MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
TRENDING :
IMD Weather Update
Today's Rasi Phalalu
Women's Asia Cup 2026
Post Office RD Scheme
Hey Ram Controversy
Epic Movie Review
Smart Investment Tips
iPhone 18 Pro Max
YS Jaganmohan Reddy
Vastu Tips
Hyderabad Elevated Corridor Project
PM Viksit Bharat Rozgar Yojana
  • Home
  • Entertainment
  • సంపూ నుండి జెస్సీ వరకు ఎలిమినేట్ కాకుండానే బిగ్ బాస్ హౌస్ వీడిన కంటెస్టెంట్స్ ఎవరో తెలుసా? టార్చర్ తట్టుకోలేక!

సంపూ నుండి జెస్సీ వరకు ఎలిమినేట్ కాకుండానే బిగ్ బాస్ హౌస్ వీడిన కంటెస్టెంట్స్ ఎవరో తెలుసా? టార్చర్ తట్టుకోలేక!

బిగ్ బాస్ హౌస్ (Bigg boss) లో ఉండడం అంత ఆషామాషీ వ్యవహారం కాదు. బిగ్ బాస్ ఆడించే గేమ్స్, చేయించే టాస్క్స్ మెంటల్ గా, ఫిజికల్ గా ఒత్తిడికి గురిచేస్తాయి. మనకు ఇష్టమైన వారితో కూడా గొడవలు పడేలా పురికొల్పుతాయి. 

3 Min read
Author : Sreeharsha Gopagani
| Updated : Nov 15 2021, 01:49 PM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
19

ఈ క్రమంలో కంటెస్టెంట్స్ గాయాల బారిన పడే అవకాశం కలదు. అలాగే హౌస్ లో ఉన్న ఒత్తిడి తట్టుకోలేక కొందరు కంటెస్టెంట్స్ మధ్యలోనే నిష్క్రమించారు... గత ఐదు సీజన్స్ లో ఎలిమినేట్ కాకుండా..  ఆటను మధ్యలోనే ముగించి బయటికి వచ్చిన కంటెస్టెంట్స్ ఎవరో చుద్ద్దాం ఎన్టీఆర్ (NTR) హోస్ట్ గా 2017లో మొదలైంది బిగ్ బాస్ సీజన్ 1. ఫస్ట్ సీజన్లో ఎన్నడూ లేని విధంగా టాప్ సెలెబ్రిటీలు పాల్గొనడం జరిగింది. వారిలో సంపూర్ణేష్ బాబు (Sampoornesh babu) ఒకరు. హృదయ కాలేయం సినిమాతో ఓవర్ నైట్ ఫేమ్ తెచ్చుకున్న సంపూర్ణేష్ బాబు బిగ్ బాస్ హౌస్ లోకి ఎంటర్ అయ్యాడు. 
 

గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండిgooglePreferred
29

పక్కా పల్లెటూరి నేపథ్యం కలిగిన ఓ సాధారణ వ్యక్తి సంపూర్ణేష్. ఆయన హౌస్ వాతావరణాన్ని తట్టుకోలేకపోయాడు. నాలుగు గోడల మధ్య జీవితం, తోటి వాళ్ళతో గొడవలు, తనకు అస్సలు సరిపడలేదు. దీనితో హౌస్ నుండి తనను బయటికి పంపాలని కన్నీరు పెట్టుకున్నాడు. బిగ్ బాస్... షో మొదలైన 9వ రోజు హౌస్ నుండి సంపూని బయటికి పంపేశారు. ఆ సీజన్లో కి శివ బాలాజీ విన్నర్ గా నిలిచారు. 
 

39

ఇక సెకండ్ సీజన్ కి హోస్ట్ గా హీరో నాని (Nani) రంగంలోకి దిగారు. ఫస్ట్ సీజన్ అంత కాకపోయినా, టాప్ సెలెబ్రిటీలు కంటెస్టెంట్స్ గా ఎంట్రీ ఇచ్చారు. అయితే అసలు ఎవరికీ పరిచయం లేని నూతన్ నాయుడు అనే కంటెస్టెంట్ హౌస్ లోకి రావడం జరిగింది. వైజాగ్ కి చెందిన నూతన్ నాయుడు హౌస్ లో చాలా అగ్రెసివ్ గా ఉండేవాడు.

49
nutan

nutan

ఆ సీజన్ విన్నర్ కౌశల్ (Kaushal) మాత్రమే సన్నిహితంగా ఉండేవాడు. కాగా ఓ టాస్క్ ఆడుతున్న క్రమంలో నూతన నాయుడు కాలుకు దెబ్బతగిలింది. దీనితో అతడు హౌస్ నుండి ఎలిమినేట్ కాకుండానే బయటికి వచ్చాడు. అయితే కోలుకున్న తర్వాత, అతడు హౌస్ లోకి వెళ్లడం, ఎలిమినేట్ కావడం జరిగింది. 
 

59


బిగ్ బాస్ హోస్ట్స్ గా ఎన్టీఆర్, నాని తప్పుకోవడంతో కింగ్ నాగార్జున (Nagarjuna) మూడవ సీజన్ కి ఎంట్రీ ఇచ్చారు. ఈ సీజన్లో పాల్గొన్న కంటెస్టెంట్స్ లో మోడల్, యాక్టర్ అలీ రేజా ఒకరు. అలీ రేజా ఏడవ వారం ఎలిమినేట్ అయ్యాడు. అయితే ఆడియన్స్ కోరిక మేరకు రీఎంట్రీ ఇచ్చాడు. ఫైనల్ కి చేరిన అలీ నాలుగవ స్థానంతో సరిపెట్టుకున్నాడు. ఈ సీజన్లో రాహుల్ సిప్లిగంజ్ విన్నర్ కావడం జరిగింది. 


 

69

కరోనా సమయంలో మొదలైన బిగ్ బాస్ సీజన్ 4 లో చెప్పుకోదగ్గ కంటెస్టెంట్స్ పాల్గొనలేదు. అయితే షో మొదలయ్యాక, కంటెస్టెంట్స్ ప్రేక్షకులకు దగ్గరయ్యారు. యూట్యూబ్ ద్వారా ఫేమ్ రాబట్టిన, అతి సామాన్యురాలు గంగవ్వ సీజన్ 4 కంటెస్టెంట్ గా ఎంట్రీ ఇచ్చి షాక్ ఇచ్చింది. 
 

79


అరవైయేళ్ల గంగవ్వ (Gangavva) షో మొదట్లో యాక్టీవ్ గా కనిపించారు. ఏది ఏమైనా చివరి వరకు ఉంది కప్ గెలుస్తాను, మీరు ఓట్లు వేయండి అంటూ... విజ్ఞప్తి చేశారు. ఐతే ఐదు వారాల తర్వాత గంగవ్వ హౌస్ లో ఉండలేకపోయారు. పిల్లలు గుర్తుకు వస్తున్నారని, ఇంటి వాతావరణం పడడం లేదని, బయటికి పంపాలని విజ్ఞప్తి చేశారు. ఆమె ఆరోగ్యం కూడా సరిగా లేకపోవడంతో ఇంటి నుండి బయటికి పంపారు. అయితే షోలో ఎలిమినేట్ అయ్యేవరకు ఆడకున్నా... నాగార్జున, బిగ్ బాస్ నిర్వాహకులు గంగవ్వ సొంత ఇంటి కల నెరవేర్చారు. 

89

నాలుగవ సీజన్లో పాల్గొన్న కంటెస్టెంట్స్ లో సింగర్ నోయల్ ఒకరు. స్ట్రాంగ్ కంటెస్టెంట్ గా ఫైనల్ కి చేరుతాడనుకున్న నోయల్ అనారోగ్యం కారణంగా మధ్యలోనే బయటికి వచ్చేశాడు. నడవలేక ఇబ్బంది పడుతున్న నోయల్ ని 8వ వారం బిగ్ బాస్ ఇంటి నుండి విడుదల చేయడం జరిగింది. 
 

99

ఇక లేటెస్ట్ సీజన్లో జస్వంత్ అలియాస్ జెస్సీ (Jessie) ఎలిమినేట్ కాకుండగానే హౌస్ ని వీడాల్సి వచ్చింది. వారం రోజులుగా అనారోగ్యంతో బాధపడుతున్న జెస్సీని బిగ్ బాస్ సీక్రెట్ రూమ్ లో ఉంచి, వైద్యం అందించారు. అయినప్పటికీ అతని ఆరోగ్యం మెరుగు పడలేదు. దీనితో 10వ వారము జెస్సీ హౌస్ ని వీడాల్సి వచ్చింది.

Also read Bigg boss telugu 5: ఎలిమినేషన్ లో కూడా స్నేహం చాటుకున్న జెస్సీ, షన్ను నుండి దీప్తికి ప్రేమ రాయబారం

Also read Bigg boss telugu 5: లోపల ఉన్న ప్రియుడు షన్నును తిడితే, బయటున్న దీప్తికి మండింది...!

About the Author

SG
Sreeharsha Gopagani
 

Latest Videos
Recommended Stories
Recommended image1
Chaitra Rai: వర్షిణి, సుధీర్ హైడ్రామా అట్టర్ ఫ్లాప్.. బిగ్ బాస్ హౌస్ నుంచి చైత్ర రాయ్ అవుట్, మరో ఎలిమినేషన్
Recommended image2
Shrimad Bhagavatam: రామాయణం నుంచి శ్రీమద్భాగవతం వరకు ఏడు భాగాలుగా విష్ణువు కథ.. భారీ స్కేల్‌లో సినిమాలు
Recommended image3
The Paradise: ది ప్యారడైజ్ మూవీకి ట్రైలర్ లేదు.. బాంబు పేల్చిన నాని, ఏం జరుగుతోంది
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved