- Home
- Entertainment
- సుడిగాలి సుధీర్ కి ఫ్లైయింగ్ కిస్సులు.. హైపర్ ఆదికి హగ్గులు.. అందరి ముందే హేబా పటేల్ నానా రచ్చ
సుడిగాలి సుధీర్ కి ఫ్లైయింగ్ కిస్సులు.. హైపర్ ఆదికి హగ్గులు.. అందరి ముందే హేబా పటేల్ నానా రచ్చ
సుడిగాలి సుధీర్ ఏం చేసినా రచ్చే. అది కచ్చితంగా హాట్ టాపిక్ అవుతుంది. లేటెస్ట్ గా ఆయనకు హీరోయిన్ హేబా పటేల్ ఫ్లైయింగ్ కిస్సు ఇవ్వడం చర్చనీయాంశమవుతుంది. సామాజిక మాధ్యమాల్లో వైరల్ అవుతుంది.

సుడిగాలి సుధీర్- రష్మిల(Sudigaali Sudheer-Rashmi) మధ్య ఉన్న ఎఫైర్, రిలేషన్ గురించి తెలిసిందే. ఈ ఇద్దరి మధ్య లవ్ స్టోరీ ఎప్పుడూ హైలైట్ అవుతుంది. అయితే రష్మితో కాకుండా సుధీర్ ఇతర అమ్మాయిలతోనే రచ్చ చేస్తూ వార్తల్లో నిలుస్తుంటారు. లేటెస్ట్ గా ఆయనకు హీరోయిన్ హేబా పటేల్ కిస్ పెట్టడం వైరల్‌గా మారింది. ఇదంతా `శ్రీదేవి డ్రామా కంపెనీ`లో కావడం విశేషం. సుడిగాలి సుధీర్ యాంకర్‌గా `శ్రీదేవి డ్రామా కంపెనీ`(Sridevi Drama Company) షో రన్ అవుతున్న విషయం తెలిసిందే. ఆదివారం ప్రసారం కానున్న ఈ షోకి సంబంధించిన లేటెస్ట్ ప్రోమో విడుదలై వైరల్ అవుతుంది.
ఈ ఎపిసోడ్‌కి `కుమారి 21 ఎఫ్` హీరోయిన్ హేబా పటేల్(Heba Patel) గెస్ట్ గా వచ్చింది. హాట్ అందాలతో క్యూట్ లుక్స్ తో కనువిందు చేసింది. ఈ సందర్భంగా సుధీర్ తాను హీరోగా ఓ సినిమా చేస్తున్నానని, అందుకో హీరోయిన్ కావాలని హేబా పటేల్‌ని అడగ్గా, ముందు ఆమె పెదవి విరుస్తుంది. అయితే ఆమని ఉండి ఆమెకు నువ్వు నచ్చలేదు సుధీర్ అంటుంది. దీనికి స్పందించిన హేబా పటేల్ `బాగా నచ్చారు` అంటూ ఏకంగా ఫ్లైయింగ్ కిస్ ఇవ్వడం విశేషం.
దీనికి స్పందించిన హేబా పటేల్ `బాగా నచ్చారు` అంటూ ఏకంగా ఫ్లైయింగ్ కిస్ ఇవ్వడం విశేషం. హేబా పటేల్ ఫ్లైయింగ్ కిస్‌కి సుడిగాలి సుధీర్ ఆనందానికి అవద్దుల్లేవు. తెగ సంబరపడిపోయారు. ఇక షో మొత్తం అరుపులతో హోరెత్తిపోయింది. ఈ సందర్బంగా తాగుబోతు రమేష్, ఇమ్మాన్యుయెల్ కలిసి హేబా పటేల్, సుధీర్‌లతో కలిసి తాగుబోతులుగా చేసిన కామెడీ ఆద్యంతం నవ్వులు పూయించింది. హైలైట్‌గా నిలిచింది.
అనంతరం హైపర్ ఆది, రామ్ ప్రసాద్ సీన్‌లోకి ఎంట్రీ ఇచ్చారు. ఇందులో ఆదికి వరుసగా హేబా పటేల్ హగ్గులిస్తూ రచ్చ రచ్చ చేసింది. మొదట వీరిద్దరు హేబా పటేల్ హగ్‌ల కోసం పోటీ పడ్డారు. శ్రీదేవి డ్రామా కంపెనీలోకి ఎవరైనా గెస్ట్ వస్తే ఒక అనవాయితీ ఉందని చెప్పగా, ముందుగా బావలకు హగ్ ఇవ్వాలని హైపర్ ఆది అంటాడు. దీంతో మరో ఆలోచన లేకుండా ఆదికి గట్టిగా హగ్ ఇస్తుంది హేబా పటేల్. దీంతో మరోసారి షో మొత్తం హోరెత్తిపోగా, పక్కన రాంప్రసాద్ నోరెళ్ల బెట్టారు.
దీనికి హర్ట్ అయిన రాంప్రసాద్ మనం అంతకు ముందు నీకోటి, నాకోటి అని మాట్లాడుకున్నాం కదరా, మరి ఇప్పుడేం జరుగుతుందని ప్రశ్నించగా, ఎక్కడో ఏదో తప్పు జరిగింది. మళ్లీ మొదట్నుంచి స్టార్ట్ చేద్దామని చెబుతాడు ఆది. ఆ తర్వాత కూడా హేబా పటేల్ ఆదికే హగ్ ఇస్తుంది. దీంతో మరింత రచ్చగా మారిపోయింది. శ్రీదేవి డ్రామా కంపెనీలో నవ్వులుతో మారుమ్రోగింది. రాంప్రసాద్ మరోసారి డిజప్పాయింట్ కాగా, స్కిట్ ఆద్యంతం నవ్వులు పూయించింది.
సుడిగాలి సుధీర్ హోస్ట్ గా రన్ అవుతున్న `శ్రీదేవిడ్రామా కంపెనీ` ప్రతి ఆదివారం మధ్యాహ్నం ఈటీవీలో ప్రసారం అవుతున్న విషయం తెలిసిందే. ఇక ఒకప్పుడు వరుస హిట్లతో క్రేజీ హీరోయిన్‌గా పేరుతెచ్చుకున్న ఈ భామ మధ్యలో గ్యాప్ తీసుకుంది. వరుస పరాజయాలు వెంటాడాయి. దీంతో ఆమెకి ఇప్పుడు ఛాన్స్ లు తగ్గాయి. మరోసారి ఆమె వెండితెరపై సందడి చేసేందుకు గట్టి ప్రయత్నాలు చేస్తుంది. మరి ఆమె ప్రయత్నాలు ఫలిస్తాయేమో చూడాలి.