MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
  • Home
  • Entertainment
  • చోటా కె నాయుడికి హరీష్‌ శంకర్‌ వార్నింగ్‌.. కెలికితే ఎక్కడైనా, ఎప్పుడైనా రెడీ అంటూ సవాల్‌.. నోట్‌ వైరల్‌

చోటా కె నాయుడికి హరీష్‌ శంకర్‌ వార్నింగ్‌.. కెలికితే ఎక్కడైనా, ఎప్పుడైనా రెడీ అంటూ సవాల్‌.. నోట్‌ వైరల్‌

సీనియర్‌ కెమెరామెన్‌ చోటా కె నాయుడుకి స్టార్‌ డైరెక్టర్‌ హరీష్‌ శంకర్‌ కౌంటర్‌ ఇచ్చాడు. ఎప్పుడైనా, ఎక్కడైనా చూసుకుందాం అంటూ వార్నింగ్‌ ఇచ్చాడు. అసలేం జరిగిందంటే.. 

3 Min read
Author : Aithagoni Raju
| Updated : Apr 21 2024, 01:00 PM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
19

ప్రముఖ తెలుగు సినిమాటోగ్రాఫర్‌ చోటా కె నాయుడికి దర్శకుడు హరీష్‌ శంకర్‌ వార్నింగ్‌ ఇచ్చాడు. తన గురించి తప్పుగా మాట్లాడినందుకు ఆయన ఫైర్‌ అయ్యాడు. తాను ఎప్పుడూ మీ గురించి తప్పుగా మాట్లాడలేదని, మీ వల్ల ఇబ్బంది పడ్డా ఆ విషయం ఎక్కడా చెప్పలేదని, తన గురించి మాత్రం చాలా సార్లు తప్పుగా మాట్లాడినా ఓర్చుకున్నానని, కానీ ప్రతిసారి అలా ఉండటం సాధ్యం కాదని వార్నింగ్‌ ఇచ్చాడు. తాము చేసిన సినిమా సమయంలో ఇబ్బంది పడ్డ విషయాన్ని చెబుతూ ఈ విషయాన్ని ఇంతటితో వదిలేయాలని, లేదు కెలుకుతానంటే ఎప్పుడైనా, ఎక్కడైనా నేను సిద్ధమే అంటూ బహిరంగ లేఖని పంచుకున్నారు హరీష్‌ శంకర్‌. 
 

గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండిgooglePreferred
29

మరి దర్శకుడు హరీష్‌ శంకర్ కి, కెమెరామెన్‌ చోటా కె నాయుడికి మధ్య గొడవేంటి? ఇంతకి హరీష్‌ శంకర్‌ గురించి చోటా ఏం తప్పుగా మాట్లాడాడు, అసలేం జరిగిందనేది చూస్తే.. ఇటీవల ఓ యూట్యూబ్‌ ఛానెల్‌కి ఇంటర్వ్యూ ఇచ్చాడు చోటా కె నాయుడు. ఇందులో హరీష్‌ శంకర్‌తో వర్క్ గురించి చెప్పారు. ఇద్దరు కలిసి `రామయ్య వస్తావయ్య` చిత్రానికి పని చేశారు. అయితే ఆ ఇంటర్వ్యూలో తన కెమెరా పనితనం, తన ప్రవర్తన ఎలా ఉంటుంది, సినిమాకి పనిచేసినప్పుడు ఎలా ఉంటాననేది వివరించారు చోటా కె నాయుడు. 

39

ఒకప్పుడు దర్శకులు సినిమాటోగ్రాఫర్‌కి ఫ్రీడమ్‌ ఇచ్చేవారని, ఇప్పుడు దర్శకుల వర్క్ వేరేలా ఉంటుందని, చెబితే వినడం లేదన్నారు. వాళ్లల్లో కొందరు కొత్త ఐడియాస్‌తో వస్తున్నారని కూడా చెప్పారు. అయితే ఏదైనా సమస్య వస్తే సాల్వ్ చేసుకుంటూ వచ్చానని, ఇలా అయితే ఇలా, కాకపోతే వేరేలా అన్ని సాల్వ్ చేసుకున్నానని చెప్పారు చోటా కె నాయుడు. ఈ క్రమంలో హరీష్‌ శంకర్‌తో చేసిన `రామయ్యా వస్తావయ్యా` అనుభవాన్ని పంచుకున్నారు. 
 

49

`హరీష్‌ శంకర్‌ తన ఐడియాలజీతో తాను ఉండేవాడు, అస్తమానం తనకు అడ్డుపడుతుండేవాడు. అది కాదన్నా, ఇది కాదన్నా అని అంటుండేవాడు. ట్రై చేశాను చెప్పడానికి. తను వినే మూడ్‌లో ఉండటం లేదు. ఇక చెప్పడం వదిలేశాను. ఆయనకి ఏం కావాలో అలా చేశాను, చెప్పడం వదిలేశాను. నా వద్ద రెండూ ఉంటాయి. మాగ్జిమమ్‌ కన్విన్స్ చేయడానికి ట్రై చేస్తాను. కన్విన్స్ అయితే ఓకే, కాకపోతే వాళ్లకి ఏం కావాలో అది ఇవ్వడానికి ప్రయత్నిస్తాను. ఆ విషయంలోనూ బెస్ట్ ఇస్తాను. కాకపోతే ఒక్క నిమిషం ఆ కోపం ఉంటుంది, ఆ సమయంలో రగిలిపోతాను. వాళ్లేదో ఆలోచించుకుని వస్తారు, వాళ్ల ఐడియా వాళ్లకి ఉంటుందని, వాళ్లు కూడా కరెక్ట్ అయి ఉండొచ్చు కదా` అని తెలిపారు ఛోటా. 
 

59

ఈ వీడియో క్లిప్‌ ట్విట్టర్‌లో వైరల్‌గా మారింది. ఇది చూసిన హరీష్‌ శంకర్‌ స్ట్రాంగ్‌గా రియాక్ట్ అయ్యాడు. తనదైన స్టయిల్‌లో ఓ లెటర్‌ని పంచుకున్నాడు. వయసులో పెద్ద కాబట్టి గౌరవిస్తూ.. చోటా కె నాయుడు గారికి నమస్కరిస్తూ `రామయ్య వస్తావయ్య` సినిమా వచ్చి దాదాపు దశాబ్దం దాటింది. ఈ పదేళ్లలో ఉదాహరణకి మీరు పది ఇంటర్వ్యూలు ఇస్తే, నేను ఒక వంద ఇచ్చి ఉంటా. కానీ ఎప్పుడూ ఎక్కడా కూడా నీ గురించి తప్పుగా మాట్లాడలేదు. మీరు మాత్రం పలుమార్లు నా గురించి అవమానంగా మాట్లాడారు. 

69

మీకు గుర్తుందో లేదో ఓ సందర్భంలో మిమ్మల్ని తీసేసి వేరే కెమెరామెన్తో షూటింగ్‌ చేద్దాం అన్న ప్రస్తావన వచ్చింది. కానీ రాజుగారు చెప్పడం మూలంగానో, `గబ్బర్‌ సింగ్‌` వచ్చాక పొగరుతో పెద్ద కెమెరామెన్‌ని తీసేస్తున్నారు అని పది మంది పలు రకాలుగా మాట్లాడుకుంటారని మధనపడుతూనే మీతో సినిమా పూర్తి చేశా. ఆ సినిమా ఆశించిన విజయం సాధించకున్నా ఏ రోజు ఆ నింద మీ మీద మోపలేదు. ఎందుకంటే `గబ్బర్‌ సింగ్` వచ్చినప్పుడు నాది, `రామయ్య వస్తావయ్య` వస్తే అది నీది అనే క్యారెక్టర్‌ కాదు నాది. మీరు మాత్రం ఇంటర్వ్యూ చేసే వ్యక్తి అడగకపోయినా నా ప్రస్తావన రాకున్నా, నాకు సంబంధం లేకుండా నా గురించి అవమానకరంగా మాట్లాడుతున్నారు. 
 

79

ఎందుకంటే `గబ్బర్‌ సింగ్` వచ్చినప్పుడు నాది, `రామయ్య వస్తావయ్య` వస్తే అది నీది అనే క్యారెక్టర్‌ కాదు నాది. మీరు మాత్రం ఇంటర్వ్యూ చేసే వ్యక్తి అడగకపోయినా నా ప్రస్తావన రాకున్నా, నాకు సంబంధం లేకుండా నా గురించి అవమానకరంగా మాట్లాడుతున్నారు. ఇలా చాలా సార్లు జరిగినా నేను మౌనంగానే బాధపడ్డా, కానీ నా స్నేహితులు అవ్వచ్చు, నన్ను అభిమానించే వాళ్లు అవ్వచ్చు నా ఆత్మ అభిమానాన్ని ప్రశ్నిస్తుండటంతో ఈ మాత్రం రాయాల్సి వస్తుంది.

89

మీతో పనిచేసిన అనుభవం నన్ను బాధపెట్టినా, మీకున్న అనుభవంతో నేను కొన్ని విషయాలు నేర్చుకున్నాను. అందుకే మీరంటే ఇంకా నాకు గౌరవం ఉంది దయజేసి ఈ గౌరవాన్ని కాపాడుకోండి. ఈ విషయాన్ని ఇక్కడితో వదిలేయండి. కాదు కూడదు మళ్లీ కెలుక్కుంటాను అంటే ఏ రోజైనా, ఎక్కడైనా నేను వెయిటింగ్‌` అంటూ వార్నింగ్‌తో కూడిన కౌంటర్‌ ఇచ్చాడు దర్శకుడు హరీష్‌ శంకర్‌. ట్విట్టర్‌ ద్వారా పంచుకున్నారు. ఇది వైరల్‌ అవుతుంది. పెద్ద రచ్చ అవుతుంది. 
 

99

 ఎన్టీఆర్‌ హీరోగా, సమంత, శృతి హాసన్‌ హీరోయిన్లుగా నటించిన `రామయ్యా వస్తావయ్యా` చిత్రానికి హరీష్‌ శంకర్‌ దర్శకత్వం వహించారు. దీనికి చోటా కె నాయుడు కెమెరామెన్‌. దిల్‌ రాజు నిర్మించారు. 2013లో వచ్చిన ఈ చిత్రం పరాజయం చెందింది. ఇక ప్రస్తుతం హరీష్‌ శంకర్‌.. పవన్‌ కళ్యాన్‌తో `ఉస్తాద్‌ భగత్‌ సింగ్‌`, రవితేజతో `మిస్టర్‌ బచ్చన్‌` చిత్రాలు తీస్తున్నారు. 

About the Author

AR
Aithagoni Raju
అయితగోని రాజు 2020 నుంచి ఏషియానెట్‌ తెలుగులో వర్క్ చేస్తున్నారు. ఆయనకు టీవీ, ప్రింట్‌, డిజిటల్‌ జర్నలిజంలో 13ఏళ్ల అనుభవం ఉంది. ప్రధానంగా న్యూస్‌, సినిమా జర్నలిజం, ఎంటర్‌టైన్‌మెంట్‌ రంగంలో ప్రముఖ సంస్థల్లో వర్క్ చేశారు. ప్రపంచ సినిమాని `షో`(నవతెలంగాణ) పేరుతో రాసిన ప్రత్యేక కథనాలు విశేష గుర్తింపుని తెచ్చిపెట్టాయి. ప్రస్తుతం ఏషియానెట్‌ తెలుగులో ఎంటర్‌టైన్‌ మెంట్ టీమ్‌ని లీడ్‌ చేస్తున్నారు. సబ్‌ ఎడిటర్‌గానే రిపోర్టర్ గా సినిమా ఫీల్డ్ అనుభవం ఉంది. ఎంటర్‌టైన్‌మెంట్‌ విభాగంలో సినిమా, టీవీ, ఓటీటీ కి సంబంధించి ఆసక్తికర కథనాలను, సినీ ఇండస్ట్రీలోని విషయాలను, సినిమా రివ్యూలు, విశ్లేషణాత్మక కథనాలు రాయడంలో మంచి పట్టు ఉంది. క్వాలిటీ కంటెంట్‌ని అందిస్తూ, క్వాలిటీ జర్నలిజాన్ని ముందుకు తీసుకెళ్లడంలో తనవంతు కృషి చేస్తున్నారు.
పవన్ కళ్యాణ్

Latest Videos
Recommended Stories
Recommended image1
Mahesh Babu: మరదలిని మోసం చేసిన మహేష్ బాబు .. నమ్రత, శిల్పల సీక్రెట్ ప్లాన్ ఏంటో తెలుసా?
Recommended image2
Venu Swamy: పవన్ కళ్యాణ్, జూనియర్ ఎన్టీఆర్ అభిమానుల మధ్య చిచ్చు పెట్టిన వేణు స్వామి, సీఎం పోస్ట్ పై సంచలన జోస్యం
Recommended image3
Pawan Kalyan: చివరి కోరిక తీరకుండానే పవన్ ఫ్యాన్ మృతి..ఆ కుటుంబానికి అండగా సోనూసూద్
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved