ప్రభాస్ తో చేయబోయే చిత్రం ఎలాంటి కథో చెప్పిన హను రాఘవపూడి..
అసలు హను, ప్రభాస్ కాంబోలో ప్రాజెక్ట్ ఉందా ?.. ఎప్పుడు స్టార్ట్ అవుతుంది ? అనే సందేహాలు వ్యక్తమయ్యాయి. అయితే ఈ విషయాలపై క్లారిటీ వచ్చేసినట్లు అయ్యింది.

ప్రభాస్ ఇప్పుడు వరస ప్రాజెక్టులతో ఫుల్ బిజీగా దూసుకుపోతున్న సంగతి తెలిసిందే. సలార్ మూవీతో బ్లాక్ బస్టర్ హిట్ అందుకున్న ప్రభాస్. ఇప్పుడు కల్కి ప్రాజెక్ట్ కోసం కష్టపడుతున్నాడు. డైరెక్టర్ నాగ్ అశ్విన్ తెరకెక్కిస్తున్న ఈ సినిమాపై ఇప్పటికే ఓ రేంజిలో ఎక్సపెక్టేషన్స్ ఉన్నాయి. మరో ప్రక్క మారుతి దర్శకత్వంలో రాజాసాబ్ మూవీ చేస్తున్నాడు. ఇందులో వింటెజ్ ప్రభాస్ ను అడియన్స్ ముందుకు తీసుకురానున్నారు. అలాగే సీతారామం ఫేమ్ డైరెక్టర్ హను రాఘవపూడి డైరెక్షన్లో ఓ ప్రాజెక్ట్ చేయనున్నారు. ఈ ప్రాజెక్టులో ప్రభాస్ ఏ జానర్ లో సినిమా చేయబోతన్నారనే విషయమై హను రాఘవపూడి క్లారిటీ ఇచ్చారు.
రీసెంట్ గా NIT వరంగల్ లో ఓ పంక్షన్ కు హను రాఘవపూడి చీఫ్ గెస్ట్ గా హాజరయ్యారు. అక్కడ స్టూడెంట్స్ తో మాట్లాడుతూ తన తదుపరి ప్రాజెక్టు గురించి చెప్పుకొచ్చారు. తన నెక్ట్స్ ప్రభాస్ తోనే అని క్లారిటీ ఇచ్చారు. అదే సమయంలో ఈ సినిమా ఏ జానర్ లో ఉండబోతోందనేది తెలియబరిచారు.
హను రాఘవపూడి మాట్లాడుతూ... “నా అప్ కమింగ్ ఫిల్మ్ ప్రభాస్ తోనే. అది ఓ పీరియడ్ యాక్షన్ డ్రామా. ఇది చారిత్రక ఫిక్షన్ చిత్రం. విశాల్ చంద్రశేఖర్ ఈ చిత్రం కోసం ఇప్పటికే మూడు పాటలు పూర్తి చేసారు. ” అని చెప్పుకొచ్చారు. ఈ స్టేట్మెంట్ తో అసలు హను, ప్రభాస్ కాంబోలో ప్రాజెక్ట్ ఉందా ?.. ఎప్పుడు స్టార్ట్ అవుతుంది ? అనే సందేహాలు వ్యక్తమయ్యాయి. అయితే ఈ విషయాలపై క్లారిటీ వచ్చేసినట్లు అయ్యింది.
Prabhas
ఇక డైరెక్టర్ హను గతంలో తెరకెక్కించిన లవ్ స్టోరీస్ మాదిరిగా కాకుండా పీరియాడిక్ యాక్షన్ డ్రామాగా ఉండబోతుందని చెప్పటంతో ఖచ్చితంగా కొత్త కథ చూడబోతున్నారనే ఆనందం ఫ్యాన్స్ లో కనిపిస్తోంది.. ప్రీ ఇండిపెండెన్స్ టైం లైన్ తో రజాకార్ నేపథ్యంలో ఈ మూవీని రూపొందించనున్నారని వినికిడి. అలాగే యుద్ధం బ్యాక్ డ్రాప్ తో ఈ సినిమా స్టోరీ ఉండనుందని తెలుస్తోంది.
Prabhas
ఈ సినిమాని మైత్రీ మూవీస్ వారు నిర్మిస్తున్నారు. ప్రస్తుతం ప్రీ ప్రొడక్షన్ వర్క్ జరుగుతుందని సమాచారం. దీంతో ఇప్పుడ హను, ప్రభాస్ ప్రాజెక్ట్ పై మరింత క్యూరియాసిటి నెలకొంది. ఈ సినిమా గురించి ఎప్పుడు అఫీషియల్ అనౌన్స్మెంట్ వస్తుందో చూడాలి. హను రాఘవపూడి చివరిగా ‘సీతారామం’ వంటి లవ్ స్టోరీతో ఆడియన్స్ ముందుకు వచ్చి బ్లాక్ బస్టర్ విజయాన్ని అందుకున్నారు. అంతకముందు కృష్ణగాడి వీరప్రేమగాధ, అందాల రాక్షసి, లై, పడి పడి లేచే మనసు సినిమాలు తెరకెక్కించారు.
Prabhas
ప్రస్తుతం ప్రభాస్ కల్కి, రాజాసాబ్ చిత్రీకరణలో బిజీగా ఉన్నాడు. ఈ రెండు సినిమాల షూటింగ్స్ చివరి దశకు చేరుకున్నాయి. అలాగే సలార్ 2, స్పిరిట్ మూవీస్ ప్రీ ప్రొడక్షన్ వర్క్ జరుపుకుంటున్నాయి. ఈ మూవీల గురించి నెట్టింట ప్రచారం నడుస్తుంది. కానీ ఇప్పటివరకు ఎలాంటి అఫీషియల్ అనౌన్మెంట్ రాలేదు.