- Home
- Entertainment
- సమంత 'ఖుషి' ఎఫెక్ట్.. నాగ చైతన్య థియేటర్ నుంచి వెళ్లిపోయాడా ? షాకింగ్ రూమర్ పై క్లారిటీ..
సమంత 'ఖుషి' ఎఫెక్ట్.. నాగ చైతన్య థియేటర్ నుంచి వెళ్లిపోయాడా ? షాకింగ్ రూమర్ పై క్లారిటీ..
డివోర్స్ తర్వాత కూడా సమంత, నాగ చైతన్య గురించి రూమర్స్ వస్తూనే ఉన్నాయి. ఈ రూమర్స్ ని పట్టించుకోకుండా చైతు, సామ్ వాళ్ళ వాళ్ళ కెరీర్ లో ముందుకెళుతున్నారు. కొన్ని డిస్ట్రబ్ చేసే రూమర్స్ వస్తే మాత్రం ఘాటుగా బదులిస్తున్నారు.

గత రెండేళ్లుగా సమంతకి సంబంధించిన చిన్న విషయం కూడా సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. చైతన్యతో విడాకుల తర్వాత డిప్రెషన్ కి గురైన సమంత తిరిగి తన సినిమాలతో బిజీగా మారింది. అంతలోనే ఆమెని మయో సైటిస్ అనే వ్యాధి చుట్టుముట్టిన సంగతి తెలిసిందే. విదేశాల్లో ట్రీట్మెంట్ తీసుకుని కాస్త కోలుకుంది. చకచకా యశోద, శాకుంతలం చిత్రాలు పూర్తి చేసిన సమంత ప్రస్తుతం విజయ్ దేవరకొండ సరసన నటించిన ఖుషి చిత్రం రిలీజ్ కి రెడీ అవుతోంది.
డివోర్స్ తర్వాత కూడా సమంత, నాగ చైతన్య గురించి రూమర్స్ వస్తూనే ఉన్నాయి. ఈ రూమర్స్ ని పట్టించుకోకుండా చైతు, సామ్ వాళ్ళ వాళ్ళ కెరీర్ లో ముందుకెళుతున్నారు. కొన్ని డిస్ట్రబ్ చేసే రూమర్స్ వస్తే మాత్రం ఘాటుగా బదులిస్తున్నారు. ఆ మధ్యన సమంత తన చికిత్స కోసం ఓ స్టార్ హీరో నుంచి పాతిక కోట్లు అప్పు తీసుకున్నట్లు ప్రచారం జరిగింది. ఈ వార్తలని సామ్ స్వయంగా ఖండించింది.
ఇప్పుడు ఓ షాకింగ్ రూమర్ నాగ చైతన్యని చుట్టుముట్టింది. అదేంటంటే నాగ చైతన్య థియేటర్ లో సినిమా చూస్తుండగా ఇంటర్వెల్ లో ఖుషి ట్రైలర్ ప్లే చేశారని.. దీనితో చైతు అసహనంతో అక్కడి నుంచి వెళ్లిపోయినట్లు రెండ్రోజులుగా న్యూస్ తెగ వైరల్ అవుతోంది.
ఇబ్బందికరంగా మారేలా ఉన్న ఈ రూమర్ పై చైతు స్పందించి ఖండించినట్లు తెలుస్తోంది. ఇటీవల రష్మీ గౌతమ్ 'బాయ్స్ హాస్టల్' అనే చిత్రం విడుదలయింది. ఇది కన్నడ మూవీ డబ్బింగ్ వర్షన్. ఆగష్టు 26న రిలీజైన ఈ చిత్రాన్ని కొందరు సెలబ్రిటీల కోసం ప్రీమియర్ ప్రదర్శించారట. ఈ చిత్రం చూడడానికి నాగ చైతన్యని కూడా ఇన్వైట్ చేశారట. అయితే ప్రీమియర్ చూస్తుండగా ఇంటర్వెల్ లో విజయ్ దేవరకొండ, నాగ చైతన్య ఖుషి ట్రైలర్ ప్రదర్శించారట. దీనితో చైతు అక్కడికి నుంచి కోపంగా వెళ్లిపోయాడని ఆ రూమర్స్ సారాంశం.
ఈ రూమర్స్ ఎక్కువవుతుండడంతో చైతు ఆంగ్ల మీడియాకి ఇచ్చిన ఇంటర్వ్యూలో స్పందించారు. తాను థియేటర్ నుంచి వెళ్లిపోయినట్లు జరుగుతున్న ప్రచారాన్ని తీవ్రంగా ఖండించారు. అవన్నీ పూర్తిగా అవాస్తవాలు, కావాలని సృష్టించిన రూమర్స్. ఈ ఫేక్ న్యూస్ గురించి నా దృష్టికి వచ్చింది. దీనితో సదరు మీడియాకి ఆ వార్తలని సరి చేయమని సూచించినట్లు నాగ చైతన్య తెలిపారు.
2021లో సమంత, నాగ చైతన్య విడాకులు తీసుకుని విడిపోయిన సంగతి తెలిసిందే. ఏదో ఒక రూమర్ నిత్యం వీరిద్దరి గురించి సామజిక మాధ్యమాల్లో చక్కర్లు కొడుతూనే ఉంది. చైతు ప్రస్తుతం కార్తికేయ 2 డైరెక్టర్ చందు ముండేటి దర్శకత్వంలో నటించేందుకు రెడీ అవుతున్నాడు. ఈ మూవీలో చైతుమత్స్యకార యువకుడిగా నటించబోతున్నట్లు తెలుస్తోంది. దీనికోసం చైతు సముద్రంలో పడవ నడిపే ట్రైనింగ్ కూడా తీసుకుంటున్నాడు.