పుష్ప మూవీపై పవన్ కళ్యాణ్ కామెంట్స్ ? హరీష్ శంకర్ హానెస్ట్ ఒపీనియన్ ఇదే, ఆ మూవీస్ అన్ని చెబుతూ..
ఓ ఇంటర్వ్యూలో హరీష్ శంకర్ కి పుష్ప చిత్రానికి సంబంధించిన ప్రశ్న ఎదురైంది. ఇటీవల ఏపీ ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ బెంగుళూరులో పర్యటించారు.
డైరెక్టర్ హరీష్ శంకర్ తెరకెక్కించిన మిస్టర్ బచ్చన్ చిత్ర సందడి మొదలయింది. రవితేజ, భాగ్యశ్రీ జంటగా నటించిన ఈ చిత్రాన్ని హరీష్ శంకర్ హిందీ రైడ్ ఆధారంగా తెరకెక్కించారు. గురువారం సాయంత్రం నుంచి ప్రీమియర్ షోలు మొదలయ్యాయి. సినిమా ఎలా ఉండబోతోందో మరికొన్ని గంటల్లో తేలిపోతుంది.
అయితే హరీష్ శంకర్ ప్రచార కార్యక్రమాలతో బిజీగా గడుపుతున్నారు. ఓ ఇంటర్వ్యూలో హరీష్ శంకర్ కి పుష్ప చిత్రానికి సంబంధించిన ప్రశ్న ఎదురైంది. ఇటీవల ఏపీ ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ బెంగుళూరులో పర్యటించారు. అటవీశాఖ గురించి కర్ణాటన ప్రభుత్వంతో చర్చించేందుకు ఆయన బెంగుళూరు వెళ్లారు.
ఈ సందర్భంగా పర్యావరణం, అడవుల గురించి మాట్లాడుతూ.. ఒకప్పుడు అడవులని సంరక్షించే వారిని హీరోలుగా చూపించారు. అప్పటి హీరోలు అడవులని రక్షించే వారిగా సినిమాలు చేశారు. కానీ ఇప్పుడు సాంప్రదాయం మారింది. స్మగ్లర్లని, అడవులని ధ్వంసం చేసే వారిని హీరోలుగా చూపిస్తున్నారు. అలాంటి చిత్రాలు వస్తున్నాయి అని పవన్ కళ్యాణ్ సంచలన వ్యాఖ్యలు చేశారు.
పవన్ చేసిన వ్యాఖ్యలు అల్లు అర్జున్ పుష్ప చిత్రం గురించేనా అంటూ పెద్ద ఎత్తున చర్చ జరిగింది. తాజాగా ఈ ప్రశ్న హరీష్ శంకర్ కి ఎదురైంది. పవన్ కామెంట్స్ పై మీ అభిప్రాయం ఏంటి అని అడగగా.. పవన్ కళ్యాణ్ గారు అటవీ శాఖకి కూడా మంత్రి. ఆ హోదాలో ఒకప్పుడు సినిమాల్లో ఇలా ఉండేది.. ఇప్పుడు ఇలా ఉంది అని తన అభిప్రాయం చెప్పారు. ఒక మంత్రిగా అడవులని దృష్టిలో పెట్టుకునికి చేసిన వ్యాఖ్యలు అవి.
అయితే హరీష్ శంకర్ తన అభిప్రాయం చెబుతూ.. షారుఖ్ ఖాన్ కి ఫస్ట్ బ్రేక్ ఇచ్చిన చిత్రం భాజిగర్. ఆ చిత్రంలో షారుఖ్ ఇద్దరు అమ్మాయిలని చంపేస్తాడు. ఆ మూవీ సూపర్ హిట్... జనాలకు నచ్చింది కదా అని అన్నారు. నార్కోస్ సిరీస్ ఎంత పెద్ద హిట్ అయిందో చూశాం. సినిమా ప్రభావం సమాజం మీద ఉండదు. ఇది ఖచ్చితంగా చెప్పగలను.
పుష్ప చిత్రం చూడగానే కుర్రాళ్ళు ఎవరూ లాప్ ట్యాప్ లు పక్కన పెట్టి గొడ్డలితో అడవికి వెళ్ళరు. సినిమా ప్రభావం కొన్ని గంటలు మాత్రమే ఉంటుంది. అయితే సెలెబ్రిటీలుగా మాపై కొంత రెస్పాన్సిబిలిటీ ఉంటుంది. పర్యావరణం గురించి, డ్రగ్స్ అవేర్నెస్ గురించి ప్రజల్లో క్యాంపైన్ చేయాల్సిన భాద్యత తమపై ఉందని హరీష్ శంకర్ తెలిపారు.