లాంగ్ గౌనులో చూడముచ్చటగా హన్సిక.. చిలిపి వయ్యారాలతో కవ్విస్తున్న యాపిల్ పిల్ల
లాంగ్ గౌన్ లో హన్సిక చిలిపి వయ్యారాలు ఒలికిస్తూ బుట్ట బొమ్మ తరహాలో ఇచ్చిన ఫోజులు చూడముచ్చటగా ఉన్నాయి. ఆమె అందం, చిలిపితనం అంతా ఈ ఫొటోల్లో కనిపిస్తోంది.

అల్లు అర్జున్ సరసన దేశముదురు చిత్రంలో గ్లామర్ మోత మోగించింది హన్సిక. టీనేజ్ వయసులోనే గ్లామర్ రచ్చ షురూ చేసిన ఈ యాపిల్ పిల్ల యువత హృదయాల్లో కొలువైంది. ఇప్పటికే హన్సిక గ్లామర్ చూస్తే కుర్రాళ్లకు తెలియని అలజడి మొదలవుతుంది.
అంతలా తన గ్లామర్ తో మెస్మరైజ్ చేసిన హన్సిక వివాహ జీవితంలోకి అడుగుపెట్టింది. గత ఏడాది డిసెంబర్ 4న జైపూర్ లో హన్సిక, సోహైల్ వివాహబంధంతో ఒక్కటయ్యారు. టీనేజ్ నుంచి హీరోయిన్ గా అలరిస్తున్న ఈ యాపిల్ బ్యూటీ ఎట్టకేలకు పెళ్లి చేసుకుంది.
ప్రస్తుతం హన్సిక తన భర్తతో కలసి మ్యారేజ్ రొమాంటిక్ లైఫ్ ని ఎంజాయ్ చేస్తోంది. వివాహం తర్వాత కూడా హన్సిక గ్లామర్ షోలో తగ్గేదే లే అంటోంది. తాజాగా ఆమె ఫోటో షూట్ చూస్తే కుర్రాళ్ళకి పులకరింత తప్పదు.
లాంగ్ గౌన్ లో హన్సిక చిలిపి వయ్యారాలు ఒలికిస్తూ బుట్ట బొమ్మ తరహాలో ఇచ్చిన ఫోజులు చూడముచ్చటగా ఉన్నాయి. ఆమె అందం, చిలిపితనం అంతా ఈ ఫొటోల్లో కనిపిస్తోంది. చంద్రమామ లాగా మెరిసిపోతున్న ముఖంతో హన్సిక ఫోజులు ఇచ్చింది. ప్రస్తుతం ఈ ఫోటోలు నెట్టింట వైరల్ అవుతున్నాయి.
బిజినెస్ పార్ట్నర్ గా సోహైల్ హన్సిక కి పరిచయం అయ్యాడు. సోహైల్ కంపెనీలో హన్సికకి షేర్స్ కూడా ఉన్నట్లు తెలుస్తోంది. బిజినెస్ ద్వారా ఏర్పడ్డ పరిచయం ప్రేమగా మారింది. సోహైల్ కి ఆల్రెడీ వివాహం జరిగింది.
అతడికి ఇది రెండవ వివాహం. సోహైల్ కి 2016లో రింకీ అనే అమ్మాయితో పెళ్లి జరిగింది. విభేదాల కారణంగా వీరిద్దరూ విడిపోయారు.ఆసక్తికర విషయం ఏంటంటే రింకీ, హన్సిక బెస్ట్ ఫ్రెండ్స్.
రింకీ, సోహైల్ వివాహానికి కూడా హన్సిక హాజరైంది. ఇప్పుడు తన స్నేహితురాలి మాజీ భర్తనే హన్సిక వివాహం చేసుకుంది. మనసులు కలవడంతో హన్సిక సోహైల్ కి ఇది రెండవ వివాహం అయినప్పటికీ అతడి ప్రేమలో పడింది.