MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
  • Home
  • Entertainment
  • #Hanuman ఊచకోత, తెలుగులో ఎంత షేర్ వస్తుందో తెలిస్తే మతిపోతుంది

#Hanuman ఊచకోత, తెలుగులో ఎంత షేర్ వస్తుందో తెలిస్తే మతిపోతుంది

 రెండో రోజు అదే స్దాయిలో మాసివ్ గ్రోత్ కనపడింది. ట్రేడ్ కు షాక్ ఇస్తున్న  నేపధ్యంలో తెలుగులో ఎంత షేర్ రావచ్చు అనేది అంచనా వేస్తున్నారు. 

3 Min read
Author : Surya Prakash
Published : Jan 14 2024, 08:11 AM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
17
Guntur Kaaram hanuman

Guntur Kaaram hanuman


 
 సంక్రాంతి విన్నర్ గా హనుమాన్ ఫిక్సైపోయింది అంటోంది ట్రేడ్. సైంధవ్ కూడా అటూ ఇటూగా ఉండటంతో  వార్ వన్ సైడ్ అయ్యిపోయింది.  బాక్స్ ఆఫీస్ ఆఫీస్ దగ్గర చిన్న సినిమాగా రిలీజ్ అయిన హానుమాన్(HanuMan Movie) అదిరిపోయే  కలెక్షన్స్ తో  దూసుకుపోతంది. లిమిటెడ్ రిలీజ్ తోనే ఊరమాస్ ఓపెనింగ్స్ ను సొంతం చేసుకుని రచ్చ రచ్చ చేయటం ట్రేడ్ కు షాక్ ఇస్తోంది. ఎక్సపెక్టేషన్స్  అన్నీ మించిపోయే రేంజ్ లో ఊచకోత కోసిన ఈ సినిమా సాలిడ్ నంబర్స్ ను నమోదు చేయటంతో సినీ లవర్స్ లో  ఇదే హాట్ టాపిక్ గా మారింది. 

27
Hanuman

Hanuman


సినిమా బాక్స్ ఆఫీస్ దగ్గర ప్రీమియర్స్ ద్వారా ఓవరాల్ 2.85 కోట్ల రేంజ్ లో షేర్ ని సొంతం చేసుకున్న ఈ చిత్రం  మొదటి రోజు గుంటూరు కారం నుండి భారీ పోట్ని తట్టుకుని కూడా సినిమా మొదటి రోజు ఏకంగా 5.12 కోట్ల రేంజ్ లో షేర్ ని సొంతం చేసుకుంది.  సినిమా ఓవర్సీస్ లో కూడా ప్రీమియర్స్ అండ్ డే 1 కలెక్షన్స్ తో ఆల్ మోస్ట్ 0.9 మిలియన్ మార్క్ ని అందుకున్న ఈ సినిమా తొలిరోజు వరల్డ్ వైడ్ గ్రాస్ లెక్క 24.50 కోట్ల దాకా రాబట్టడం మామూలు విషయం కాదు. రెండో రోజు అదే స్దాయిలో మాసివ్ గ్రోత్ కనపడింది. ట్రేడ్ కు షాక్ ఇస్తున్న  నేపధ్యంలో తెలుగులో ఎంత షేర్ రావచ్చు అనేది అంచనా వేస్తున్నారు.

37
Guntur Kaaram hanuman

Guntur Kaaram hanuman

ఇప్పటి ట్రెండ్ ని బట్టి ,అడ్వాన్స్ బుక్కింగ్ లని బట్టి రాబోయే మూడు రోజులు టెర్రిఫిక్ గా ఉంటుంది. మొదటి రోజు కన్నా రెండో రోజు బాగా పెరిగింది. మూడో రోజు ఇంకా భీబత్సం జరగనుంది. ఇదే రన్ కొనసాగితే ఫెస్టివల్ డేస్ దాటాకా కూడా ఇలాగే ఉంటే ఖచ్చితంగా తెలుగులో ఫుల్ రన్ కి 100 కోట్ల షేర్ వస్తుందని అంచనా వేస్తున్నారు.

47


ఇక అనేక చిత్రాల్లో బాల నటుడిగా ప్రేక్షకులను అలరించిన తేజ సజ్జ (Teja Sajja) తాజా చిత్రం ‘హను-మాన్‌’ (Hanu Man). ప్రశాంత్‌ వర్మ దర్శకత్వం వహించిన ఈ సినిమా సంక్రాంతి కానుకగా జనవరి 12న విడుదల అయ్యింది. మరోవైపు, సూపర్ స్టార్ మహేశ్‌ బాబు (Mahesh Babu)- డైరెక్టర్‌ త్రివిక్రమ్‌ కాంబినేషన్‌లో రూపొందిన ‘గుంటూరు కారం’ (Guntur Kaaram) ఈ రోజున అయ్యింది. ఈ నేపధ్యంలో చిత్రంకు థియేటర్స్ తక్కువ కేటాయించారని వివాదాలు సైతం వచ్చాయి. అయితే నార్త్ మార్కెట్ ని భారీగా టార్గెట్ చేస్తున్న ‘హను-మాన్‌’ పూర్తి రికవరీ మోడ్ లో ఉందని ట్రేడ్ అంటోంది.  

57


అలాగే ఈ చిత్రం  27 కోట్లకు అమ్మారని తెలుస్తోంది. ప్రశాంత్ వర్మ సినిమాల్లో ఇదే హైయిస్ట్ రేటు పలికిన చిత్రం. ఈ సినిమా నైజాం ఏరియా  7.15 కోట్లు, సీడెడ్ 4 కోట్లు, ఆంధ్రా ఏరియాకు  9.5 కోట్లు అమ్ముడయ్యాయి. అలాగే రెస్టాఫ్ ఇండియా 2 కోట్లు, ఓవర్ సీస్ లో 4 కోట్లు మొత్తం మీద 26.65 కోట్లు బిజినెస్ అయ్యింది. ఇప్పుడున్న పాజిటివ్  ట్రెండ్ ని బట్టి చూస్తే అన్నీ ఏరియాలు లాభాలు చూస్తారని  చెప్తున్నారు. 
 

67


 మరో ప్రక్క   డిజిట‌ల్, శాటిలైట్ రైట్స్ ద్వారా మెజారిటీ రిక‌వ‌రీ అయింద‌ని స‌మాచారం.  ఈ చిత్రం నాన్ థియేటర్ బిజినెస్ రైట్స్ ని Zee గ్రూప్ వారు 30 కోట్లకు తీసుకున్నట్లు తెలుస్తోంది. దాంతో బడ్జెట్ లో సగం అక్కడే రికవరీ అయ్యింది. తెలుగు రాష్ట్రాల్లో మరో 20 కోట్లుకు బిజినెస్ చేసారని తెలుస్తోంది. అలా మొత్తం 50 కోట్ల వరకూ బడ్జెట్ నాన్ థియేటర్ రైట్స్, తెలుగు రాష్ట్రాల బిజినెస్ తో రికవరీ అయ్యిందని సమాచారం. ఇక సినిమా ఓవర్ సీస్, తెలుగు రాష్ట్రాలు కాకుండా దేశంలో మిగతా ప్రాంతాలు, ముఖ్యంగా నార్త్ బెల్ట్  మంచి బిజినెస్ చేసాయి. డిస్ట్రిబ్యూటర్ రికవరీ రెట్టింపు పైగైనే ఉంటుందని అంచనా వేస్తున్నారు. 

77


   తేజ సజ్జా హీరోగా నటించిన ‘హనుమాన్’ మూవీ ఒక సూపర్ హీరో చిత్రంగా తెరకెక్కింది. ఈ మూవీలో హీరోయిన్‌గా అమృతా అయ్యర్ నటించింది. వరలక్ష్మి శరత్‌కుమార్ మరో కీలక పాత్ర పోషించింది. ఇప్పటికే ఈ మూవీ విడుదలయ్యిన మంచి టాక్ తెచ్చుకుని,  పిల్లలను ,  విపరీతంగా ఆకట్టుకుంటోంది.  పైగా తెలుగులో మాత్రమే కాదు.. ‘హనుమాన్’ను పాన్ ఇండియా రేంజ్‌లో విడుదల చేసాన్నారు కాబట్టి ఇతర భాషల్లో కూడా ప్రమోషన్స్ భారీగానే జరిగింది.
 

About the Author

SP
Surya Prakash
తెలుగు సినిమా జర్నలిజం లో గత ఇరవై ఏళ్లుగా ఉన్నారు. కొన్ని వందల రివ్యూలు, విశ్లేషణాత్మక ఆర్టికల్స్ రాశారు. ఈయన ప్రముఖ సినీ విమర్శకుడు కూడా.
దిల్ రాజు

Latest Videos
Recommended Stories
Recommended image1
Prabhas Fauzi: ప్రభాస్ ఫౌజీ సెట్‍లో లీకులు.. మేకర్స్ సీరియస్ వార్నింగ్ ఎవరికి?
Recommended image2
ఉస్తాద్ భగత్ సింగ్ కు షాక్ ఇచ్చిన రాకాస కలెక్షన్స్, నిజమెంత? రెండు రోజుల్లో ఎంత కలెక్ట్ చేసింది?
Recommended image3
Rashmika Mandanna మాత్రమే టాప్ లో ఎలా? ఇండియన్ సినిమాను ఏలడానికి కారణాలివే
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved