కర్ణుడు, అర్జునుడు లాంటి వీరులతో సినిమా ప్లానింగ్.. కల్కి తరహాలో, తన ఆలోచన బయట పెట్టిన హరీష్ శంకర్
డైరెక్టర్ హరీష్ శంకర్ కమర్షియల్ చిత్రాలని తనదైన శైలిలో తెరకెక్కిస్తూ టాలీవుడ్ లో క్రేజీ డైరెక్టర్ గా మారారు. ప్రస్తుతం హరీష్ శంకర్ మాస్ మహారాజ్ రవితేజ తో మిస్టర్ బచ్చన్ అనే చిత్రాన్ని తెరకెక్కిస్తున్నారు.
డైరెక్టర్ హరీష్ శంకర్ కమర్షియల్ చిత్రాలని తనదైన శైలిలో తెరకెక్కిస్తూ టాలీవుడ్ లో క్రేజీ డైరెక్టర్ గా మారారు. ప్రస్తుతం హరీష్ శంకర్ మాస్ మహారాజ్ రవితేజ తో మిస్టర్ బచ్చన్ అనే చిత్రాన్ని తెరకెక్కిస్తున్నారు. ఈ చిత్రం ఆగష్టు 15న గ్రాండ్ రిలీజ్ కి రెడీ అవుతోంది.
హరీష్, రవితేజ కాంబోలో వస్తున్న మూడవ చిత్రం ఇది. ఆల్రెడీ షాక్, మిరపకాయ్ లాంటి చిత్రాలు వచ్చాయి. ప్రచార కార్యక్రమాలు జోరుగా సాగుతున్నాయి. ఈ చిత్ర టీజర్ రిలీజ్ చేసిన సందర్భంగా హరీష్ శంకర్ మీడియాతో మాట్లాడారు.
మీడియా ప్రతినిధులు అడిగిన ప్రశ్నలకు సమాధానం ఇచ్చారు. ఓ మీడియా ప్రతినిధి హరీష్ శంకర్ ని ప్రభాస్ కల్కి చిత్రం గురించి ప్రశ్నించారు. మీకు కూడా పురాణాలపై మంచి అవగాహన ఉంది. కల్కి తరహాలో ఏదైనా చిత్రం చేసే ఆలోచన ఉందా అని ప్రశ్నించారు.
దీనికి హరీష్ శంకర్ బదులిస్తూ.. కల్కి చిత్రం నా దృష్టిలో ఒక వండర్. కల్కి లాంటి చిత్రం చేయాలని నేను ఎప్పుడూ ఆలోచించలేదు. కానీ ఇతిహాసాల్లోని సారాంశం అర్థం అయ్యేలా.. ధర్మరాజు, భీముడు, అర్జునుడు, కర్ణుడు, పరశురాముడు లాంటి వీరుల క్వాలిటీస్ ఉండే హీరోయిజాన్ని వెండి తెరపై చూపించాలని ఉన్నట్లు హరీష్ శంకర్ తెలిపారు.
కల్కి చిత్రంలో నాగ్ అశ్విన్.. కర్ణుడి వీరత్వాన్ని చూపించే ప్రయత్నం చేశారు. బహుశా కల్కి పార్ట్ 2 లో కర్ణుడు ప్రస్తావన ఇంకా ఎక్కువ ఉండే అవకాశం ఉంది.