపించే డైరెక్టర్ సుకుమార్. ప్రేమ కథ తెరక్కించినా అందులో వైవిధ్యం ఉంటుంది.
సుకుమార్, మహేష్ బాబు కాంబినేషన్ లో వచ్చిన 1 నేనొక్కడినే చిత్రం కనీవినీ ఎరుగని అంచనాలతో రిలీజయింది. సుకుమార్ ఆ చిత్రాన్ని వైవిధ్యంగా మలిచినప్పటికీ కథలో గందరగోళం, మహేష్ బాబు పాత్రని చూపించిన విధానం ఆడియన్స్ కి నచ్చలేదు. టెక్నీకల్ గా 1 నేనొక్కడినే బ్రిలియంట్ మూవీ అయినప్పటికీ కమర్షియల్ గా డిజాస్టర్ అయింది.
ఆ చిత్రంలో కొన్ని సన్నివేశాలు టాప్ క్లాస్ అనిపించేలా ఉంటాయి. సందర్భం వచ్చినప్పుడల్లా ఫ్యాన్స్ 1 నేనొక్కడినే చిత్రం గురించి చర్చించుకుంటుంటారు. గతంలో ఓ సందర్భంలో సుకుమార్ 1 నేనొక్కడినే ఫెయిల్యూర్ గురించి చేసిన వ్యాఖ్యలు వైరల్ అవుతున్నాయి.
సుకుమార్ మాట్లాడుతూ 1 నేనొక్కడినే చిత్రానికి ఇంకో వెర్షన్ కథ కూడా ఉంది. హీరో కన్ఫ్యూజన్ కి గురి కావడం ఇంటర్వెల్ వరకు ఉంటుంది. ఇంటర్వెల్ నుంచి అది హీరో చేసిన డ్రామా, ప్లాన్ లాగా మరో వెర్షన్ ఉంది. ఆ కథ చేసి ఉంటే 1 నేనొక్కడినే బ్లాక్ బస్టర్ హిట్ అయ్యేది. కానీ హీరో డ్రామా చేస్తున్నాడు అని చూపిస్తే ఎమోషన్ మిస్ అవుతుందేమో అని అలా చేయలేదు.
అదే విధంగా లెన్త్ ఎక్కువవుతోందని ఎడిటింగ్ లో చాలా సీన్లు తీసేశాం. దాని వల్ల కథ ఫ్లోలో కూడా క్లారిటీ లోపించింది అని సుకుమార్ అన్నారు. 1 నేనొక్కడినే చిత్రాల్లో చేసిన మిస్టేక్స్ అన్నీ గుర్తు పెట్టుకుని రంగస్థలం చిత్రంలో రిపీట్ కాకుండా చూసుకున్నాం అని సుకుమార్ అన్నారు. రంగస్థలం చిత్రం లెన్త్ కూడా ఎక్కువే.
అయితే ఇందులో కూడా సీన్లు ఎడిట్ చేసి లేపేస్తే 1 నేనొక్కడినే లాగే అవుతుందా.. ఒక వేళ లాగే ఉంచితే ఆడియన్స్ లెన్త్ ఎక్కువని ఫీల్ అవుతారా ఇలా చాలా టెన్షన్ పడ్డాను. కానీ చిరంజీవి గారు భరోసా ఇవ్వడంతో నాకు కాన్ఫిడెన్స్ వచ్చేసింది. చిరంజీవి గారు సినిమా చూసి ఒక్క సీన్ కూడా ఎడిట్ చేయాల్సిన అవసరం లేదు. అలాగే వదిలేయండి అని చెప్పారు. అదే లెన్త్ తో రంగస్థలం చిత్రాన్ని రిలీజ్ చేసినట్లు సుక్కు పేర్కొన్నారు.