- Home
- Entertainment
- తెల్ల చీర కొప్పున మల్లెలు... కొంగు చాటు నుండి నెలవంక నడుము చూపిస్తూ ప్రియమణి టెంప్టింగ్ ఫోజులు!
తెల్ల చీర కొప్పున మల్లెలు... కొంగు చాటు నుండి నెలవంక నడుము చూపిస్తూ ప్రియమణి టెంప్టింగ్ ఫోజులు!
ప్రియమణి కొత్తపెళ్లి కూతురిలా ముస్తాబైంది. తెల్ల చీర కట్టిన ప్రియమణి కొప్పున మల్లెలు పెట్టారు. ఇక పైట చాటు నుండి నెలవంక నడుము చూపిస్తూ టెంప్ట్ చేసింది.సరికొత్త లుక్ లో ప్రియమణి మెస్మరైజ్ చేస్తుండగా ఫోటోలు వైరల్ అవుతున్నాయి.

మరోవైపు అమ్మడు కెరీర్ జెట్ స్పీడ్ తో దూసుకుపోతుంది. జాతీయ అవార్డు గెలుచుకున్న ప్రియమణి. అటు హీరోయిన్ గా ఇటు క్యారెక్టర్ రోల్స్ చేస్తూ బిజీ బిజీగా గడిపేస్తున్నారు. పలు రకాల పాత్రలకు ప్రియమణి బెస్ట్ ఛాయిస్ అయ్యారు. దీంతో ఆమెకు ఆఫర్లు క్యూ కడుతున్నాయి.
తెలుగులో ఆమె విరాటపర్వం చిత్రం చేశారు. ఆ మూవీలో ప్రియమణి లేడీ నక్సల్ రోల్ లో కనిపించారు. భారతక్క పాత్రలో ఆమె అలరించారు. రానా, సాయి పల్లవి ప్రధాన పాత్రల్లో తెరకెక్కిన విరాటపర్వం విమర్శకుల ప్రశంసలు అనుకుంది. అలాగే ప్రియమణి సైనైడ్ అనే బైలింగ్వెల్ మూవీలో నటిస్తున్నారు.
ప్రియమణి లిస్ట్ లో ఉన్న మరో క్రేజీ ప్రాజెక్ట్ షారుక్-అట్లీ చిత్రం. చిత్రీకరణ జరుపుకుంటున్న ఈ మూవీలో ప్రియమణి ఓ హీరోయిన్ గా నటిస్తున్నారు. ఈ మూవీలో నయనతార మెయిన్ హీరోయిన్ గా నటిస్తున్నారు. వీటితో పాటు హిందీ, కన్నడ, తమిళ భాషల్లో కలిపి ఐదారు చిత్రాలు చేస్తున్నారు. ప్రియమణి కి సెకండ్ ఇన్నింగ్స్ బాగా కలిసొచ్చింది. ఆమెను బిజీ యాక్ట్రెస్ గా మార్చేసింది. అద్భుతమైన యాక్టింగ్ స్కిల్స్ ఆమెకు వరుస ఆఫర్స్ తెచ్చిపెడుతున్నాయి.
ఫ్యామిలీ మాన్ సిరీస్ తో ప్రియమణి డిజిటల్ ప్లాట్ ఫార్మ్ లో కూడా అదరగొట్టారు. సీజన్ వన్ తో పాటు సీజన్ 2లో కూడా ఆమె నటించారు. సమంత, మనోజ్ బాజ్ పాయ్ ప్రధాన పాత్రలలో రూపొందిన ది ఫ్యామిలీ మాన్ 2 సిరీస్ లో ప్రియమణి మనోజ్ భార్య రోల్ చేయడం జరిగింది. సీజన్ వన్ లో కూడా ప్రియమణి మనోజ్ భార్య పాత్ర చేసిన విషయం తెలిసిందే.
ఇక ప్రియమణి వ్యక్తిగత జీవితంపై కొన్ని పుకార్లు చక్కర్లు కొట్టాయి. భర్త ముస్తఫా రాజ్ తో ఆమె విడిపోతున్నారని, ఇద్దరూ విడాకులకు సిద్ధమయ్యారని కథనాలు వెలువడ్డాయి. అయితే దీపావళి వేడుకలలో జంటగా కనిపించిన ప్రియమణి, ముస్తఫా... ఆ రూమర్స్ కి చెక్ పెట్టారు.ఈవెంట్ ఆర్గనైజర్ అయిన ముస్తఫా రాజ్.... వృతి రీత్యా చాలా కాలంగా అమెరికాలోనే ఉంటున్నారు. నటిగా బిజీగా ఉన్న ప్రియమణి ఇండియాకు పరిమితం అయ్యారు.
మరోవైపు ఢీ జడ్జిగా ప్రియమణి బుల్లితెర ప్రేక్షకులకు ఎంటర్టైన్ చేస్తుంది. ప్రస్తుతం ఢీ సీజన్ 14 నడుస్తుంది. ఈ సీజన్ కి కూడా ప్రియమణి జడ్జిగా వ్యవహరిస్తున్నారు. మరో జడ్జి పూర్ణతో పాటు యాంకర్స్ రష్మీ, సుడిగాలి సుధీర్, దీపికా పిల్లిని తొలగించిన నిర్వాహకులు ప్రియమణిని మాత్రం కొనసాగిస్తున్నారు.