- Home
- Entertainment
- `వార్ 2` ఐదు రోజుల కలెక్షన్లు.. 5 బాక్సాఫీసు రికార్డులు బద్దలు కొట్టిన ఎన్టీఆర్ మూవీ
`వార్ 2` ఐదు రోజుల కలెక్షన్లు.. 5 బాక్సాఫీసు రికార్డులు బద్దలు కొట్టిన ఎన్టీఆర్ మూవీ
ఎన్టీఆర్, హృతిక్‌రోషన్ కలిసి నటించిన `వార్ 2` మూవీ బాక్సాఫీసు వద్ద స్ట్రగుల్ అవుతుంది. కానీ ఇది 5 రోజుల్లోనే 5 కొత్త రికార్డులు క్రియేట్ చేసింది.

ఐదు సినిమా రికార్డులు బ్రేక్ చేసిన `వార్ 2`
ఎన్టీఆర్, హృతిక్‌రోషన్ కలిసి నటించిన `వార్ 2` సినిమా యష్ రాజ్ ఫిలిమ్స్ స్పై యూనివర్స్ లోని 3 సినిమాల రికార్డులను బద్దలు కొట్టింది. `ఈక్ థా టైగర్`, `టైగర్ జిందా హై`, `టైగర్ 3` సినిమాల కన్నా ఎక్కువ కలెక్షన్స్ సాధించింది.
KNOW
`ఛావా` ఫస్ట్ డే రికార్డు బ్రేక్ చేసిన `వార్ 2`
`వార్ 2` బాలీవుడ్‌లో మరో రికార్డు క్రియేట్ చేసింది. ఇది 2025 లో విడుదలైన విక్కీ కౌశల్ నటించిన `ఛావా` సినిమా కన్నా ఎక్కువ కలెక్షన్స్ సాధించింది. `ఛావా` సినిమా మొదటి రోజు రూ.33.10 కోట్లు వసూలు చేయగా, `వార్ 2` ఫస్ట్ డే రూ.52.5 కోట్లు వసూలు చేసింది.
`వార్` కలెక్షన్లని దాటేసిన `వార్ 2`
`వార్ 2` సినిమాతో హృతిక్ రోషన్ కి, తారక్‌లకు ప్రపంచవ్యాప్తంగా మంచి క్రేజ్ ఏర్పడింది. 2019 లో వచ్చిన `వార్` సినిమా కన్నా ఈ సినిమా ఎక్కువ కలెక్షన్స్ సాధించింది.
`బ్రహ్మాస్త్ర` రికార్డులు బ్రేక్ చేసిన `వార్ 2`
దర్శకుడు అయాన్ ముఖర్జీ కి `వార్ 2` సినిమా లక్కీగా మారింది. ఆయన దర్శకత్వం వహించిన `బ్రహ్మాస్త్ర` కన్నా ఈ సినిమా ఎక్కువ కలెక్షన్స్ సాధించింది.
`గేమ్ ఛేంజర్` కన్నా ఎక్కువ కలెక్షన్లు
`వార్ 2` సినిమా కియారా అద్వానీ కెరీర్ లో బిగ్గెస్ట్ ఓపెనర్ గా నిలిచింది. ఆమె నటించిన `గేమ్ ఛేంజర్` సినిమా కన్నా ఇది ఎక్కువ కలెక్షన్స్ సాధించింది. `వార్ 2` సినిమా ఇండియన్ బాక్సాఫీస్ దగ్గర ఇప్పటివరకు 183.25 కోట్లు వసూలు చేసింది. ప్రపంచవ్యాప్తంగా ఐదు రోజుల్లో ఏకంగా రూ.281కోట్లు రాబట్టింది. ఐదో రోజు ఇది పది కోట్ల వరకు వసూళు చేయడం విశేషం. అయితే చిత్ర నిర్మాణ సంస్థ మాత్రం రూ.300కోట్లు రాబట్టినట్టు ప్రకటించడం గమనార్హం. ఈ మూవీ రూ.700కోట్ల గ్రాస్ వస్తే బ్రేక్ ఈవెన్ అవుతుంది. మరి అంత వరకు వెళ్తుందా అనేది చూడాలి.