- Home
- Entertainment
- అమెరికాలో పుట్టిన శ్రీలీల బెంగుళూరు ఎందుకు షిఫ్ట్ అయ్యింది... యంగ్ బ్యూటీ గురించి మీకు తెలియని విశేషాలు!
అమెరికాలో పుట్టిన శ్రీలీల బెంగుళూరు ఎందుకు షిఫ్ట్ అయ్యింది... యంగ్ బ్యూటీ గురించి మీకు తెలియని విశేషాలు!
యంగ్ బ్యూటీ శ్రీలీల బర్త్ డే నేడు. అభిమానులు, చిత్ర ప్రముఖులు శుభాకాంక్షలు తెలియజేస్తున్నారు. ఈ సందర్భంగా శ్రీలీల గురించి ఆసక్తికర విషయాలు ఇవే...

Sreeleela
శ్రీలీల 2001 జూన్ 14న అమెరికాలో పుట్టింది. అయితే ఈమె పుట్టేనాటికి తల్లి స్వర్ణలత భర్తతో విడిపోయారు. విడాకులు తీసుకున్నారు. దాంతో అమెరికా నుండి బెంగుళూరు వచ్చేశారు. శ్రీలీల తల్లి డాక్టర్ అని సమాచారం. ప్రస్తుతం శ్రీలీల ఎం బి బి ఎస్ చదువుతుంది.
తాజాగా శ్రీలీలా బ్యూటీఫుల్ లుక్ లో దర్శనమిచ్చింది. ఎక్కువగా ట్రెడిషనల్ వేర్స్ లో మెరుస్తున్న ఈ ముద్దుగుమ్మ తాజాగా కలర్ ఫుల్ చుడీదార్ లో ఫొటోషూట్ చేసింది. అందుకు సంబంధించిన వీడియోను అభిమానులతో పంచుకుంది.
చిన్నప్పటి నుండి శ్రీలీల భరతనాట్యం నేర్చుకుంది. ఆమె ప్రొఫెషనల్ డాన్సర్. పలు వేదికల మీద ప్రదర్శనలు ఇచ్చింది. కెజిఎఫ్ సినిమాటోగ్రాఫర్ భువన్ గౌడ శ్రీలీల మీద ఫోటో షూట్ చేశారు. ఆమె లుక్స్ నచ్చి దర్శకుడు ఏపీ అర్జున్ కిస్ మూవీలో ఛాన్స్ ఇచ్చాడు. ఫస్ట్ మూవీతోనే కుర్రాళ్ళ హృదయాలు కొల్లగొట్టింది. ఆ వెంటనే భరాతే అనే చిత్రం చేసింది.
Sreeleela
మూడో చిత్రంతో టాలీవుడ్ లో అడుగు పెట్టింది. శ్రీకాంత్ తనయుడు రోషన్ హీరోగా తెరకెక్కిన పెళ్ళిసందD చిత్రంలో శ్రీలీల హీరోయిన్ గా నటించింది. ఈ మూవీ యావరేజ్ టాక్ తెచ్చుకుంది. అయితే శ్రీలీల టాలీవుడ్ మేకర్స్ కంట్లో పడ్డారు. ధమాకా మూవీతో ఫస్ట్ హిట్ కొట్టింది. రవితేజకు జంటగా ఆమె నటించిన ధమాకా మంచి విజయం సాధించింది.
రవితేజ ఎనర్జీకి ఏమాత్రం తగ్గకుండా శ్రీలీల పోటీ ఇచ్చింది. శ్రీలీల పరిశ్రమలో అడుగుపెట్టాక చాలా మంది హీరోయిన్స్ చాప చుట్టేశారు. ప్రస్తుతం ఆమె చేతిలో అరడజనుకు పైగా తెలుగు చిత్రాలు ఉన్నాయి. ఉస్తాద్ భగత్ సింగ్, భగవంత్ కేసరి, గుంటూరు కారం, విజయ్ దేవరకొండ 12వ చిత్రం, రామ్-బోయపాటి మూవీ, నితిన్ 32వ చిత్రం, ఆదికేశవ చిత్రాల్లో నటిస్తుంది.
శ్రీలీల టాలెంటెడ్ హీరోయినే కాదు తెలివిగల అమ్మాయి కూడా. అతికొద్ది రోజులో తెలుగు నేర్చుకుంది. అది కూడా ఆమెకు ప్లస్ అవుతుంది.శ్రీలీల వయసు కేవలం 22 ఏళ్ళు కాగా... రానున్న కాలంలో మరిన్ని అద్భుతాలు చేయడం ఖాయం. ఈ కన్నడ చిన్నదానికి సోషల్ మీడియా వేదికగా శుభాకాంక్షలు వెల్లువెత్తుతున్నాయి.