- Home
- Entertainment
- Hansika New Movie : కొంచెం గ్యాప్ ఇచ్చిన హన్సిక.. గ్యాప్ లేకుండా సినిమా చేస్తోంది..
Hansika New Movie : కొంచెం గ్యాప్ ఇచ్చిన హన్సిక.. గ్యాప్ లేకుండా సినిమా చేస్తోంది..
‘దేశముదురు’తో తెలుగు ప్రేక్షకులకు పరిచయం అయిన హన్సిక మోత్వాని (Hansika Motwani) 2019 నుంచి సినిమాలకు కొంచెం గ్యాప్ ఇచ్చింది. ప్రస్తుతం అరడజను సినిమాల్లో నటిస్తూ బిజీ అయ్యిందీ మస్కా బ్యూటీ. తాజాగా మరో చిత్రానికి కూడా గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది.

గ్లామర్ తో ‘దేశముదురు’లను సైతం తన వెంటపడేలా చేసిన హీరోయిన్ హన్సిక మోత్వాని (Hansika Motwani). 16 ఏండ్లకే టాలీవుడ్ లో ఎంట్రీ ఇచ్చి యూత్ ను తన మాయలోకి లాగింది. గత రెండేండ్లుగా సినిమాకు గ్యాప్ ఇచ్చి.. మెస్మైరైజ్ చేసే బ్యూటీతో మళ్లీ వెట మొదలెట్టింది.
హన్సిక హీరోయిన్ గా తన డెబ్యూ ఫిల్మ్ తెలుగులో చేసినా.. హిందీలో చైల్డ్ ఆర్టిస్ట్ గా తన కేరీర్ ను స్టార్ట్ చేసింది. 2001 నుంచి 2004 వరకు చైల్డ్ ఆర్టిస్ట్ గా కొనసాగింది. ఆ తర్వాత స్టార్ డైరెక్టర్ పూరీ జగన్నాథ్ (Puri Jagganadh) హన్సికను ‘దేశముదురు’తో తెలుగు ఆడియెన్స్ కు పరిచయం చేశారు.
ఆ తర్వాత వరుస సినిమాలతో సందడి చేసింది. ‘కంత్రి, మస్కా, బిల్లా, జయీ భవ, సీతా రాముల కళ్యాణం, కందిరీగ, హో మై ఫ్రెండ్, సింగం 2, పవర్’సినిమాల్లో నటించి తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకుంది. అయితే తెలుగులో హన్సిక చివరిగా దర్శకుడు జీ నాగేశ్వర రెడ్డి తెరకెక్కించిన ‘తెనాలి రామకృష్ణ బీఏ. బీఎల్’ మూవీతో సందీప్ కిషన్ సరసన నటించింది. ఈ మూవీ 2019లో రిలీజ్ అయ్యింది.
అప్పటి నుంచి రెండేండ్ల పాటు గ్యాప్ తీసుకుంది. ఎలాంటి సినిమాలకు సైన్ చేయలేదు. కానీ గేడాది నుంచి వరుస సినిమాలకు ఒకే చెప్పుకొస్తుంది. ప్రస్తుతం హన్సిక తెలుగు, తమిళ భాషలో కలిపి మొత్తం ఆరు సినిమాల్లో నటిస్తోంది. కాగా కోలీవుడ్‌లో నాలుగు సినిమాలు చేస్తూ బిజీ అవుతోంది. తాజాగా సైన్స్ ఫిక్షన్ చిత్రంలో ప్రధాన పాత్రను పోషించేందుకు సిద్ధమయ్యారు.
ఆర్.కన్నన్ దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రాన్ని తనమసాలా, ఫోకస్ ఫిలిమ్స్ సంస్థలు సంయుక్తంగా నిర్మిస్తున్నాయి. ఈ చిత్రం మంగళవారం చెన్నైలో పూజా కార్యక్రమాలతో ప్రారంభమైంది. ఫైనాన్సియర్ మహీంద్ర నిహార్ కెమెరా స్విచ్ఛాన్ చేశారు.
ఈ మూవీలో హన్సిక ‘నేత్ర’ అనే యువ సైంటిస్ట్‌గా నటిస్తున్నారని దర్శక నిర్మాత ఆర్.కన్నన్ తెలిపారు. చిత్రం కోసం స్థానిక ఈసీఆర్ రోడ్‌లో భారీ ఖర్చుతో సైన్స్ ల్యాబ్ సెట్ వేసినట్లు చెప్పారు. చిత్రంలోని గ్రాఫి క్స్ సన్నివేశాలు కోసం ప్రముఖ యానిమేషన్ కంపెనీతో ఒప్పందం కుదుర్చుకున్నారంట. బాలసుబ్రహ్మణ్యం ఛాయాగ్రహణం, సిద్ధార్థ్ సుభావెంకట్ డైలాగ్స్ రాస్తున్నట్లు వెల్లడించారు.