MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
  • Home
  • Entertainment
  • Hansika Motwani : ఒకవైపు భర్తతో, మరోవైపు వదినతో ఒకేసారి గొడవలు పడుతున్న హన్సిక

Hansika Motwani : ఒకవైపు భర్తతో, మరోవైపు వదినతో ఒకేసారి గొడవలు పడుతున్న హన్సిక

Hansika Motwani : అల్లు అర్జున్ హీరోయిన్ హన్సిక మోత్వాని వ్యక్తిగత జీవితం హాట్ టాపిక్ గా మారింది. భర్త సోహైల్ కతూరియాతో విడాకులు, వదిన ముస్కాన్ నన్సీతో కోర్టు గొడవలతో ఆమె వార్తల్లో నిలిచారు.

2 Min read
Author : Mahesh Rajamoni
Published : Apr 11 2026, 10:01 AM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
15
హన్సిక మోత్వాని జీవితంలో అసలేం జరుగుతోంది?
Image Credit : our own

హన్సిక మోత్వాని జీవితంలో అసలేం జరుగుతోంది?

తెలుగు, తమిళ చిత్ర పరిశ్రమల్లో దేశముదురు బ్యూటీగా, తనదైన అందంతో కుర్రకారు మనసు దోచుకున్న హన్సిక మోత్వాని ప్రస్తుతం తీవ్రమైన ఒడిదుడుకులను ఎదుర్కొంటోంది. వెండితెరపై ఎప్పుడూ నవ్వుతూ కనిపించే ఈ స్టార్ హీరోయిన్ నిజ జీవితంలో మాత్రం ఇప్పుడు కన్నీళ్లు, కోర్టు మెట్లు ఎక్కాల్సిన పరిస్థితులు వచ్చాయి. ఒకవైపు తన వైవాహిక బంధం ముగిసిపోవడం, మరోవైపు సొంత కుటుంబ సభ్యులతోనే న్యాయపోరాటం చేయాల్సి రావడం సినీ ఇండస్ట్రీలో హాట్ టాపిక్‌గా మారింది.

గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండిgooglePreferred
25
సోహైల్ కతూరియాతో హన్సిక విడాకులు
Image Credit : Instagram / Hansika Motwani

సోహైల్ కతూరియాతో హన్సిక విడాకులు

కొన్నేళ్ల క్రితం వ్యాపారవేత్త సోహైల్ కతూరియాను హన్సిక వివాహం చేసుకున్న సంగతి తెలిసిందే. జైపూర్‌లోని ప్యాలెస్‌లో జరిగిన వీరి పెళ్లి ఫోటోలు అప్పట్లో సోషల్ మీడియాను ఊపేశాయి. వీరిద్దరూ అన్యోన్యంగా ఉండేవారు, అందరూ వీరిని ఒక 'మేడ్ ఫర్ ఈచ్ అదర్' జంటగా భావించారు. కానీ, లోలోపల ఏం జరిగిందో ఏమో తెలియదు కానీ, వీరి మధ్య మనస్పర్థలు తీవ్రమయ్యాయి. తాజా సమాచారం ప్రకారం, ఈ జంట పరస్పర అంగీకారంతో విడాకులు తీసుకున్నట్లు తెలుస్తోంది. బయటకు సైలెంట్‌గా ఉన్నా, వీరిద్దరి మధ్య దూరం పెరిగిపోయిందని సన్నిహిత వర్గాల టాక్.

35
వదినతో హన్సిక ₹2 కోట్ల కోర్టు పోరాటం.. అసలు వివాదం ఇదే!
Image Credit : our own

వదినతో హన్సిక ₹2 కోట్ల కోర్టు పోరాటం.. అసలు వివాదం ఇదే!

భర్తతో విడాకుల వ్యవహారం ఒక ఎత్తు అయితే, తన మాజీ వదిన ముస్కాన్ నన్సీ జేమ్స్‌తో మొదలైన లీగల్ ఫైట్ మరో ఎత్తు. హన్సిక తన వదినపై ఏకంగా ₹2 కోట్ల పరువు నష్టం దావా వేయడం సంచలనం సృష్టించింది. తన వ్యక్తిగత ప్రతిష్ఠను భంగం కలిగించేలా ముస్కాన్ సోషల్ మీడియాలో పోస్టులు పెడుతున్నారని, తనపై తప్పుడు ఆరోపణలు చేస్తున్నారని హన్సిక కోర్టును ఆశ్రయించింది. ముస్కాన్ కూడా తక్కువ తినలేదు.. హన్సిక వల్ల తాను మానసిక వేధింపులకు గురయ్యానని, కుటుంబ విషయాల్లో ఆమె మితిమీరి జోక్యం చేసుకుంటుందని ఎదురుదాడికి దిగింది.

45
డబ్బు గొడవలే కారణమా?
Image Credit : our own

డబ్బు గొడవలే కారణమా?

ఈ వివాదం వెనుక కేవలం మనస్పర్థలే కాకుండా మనీ కూడా ఉందని ప్రచారం జరుగుతోంది. సుమారు ₹27 లక్షల అప్పు విషయంలో వీరి మధ్య గొడవ మొదలైందని, ఆ డబ్బులు తిరిగి అడిగినందుకు తనపై లేనిపోని ఆరోపణలు చేస్తున్నారని హన్సిక తన పిటిషన్‌లో పేర్కొన్నట్లు సమాచారం. గృహ హింస, మానసిక వేధింపులు అంటూ ముస్కాన్ చేస్తున్న ఆరోపణలన్నీ కేవలం బ్లాక్ మెయిలింగ్ తంత్రమేనని హన్సిక తరపు లాయర్లు వాదిస్తున్నారు. సోషల్ మీడియాలో ముస్కాన్ పెడుతున్న క్రిప్టిక్ పోస్టులు కూడా ఈ మంటకు మరింత నెయ్యి పోస్తున్నాయి.

55
కోర్టు తీర్పుపైనే అందరి కళ్లు
Image Credit : instagram / Hansika Motwani

కోర్టు తీర్పుపైనే అందరి కళ్లు

ప్రస్తుతం ఈ వ్యవహారం న్యాయస్థానం పరిధిలో ఉంది. తనపై చేసిన ఆరోపణలను వెంటనే వెనక్కి తీసుకోవాలని, బహిరంగంగా క్షమాపణ చెప్పాలని హన్సిక డిమాండ్ చేస్తోంది. అభిమానులు కూడా ఈ విషయంలో రెండుగా విడిపోయారు. హన్సికను టార్గెట్ చేస్తున్నారు అని కొందరు అంటుంటే, వదిన ఆరోపణల్లో ఏదో నిజం ఉండే ఉంటుంది అని మరికొందరు కామెంట్స్ చేస్తున్నారు.

About the Author

MR
Mahesh Rajamoni
ప్రింట్-డిజిటల్ మీడియాలో తొమ్మిదేళ్ల అనుభవం ఉన్న జ‌ర్న‌లిస్టు రాజమోని మహేష్. సామాజిక సమస్యలు, రాజకీయాలు, సమకాలీన వార్తలు, రాజకీయ విశ్లేషణలు, క్రీడలు, జీవనశైలిపై విస్తృత క‌థ‌నాలు రాస్తుంటారు. పాలమూరు యూనివర్సిటీ నుంచి సైన్స్ డిగ్రీ, నవ తెలంగాణ జర్నలిజం కాలేజీ నుంచి జర్నలిజం విద్యను పూర్తి చేశారు. ఏటీఐ నుంచి టీచింగ్ మెథడాలజీ, కంప్యూటర్ అప్లికేషన్స్ లో సర్టిఫికేషన్. ప్రస్తుతం ఏసియా నెట్ తెలుగులో స్పోర్ట్ ఎడిటర్ గా ఉన్నారు.
వినోదం
తెలుగు సినిమా
ఏషియానెట్ న్యూస్ తెలుగు ఒరిజినల్స్
 

Latest Videos
Recommended Stories
Recommended image1
Jr NTR: ఆ రోజు ధైర్యం చెప్పడానికి కుటుంబ సభ్యులెవరూ రాలేదు, చాలా బాధ పడ్డా.. జూ.ఎన్టీఆర్ తీవ్ర భావోద్వేగం
Recommended image2
Bigg Boss Telugu 10: కవరింగ్ స్టార్ రోహిత్ అంటూ నామినేట్ చేసిన త్రిగుణ్, షాలినికి ఇచ్చి పడేసిన రామ్ ప్రసాద్
Recommended image3
Allu Sneha: సోషల్ మీడియాలో దూసుకుపోతున్న అల్లు అర్జున్ భార్య.. ఫ్యామిలీని చూసుకుంటూనే బిజినెస్ లో సంపాదన
Related Stories
Recommended image1
Jananayagan : జన నాయగన్ లీక్.. మీరు విజయ్ సినిమా చూస్తే జైలుకే !
Recommended image2
Ramgopal Varma: తన దేశంపై ఇజ్రాయెల్ దాడి చేయడంతో భోరుమని ఏడుస్తున్న వర్మ హీరోయిన్
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved