- Home
- Entertainment
- నిడివి తగ్గిన `హరి హర వీరమల్లు`, ఆ సీన్లన్నీ డిలీట్.. కొత్త వెర్షన్ ఎంత ఉంటుందంటే ?
నిడివి తగ్గిన `హరి హర వీరమల్లు`, ఆ సీన్లన్నీ డిలీట్.. కొత్త వెర్షన్ ఎంత ఉంటుందంటే ?
పవన్ కళ్యాణ్ నటించిన `హరి హర వీరమల్లు` మూవీలో వీఎఫ్‌ఎక్స్ సన్నివేశాలపై నెగటివ్ టాక్ వచ్చిన నేపథ్యంలో టీమ్ రియాక్ట్ అయ్యింది. నిడివి తగ్గించింది.

`హరి హర వీరమల్లు` సినిమా నిడివి తగ్గింపు
`హరి హర వీరమల్లు` మూవీకి థియేటర్లలో సందడి చేస్తోంది. సినిమాకి మిశ్రమ లభిస్తోంది. ప్రీమియర్ షోస్, మార్నింగ్ షోస్‌తో పోల్చితే మధ్యాహ్నం షోకి టాక్ పెరిగిందని, పాజిటివ్‌గా వినిపిస్తుందని టాక్.
అదే సమయంలో సినిమాకి సంబంధించి కొంత నెగటివ్ టాక్ వస్తోంది. కొన్ని సీన్ల విషయంలో ఆడియెన్స్ నుంచి మేజర్‌గా కంప్లెయింట్ వస్తోంది. ఈ నేపథ్యంలో చిత్ర బృందం కీలక నిర్ణయం తీసుకుంది. నిడివి తగ్గించింది.
`హరి హర వీరమల్లు` సెకండాఫ్‌లో ఆ సీన్లు ట్రిమ్
`హరి హర వీరమల్లు` మూవీని ట్రిమ్ చేసింది టీమ్. సినిమాలోని సెకండాఫ్ లో హార్స్ రైడింగ్ సీన్ల విషయంలో వీఎఫ్‌ఎక్స్ కి సంబంధించిన ప్రధానమైన కంప్లెయింట్ వస్తోంది.
దీంతో ఆ ఎపిసోడ్లని డిలీట్ చేశారట. హార్స్ రైడ్‌కి సంబంధించిన చాలా సీన్లని డిలీట్ చేశారట. అదే సమయంలో తోడేలుకి సంబంధించిన సీన్ కూడా లేపినట్టు తెలుస్తోంది.
కొహినూర్ వజ్రం కోసం చేసే జర్నీకి సంబంధించిన సీన్లని చాలా వరకు తొలగించారని, నాసికరంగా అనిపించిన వీఎఫ్‌ఎక్స్ సీన్లని డిలీజ్ చేసినట్టు తెలుస్తోంది.
ఇరవై నిమిషాలు ట్రిమ్ చేసిన టీమ్
సినిమాలోని సెకండాఫ్‌లో ఓ పది పదిహేను నిమిషాలను ట్రిమ్ చేయాలనుకున్నారు. కానీ ఫైనల్‌గా సినిమా మొత్తంలో ఇరవై నిమిషాల వరకు ట్రిమ్ చేసినట్టు సమాచారం. ఈ మూవీ నిడివి గం.2.42 నిమిషాలు.
ఇప్పుడు ఇరవై నిమిషాల వరకు కట్ చేయడంతో రెండు గంటల 22 నిమిషాలే ఉంటుందని తెలుస్తోంది. ట్రిమ్ చేయడం అయిపోయింది, ఆల్‌రెడీ అన్ని థియేటర్లలో అప్ డేట్ అయినట్టు సమాచారం.
ఇప్పుడు ఫైనల్‌గా `హరి హర వీరమల్లు` మూవీ రెండు గంటల 22 నిమిషాలు ఉంటుందని తెలుస్తోంది. చాలా క్రిస్పీగా ఉండేలా ఈ ఎడిటింగ్ చేసినట్టు, గురువారం రాత్రి షోల నుంచే ఇది అప్ డేట్ అయినట్టు సమాచారం. ఇప్పుడు కొత్త వెర్షన్ మూవీనే ఆడియెన్స్ ని చూడబోతున్నారని, ఇది సర్‌ప్రైజ్‌గా చెప్పొచ్చు.
నెగటివ్ టాక్‌పై పవన్ కళ్యాణ్ కామెంట్
అయితే దీనిపై పవన్ కళ్యాణ్ కూడా స్పందించారు. `హరి హర వీరమల్లు` మూవీ సక్సెస్ మీట్‌ని గురువారం నిర్వహించిన విషయం తెలిసిందే.
ఇందులో పవన్ కళ్యాణ్ మాట్లాడుతూ సినిమాపై సోషల్ మీడియాలో నెగటివ్ కామెంట్లకి బాధ పడవద్దని, వాటిని లైట్ తీసుకోవాలని, మన గురించి విమర్శలు చేస్తున్నారంటే, మనం ఆ స్థాయిలో ఉన్నామని అర్థం చేసుకోవాలి, మన స్థాయి ఏంటో వాళ్లు మనకు గుర్తు చేస్తున్నారనే విషయాన్ని గమనించాలని చెప్పారు.
అదే సమయంలో వాటిని పెద్దగా పట్టించుకోవద్దు అని చెప్పారు. తమ గురించి ఏదైనా కామెంట్ పెడితే అక్కడే ప్రతిస్పందించాలని, అలానే ఎదుర్కోవాలని తెలిపారు పవన్.
ఫ్యాన్స్ లో జోష్ నింపే కామెంట్స్ చేశారు. టాక్ విషయంలో ఎవరూ బాధపడొద్దని, జీవితాన్ని ఎంజాయ్ చేయాలి తెలిపారు పవన్. ఆయన కామెంట్స్ వైల్ అవుతున్నాయి.
`హరి హర వీరమల్లు` మూవీ అసలు టీమ్ ఇదే
పవన్ కళ్యాణ్ హీరోగా, జ్యోతికృష్ణ దర్శకత్వంలో రూపొందిన `హరి హర వీరమల్లు` మూవీ గురువారం విడుదలైంది. ఇందులో నిధి అగర్వాల్ హీరోయిన్‌గా నటించగా, అనసూయ ఓ పాటలో మెరిసింది.
బాబీ డియోల్ నెగటివ్ రోల్‌లో ఔరంగజేబ్ పాత్రలో నటించగా, సునీల్, రఘుబాబు, నాజర్ ముఖ్య పాత్రలు పోషించారు. అనుదీప్ కొన్నిసెకన్లు మెరిసిన విషయం తెలిసిందే. ఏఎం రత్నం ఈ మూవీని నిర్మించారు.