- Home
- Entertainment
- `హరిహర వీరమల్లు` రియల్ స్టోరీ కాదు.. శివుడు, విష్ణువుల అవతారం.. పెద్ద ట్విస్ట్ ఇచ్చిన నిర్మాత
`హరిహర వీరమల్లు` రియల్ స్టోరీ కాదు.. శివుడు, విష్ణువుల అవతారం.. పెద్ద ట్విస్ట్ ఇచ్చిన నిర్మాత
పవన్ కళ్యణ్ నటించిన `హరిహర వీరమల్లు` మూవీ సినిమా కథకి సంబంధించి వివాదం నెలకొన్న నేపథ్యంలో నిర్మాత ఏఎం రత్నం బిగ్ టిస్ట్ ఇచ్చారు. ఇది రియల్ స్టోరీ కాదంటూ షాకిచ్చారు.
- FB
- TW
- Linkdin
Follow Us

`హరిహర వీరమల్లు` స్టోరీ వివాదంపై ఏఎం రత్నం వివరణ
పవన్ కళ్యాణ్ హీరోగా 'హరి హర వీరమల్లు` చిత్రం రూపొందిన విషయం తెలిసిందే. ఈ నెల 24న ఈ చిత్రం ఆడియెన్స్ ముందుకు రాబోతుంది.
తెలంగాణకు చెందిన ఓ వీరుడి కథ ఆధారంగా రూపొందించబడిందని వార్తలు వస్తున్నాయి. కొందరు ఈ కథ విషయంలో అభ్యంతరం వ్యక్తం చేస్తున్నారు.
ఈ క్రమంలో తాజాగా దీనిపై నిర్మాత ఏఎంరత్నం స్పందించారు. ఈ వార్తల్లో వాస్తవం లేదని తెలిపారు. ఈ చిత్రం నిజ జీవితంలోని ఏ ఒక్క నాయకుడి కథ ఆధారంగానూ తెరకెక్కలేదు.
సనాతన ధర్మాన్ని పరిరక్షించే ఓ వీరుడి ప్రయాణాన్ని తెలిపే కల్పిత కథగా ఇది తెరకెక్కిందని తాజాగా నిర్మాత తెలిపారు.
కల్పిత కథతో `హరిహర వీరమల్లు`
`జ్యోతి కృష్ణ దర్శకత్వ బాధ్యతలు చేపట్టిన తర్వాత 'హరి హర వీరమల్లు' కథ పూర్తిగా మారిపోయింది. దర్శకుడు కథలోని స్ఫూర్తిని, సారాన్ని అలాగే ఉంచుతూ సరికొత్త కథగా దీనిని మలిచారు.
పురాణాల ప్రకారం, అయ్యప్ప స్వామిని శివుడు-మోహినిల కుమారుడిగా, శైవం, వైష్ణవం మధ్య వారధిగా ఎలా వర్ణిస్తారో, అలాగే 'హరి హర వీరమల్లు'ను శివుడు, విష్ణువుల అవతారంగా చూడబోతున్నాం` అని ఆయన వెల్లడించారు.
శివుడు, విష్ణువుల అవతారం `వీరమల్లు`
`హరిహర వీరమల్లు` కథ పరంగా ఈ విషయాన్ని నిర్మాత వివరిస్తూ, హరి(విష్ణు), హర(శివుడు) అనే టైటిల్ ఈ చిత్ర సారాంశాన్ని తెలియజేస్తుంది.
శివుడు, విష్ణువుల అవతారం 'వీరమల్లు' అని తెలిపేలా ఈ చిత్రంలో పలు అంశాలను గమనించవచ్చు. విష్ణువు వాహనం గరుడ పక్షిని సూచించే డేగను ఈ చిత్రంలో ఉపయోగించాం.
అలాగే, కథానాయకుడు తన చేతుల్లో శివుడిని సూచించే డమరుకం పట్టుకున్నాడు. హీరో ధర్మాన్ని రక్షించడానికి, ధర్మం కోసం పోరాడటానికి శివుడు, విష్ణువుల రూపంగా కనిపిస్తాడు` అని వివరించారు. ఇదిప్పుడు అందరిని ఆశ్చర్యపరుస్తుంది.
`హరిహర వీరమల్లు` హక్కులకు తీవ్ర పోటీ
'హరి హర వీరమల్లు' సినిమాను ఎ.ఎం. రత్నం సుమారు రెండు వందల కోట్ల బడ్జెట్‌తో నిర్మించిన్నట్టు తెలుస్తోంది. రాజీపడకుండా నిర్మాత ఏఎం రత్నం ఈ మూవీని నిర్మించినట్టు సమాచారం.
పవన్ కళ్యాణ్ నటించిన తొలి పాన్ ఇండియా సినిమా కావడంతో మరింత కేర్ తీసుకున్నట్టు తెలుస్తోంది. ఇటీవల విడుదలైన ట్రైలర్ అందరినీ విశేషంగా ఆకట్టుకొని, అంచనాలను రెట్టింపు చేసింది.
దాంతో ఈ చిత్ర హక్కులను దక్కించుకోవడానికి బయ్యర్ల మధ్య తీవ్ర పోటీ నెలకొందని తెలుస్తోంది. భారీ మొత్తాన్ని చెల్లించి, హక్కులను పొందేందుకు వారు సిద్ధంగా ఉన్నారట.
జులై 24న `హరిహర వీరమల్లు` విడుదల
ఇదిలా ఉంటే సినిమాపై నమ్మకంతో ఓవర్సీస్, హిందీ రైట్స్ తప్ప, మిగిలిన సౌత్ ఇండియాకి సంబంధించిన హక్కులను అమ్మడానికి నిర్మాత సిద్ధంగా లేరని సమాచారం.
'హరి హర వీరమల్లు' చిత్రం జూలై 24వ తేదీన ప్రపంచవ్యాప్తంగా భారీస్థాయిలో విడుదల కానుంది. మరి సినిమాపై భారీ అంచనాలున్న నేపథ్యంలో ఆ అంచనాలను మూవీ అందుకుంటుందా అనేది చూడాలి.
జ్యోతికృష్ణ దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రంలో పవన్ కళ్యాణ్ వీరమల్లు పాత్రలో కనిపిస్తారని తెలుస్తోంది. నెగటివ్ రోల్‌లో బాబీ డియోల్ నటిస్తున్నారు. నిధి అగర్వాల్ పవన్‌కి జోడీగా చేస్తుంది.