Star Heroes: సినిమాల్లోకి రాకముందు ఈ హీరోలు ఏం చేసేవారో తెలుసా?
Star Heroes: సినిమా రంగంలో ప్రస్తుతం అగ్ర స్థానంలో ఉన్న హీరోలు అందరూ ఒకేసారి స్టార్లు కాలేదు. వారి కఠోర శ్రమ వారిని ఈ స్టాయికి చేర్చింది. అసలు ఈ సినిమాల్లోకి రాకముందు మీరు మెచ్చిన కొందరు స్టార్స్ ఏ ఫీల్డ్ లో ఉన్నారో మీకు తెలుసా?

Star Heroes
సినిమా హీరోలకు ఉండే క్రేజ్ గురించి స్పెషల్ గా చెప్పక్కర్లేదు. వారి ప్రతి సినిమానీ థియేటర్ కి వెళ్లి చూడటమే కాకుండా.. వారికి సంబంధించిన ప్రతి విషయాన్ని పండగలా చేసుకునేవారు అభిమానులు చాలా మంది ఉన్నారు. వాళ్ల లాగే తాము కూడా హీరోలు అవ్వాలని కలులు కంటూ ఉంటారు. అయితే.. ఇప్పుడు ఇండస్ట్రీలో ఉన్న చాలా మంది హీరోలు మొదటి నుంచి సినిమానే తమ కెరీర్ గా మార్చుకోలేదు. మొదట వేరే పనులు చేసి.. ఆ తర్వాత హీరోలు అయినవారు కూడా ఉన్నారు. అలాంటి కొందరు హీరోల గురించి చూద్దాం...
లెజెండరీ స్టార్స్...
రజినీకాంత్: భాషతో సంబంధం లేకుండా దేశవ్యాప్తంగా ఫ్యాన్స్ ఉన్న హీరో రజినీకాంత్.. ఆయన సూపర్ స్టార్ కాకముందు బెంగళూరులో బస్ కండక్టర్ గా పని చేశారు. అక్కడ టికెట్లు ఇచ్చేటప్పుడు ఆయన చూపించే స్టైలే ఆయన్ని సినిమా రంగానికి పరిచయం చేసింది.
మోహన్ బాబు..
కలెక్షన్ కింగ్ మోహన్ బాబు గారు సినిమాల్లోకి రాకముందు ఒక పాఠశాలలో పీఈటీ టీచర్ గా పని చేశారు.
బ్రహ్మానందం.. వెయ్యికి పైగా సినిమాల్లో నటించిన గిన్నీస్ రికార్డ్ హోల్డర్ బ్రహ్మానందం ఒకప్పుడు తెలుగు లెక్చరర్ గా పని చేశారు.
క్రేజీ హీరోలు..
యష్ .. కన్నడ ఇండస్ట్రీ నుండి పాన్ ఇండియా స్టార్ గా ఎదిగిన యష్, తన కెరీర్ మొదట్లో ఒక సీరియల్ యాక్టర్ గా చేశారు. సీరియల్ యాక్టర్ గా క్రేజ్ పెరిగిన తర్వాత సినిమాల్లో స్టార్ హీరోగా ఎదిగారు
నాని (Nani): నేచురల్ స్టార్‌గా పేరు తెచ్చుకున్న నాని, సినిమాల్లోకి రాకముందు రేడియో జాకీ (Radio Jackie) గా తన ప్రయాణాన్ని మొదలుపెట్టారు. తర్వాత అసిస్టెంట్ డైరెక్టర్ గా కూడా పని చేశారు.
అజిత్ కుమార్ (Ajith Kumar): కోలీవుడ్ స్టార్ హీరో అజిత్, సినిమా రంగంలోకి అడుగుపెట్టక ముందు ఒక మెకానిక్ గా ఉండేవారు.
సాఫ్ట్ వేర్ నుంచి సినిమాల్లోకి...
నవీన్ పోలిశెట్టి.. జాతిరత్నాలు మూవీతో క్రేజ్ సంపాదించుకున్న హీరో నవీన్ పోలిశెట్టి లండన్ లో సాఫ్ట్ వేర్ ఇంజినీర్ గా పని చేశారు. నటపై ఆసక్తితో ఆ ఉద్యోగం వదిలేసి ఇండస్ట్రీకి వచ్చారు.
శ్రీవిష్ణు: విభిన్నమైన కథలను ఎంచుకునే శ్రీవిష్ణు సినిమాల్లోకి రాకముందు ఒక కార్పొరేట్ కంపెనీలో పనిచేశారు. అంతేకాదు, ఆయన మంచి క్రికెట్ ప్లేయర్ కూడా.
విజయ్ సేతుపతి: 'మక్కల్ సెల్వన్' విజయ్ సేతుపతి సినిమాల్లోకి రాకముందు దుబాయ్‌లో అకౌంటెంట్‌గా పనిచేశారు.

