వారి మరణం తీరని లోటు, జ్ఞాపకాలు అజరామరం... 2020లో నింగికెగసిన తారలు
First Published Dec 5, 2020, 7:59 PM IST
2020 ప్రపంచం ఎన్నడూ ఎరుగని దారుణ పరిస్థితులను పరిచయం చేసింది. మనిషికి మనిషిని దూరం చేసిన కోవిడ్, ప్రపంచాన్ని తన గుప్పెట్లో పెట్టుకొని ఊపిరాడకుండా చేసింది. అలాగే ఈ ఏడాది చిత్ర పరిశ్రమకు చెందిన కొందరు అద్భుత నటులు వివిధ కారణాలతో లోకాన్ని విడిచిపోయారు. ఆ వారి మరణం తీరని లోటు కాగా జ్ఞాపకాలు అజరామరం. ఈ ఏడాది నింగికెగసిన దృవతారలను గుర్తు చేసుకుందాం...

లెజెండరీ సింగర్ ఎస్పీ బాలసుబ్రమణ్యం కరోనా కారణంగా సెప్టెంబర్ 26, 2020న తుదిశ్వాస విడిచారు. దాదాపు 50రోజులు ఆసుపత్రిలో చికిత్స తీసుకున్న బాలసుబ్రమణ్యం, తిరిగి వస్తున్నారనే ఆశలు రేపి అందరికీ దూరమయ్యారు. 16 భాషల్లో 70వేలకు పైగా పాటలు పాడిన బాల సుబ్రమణ్యం 6సార్లు జాతీయ అవార్డు గెలుపొందారు.

బాలీవుడ్ లో యువ హీరోగా అద్భుత భవిష్యత్తుకు బాటలు వేసుకుంటున్న సుశాంత్ సింగ్ రాజ్ పుత్ జూన్ 14, 2020 ఉదయం బాంద్రాలోని తన నివాసంలో ఆత్మహత్య చేసుకున్నారు. మానసిక వేదనతో సుశాంత్ ఉరివేసుకొని ప్రాణాలు తీసుకోగా, ఆయన మరణం బాలీవుడ్ ని కుదిపివేసింది. బుల్లితెర స్టార్ గా ఎదిగిన సుశాంత్ కై పో చే మూవీలో వెండితెరకు పరిచయం అయ్యారు. తక్కువ కాలంలోనే అద్భుత పాత్రలు చేసిన సుశాంత్ చివరి చిత్రం దిల్ బేచారా, ఆయన మరణం తరువాత విడుదలైంది.
Today's Poll
మీరు ఎంత మందితో ఆన్ లైన్ గేమ్స్ ఆడడానికి ఇష్టపడుతారు?