MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
TRENDING :
IMD Weather Update
Today's Rasi Phalalu
Pakistan Economic Crisis
Epic First Semester BO Collections
Megastar Chiranjeevi
Bigg Boss Telugu 10
Srikanth Daughter Medha Meka
Asian Games 2026
IMD Weather Update
Today's Rasi Phalalu
Jr NTR Injury Update
OTT Releases This Week
Actress Roja Selvamani
Team India Captain
Dimpu Kallem Asha
Abhishek Sharma
Missing Meghana Movie Review
Getup Srinu Remuneration
Chicken Curry Recipe
  • Home
  • Entertainment
  • ఓటీటీలోకి `హరి హర వీరమల్లు`, ఈ రాత్రి నుంచే.. పవన్‌ కళ్యాణ్‌ మూవీ బాక్సాఫీసు ఫైనల్‌ కలెక్షన్లు

ఓటీటీలోకి `హరి హర వీరమల్లు`, ఈ రాత్రి నుంచే.. పవన్‌ కళ్యాణ్‌ మూవీ బాక్సాఫీసు ఫైనల్‌ కలెక్షన్లు

పవన్‌ కళ్యాణ్‌ నటించిన `హరి హర వీరమల్లు` మూవీ ఇప్పుడు ఓటీటీలోకి రాబోతుంది. సడెన్‌ సర్‌ప్రైజింగ్‌గా ఈ రాత్రి నుంచే ఓటీటీలో స్ట్రీమింగ్‌ కానుంది. 

2 Min read
Author : Aithagoni Raju
Published : Aug 19 2025, 09:05 PM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
15
థియేటర్లలో నిరాశ పరిచిన `హరి హర వీరమల్లు`
Image Credit : Asianet News

థియేటర్లలో నిరాశ పరిచిన `హరి హర వీరమల్లు`

పవర్‌ స్టార్‌ పవన్‌ కళ్యాణ్‌ నటించిన `హరి హర వీరమల్లు` మూవీ గత నెలలో ఆడియెన్స్ ముందుకు వచ్చింది. హిస్టారికల్‌ కథాంశంతో రూపొందిన ఈ మూవీ జులై 24న భారీగా విడుదలైంది. పవన్‌ నటించిన తొలి పాన్‌ ఇండియా మూవీ కావడంతో ఆ అంచనాలు భారీగానే ఉన్నాయి. జ్యోతికృష్ణ, క్రిష్‌ దర్శకత్వం వహించిన ఈ చిత్రానికి మొదటి ఆట నుంచే మిశ్రమ స్పందన లభించింది. వీఎఫ్‌ఎక్స్ పరంగా విమర్శలు ఎదుర్కొంది. అదే సమయంలో ఎమోషన్స్ పండలేదనే టాక్‌ వినిపించింది. దీనికితోడు ఐదేళ్లుగా సినిమా తీయడంతో కొంత కంటిన్యూటీ కూడా మిస్‌ అయ్యింది.

DID YOU
KNOW
?
తొలి పాన్‌ ఇండియా మూవీ
`హరి హర వీరమల్లు` పవన్‌ కళ్యాణ్‌ నటించిన తొలి పాన్‌ ఇండియా మూవీ. అదే సమయంలో తొలి హిస్టారికల్‌ చిత్రం కావడం విశేషం.
గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండిgooglePreferred
25
`హరి హర వీరమల్లు` మూవీ కలెక్షన్లు
Image Credit : Asianet News

`హరి హర వీరమల్లు` మూవీ కలెక్షన్లు

మొత్తంగా `హరి హర వీరమల్లు` బాక్సాఫీసు వద్ద నిరాశపరిచిందని చెప్పొచ్చు. ఈ మూవీ సుమారు రూ.200కోట్ల బడ్జెట్‌తో రూపొందింది. రిలీజ్‌కి ముందు థియేట్రికల్‌ బిజినెస్‌ రూపంలో రూ. 126కోట్లు వచ్చాయి. అలాగే ఓటీటీ రూపంలోనూ భారీగానే వచ్చింది. ఇక దాదాపు రూ.130కోట్ల బ్రేక్‌ ఈవెన్‌ టార్గెట్‌తో విడుదలైన ఈ చిత్రం మొదటి రోజు భారీగానే రాబట్టుకున్నా, ఆ తర్వాత డీలా పడిపోయింది. రెండో రోజు నుంచే కలెక్షన్లు తగ్గాయి. దాదాపు మూడు వారాలపాటు థియేటర్లలో సందడి చేసిన ఈ చిత్రం ఫైనల్‌గా వరల్డ్ వైడ్‌గా రూ.118కోట్ల గ్రాస్‌ వసూళ్లని రాబట్టింది. సుమారు రూ.60కోట్ల షేర్‌ వచ్చింది.

35
`హరి హర వీరమల్లు` బిగ్గెస్ట్ లాస్‌
Image Credit : X/Mega Surya Production

`హరి హర వీరమల్లు` బిగ్గెస్ట్ లాస్‌

`హరి హర వీరమల్లు` మూవీ నిర్మాతలకు, బయ్యర్లకి సుమారు రూ.60కోట్ల వరకు నుంచి ఎనభై కోట్ల వరకు నష్టాలను తీసుకొచ్చిందని ట్రేడ్‌ వర్గాల సమాచారం.  ఈ సినిమా కోసం పవన్‌ కూడా పారితోషికం తీసుకోలేదు. అడ్వాన్స్ రూపంలో కొంత తీసుకున్నా, దాన్ని మళ్లీ వెనక్కి ఇచ్చేశారు. సినిమా విడుదలయ్యాక, ఆడితే తీసుకుంటానని తెలిపారు. సినిమా ఆడకపోవడంతో ఆయన పారితోషికం లేకుండానే ఈ సినిమా చేశాడని చెప్పొచ్చు. ఇక ఇందులో నిధి అగర్వాల్‌ హీరోయిన్‌గా నటించగా, బాబీ డియోల్‌ విలన్‌గా నటించారు. ఏఎం రత్నం నిర్మించారు.

45
ఓటీటీలోకి `హరి హర వీరమల్లు`
Image Credit : Asianet News

ఓటీటీలోకి `హరి హర వీరమల్లు`

మొన్నటి వరకు థియేటర్లలో సందడి చేసిన `హరి హర వీరమల్లు` ఇప్పుడు ఓటీటీలో సందడి చేయబోతుంది. ఈ రాత్రి నుంచే ఓటీటీలోకి రాబోతుంది. అమెజాన్‌ ప్రైమ్‌లో ఆగస్ట్ 20(బుధవారం) నుంచి స్ట్రీమింగ్‌ అవుతుంది. అంటే ఈ అర్థ రాత్రి నుంచి ఓటీటీ రచ్చ చేయబోతుంది. మరి థియేటర్లలో నిరాశ పరిచిన ఈ మూవీ ఓటీటీలోనైనా ఆకట్టుకుంటుందా అనేది ఆసక్తికరంగా మారింది. ఓటీటీ రిజల్ట్ ఎలా ఉంటుందో చూడాలి.

55
`హరి హర వీరమల్లు ` మూవీ కథ ఇదే
Image Credit : Facebook /Mega Surya Production

`హరి హర వీరమల్లు ` మూవీ కథ ఇదే

`హరి హర వీరమల్లు` మూవీ కొహినూర్‌ వజ్రం చుట్టూ తిరుగుతుంది. అదే సమయంలో దీన్ని మొఘల్‌ రాజు ఔరంగ జేబ్‌ ఆగడాలను ప్రధానంగా చేసుకుని రూపొందించారు. 17వ శతాబ్దంలో ఔరంగజేబ్‌ హిందువుగా బతకాలంటే జిజియా పన్ను కట్టాలనే నిబంధన తీసుకొచ్చారు. దాన్ని వ్యతిరేకించిన రాజులను అత్యంత కిరాతకంగా చంపేశారు. ఆయనకు వ్యతిరేకంగా వీరమల్లు పోరాటం చేస్తుంటారు. అదే సమయంలో ఔరంగ జేబు వద్ద ఉన్న కొహినూర్‌ వజ్రాన్ని దొంగిలించేందుకు ఢిల్లీకి బయలుదేరడం, ఈ జర్నీలో తాను ఎదుర్కొన్న సవాళ్లు, ఫేస్‌ చేసిన అనుభవాల ప్రధానంగా ఈ సినిమా సాగింది.

About the Author

AR
Aithagoni Raju
అయితగోని రాజు 2020 నుంచి ఏషియానెట్‌ తెలుగులో వర్క్ చేస్తున్నారు. ఆయనకు టీవీ, ప్రింట్‌, డిజిటల్‌ జర్నలిజంలో 13ఏళ్ల అనుభవం ఉంది. ప్రధానంగా న్యూస్‌, సినిమా జర్నలిజం, ఎంటర్‌టైన్‌మెంట్‌ రంగంలో ప్రముఖ సంస్థల్లో వర్క్ చేశారు. ప్రపంచ సినిమాని `షో`(నవతెలంగాణ) పేరుతో రాసిన ప్రత్యేక కథనాలు విశేష గుర్తింపుని తెచ్చిపెట్టాయి. ప్రస్తుతం ఏషియానెట్‌ తెలుగులో ఎంటర్‌టైన్‌ మెంట్ టీమ్‌ని లీడ్‌ చేస్తున్నారు. సబ్‌ ఎడిటర్‌గానే రిపోర్టర్ గా సినిమా ఫీల్డ్ అనుభవం ఉంది. ఎంటర్‌టైన్‌మెంట్‌ విభాగంలో సినిమా, టీవీ, ఓటీటీ కి సంబంధించి ఆసక్తికర కథనాలను, సినీ ఇండస్ట్రీలోని విషయాలను, సినిమా రివ్యూలు, విశ్లేషణాత్మక కథనాలు రాయడంలో మంచి పట్టు ఉంది. క్వాలిటీ కంటెంట్‌ని అందిస్తూ, క్వాలిటీ జర్నలిజాన్ని ముందుకు తీసుకెళ్లడంలో తనవంతు కృషి చేస్తున్నారు.
పవన్ కళ్యాణ్
తెలుగు సినిమా
ఓటీటీ
ఏషియానెట్ న్యూస్
 

Latest Videos
Recommended Stories
Recommended image1
వర్షిణి కోసం దేబ్జానీకి అన్యాయం చేసిన ముఖేష్, చేపల మార్కెట్ లా తయారైన బిగ్ బాస్ హౌస్..
Recommended image2
Ambika Vs Radha: రాధ కంప్లైంట్‌పై అంబిక కౌంటర్.. మోసపోయింది నేనే అంటూ చెల్లికి అక్క ట్విస్ట్
Recommended image3
Michael Jackson: రజనీకాంత్ కోసం మైఖేల్ జాక్సన్ పాడాల్సింది.. 16 ఏళ్ల తర్వాత తమన్ చెప్పిన సీక్రెట్!
Related Stories
Recommended image1
బిగ్‌ బాస్‌ తెలుగు 9 `అగ్నిపరీక్ష`లో మతిపోయే రూల్స్.. అవి ఫాలో అయితేనే కంటెస్టెంట్లుగా ఛాన్స్
Recommended image2
`వార్ 2` ఐదు రోజుల కలెక్షన్లు.. 5 బాక్సాఫీసు రికార్డులు బద్దలు కొట్టిన ఎన్టీఆర్ మూవీ
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved