హన్సిక ఇంత త్వరగా షాకింగ్ డెసిషన్ తీసుకుందేంటి.. సినిమా ఆఫర్స్ లేకపోవడం వల్లేనా..
అల్లు అర్జున్ సరసన దేశముదురు చిత్రంలో గ్లామర్ మోత మోగించింది హన్సిక. టీనేజ్ వయసులోనే గ్లామర్ ప్రదర్శించిన ఈ యాపిల్ పిల్ల యువత హృదయాల్లో కొలువైంది.

అల్లు అర్జున్ సరసన దేశముదురు చిత్రంలో గ్లామర్ మోత మోగించింది హన్సిక. టీనేజ్ వయసులోనే గ్లామర్ ప్రదర్శించిన ఈ యాపిల్ పిల్ల యువత హృదయాల్లో కొలువైంది. అంతలా తన గ్లామర్ తో మెస్మరైజ్ చేసిన హన్సిక వివాహ జీవితంలోకి అడుగుపెట్టింది. 2022 డిసెంబర్ 4న జైపూర్ లో హన్సిక, సోహైల్ వివాహబంధంతో ఒక్కటయ్యారు.
టీనేజ్ నుంచి హీరోయిన్ గా అలరిస్తున్న ఈ యాపిల్ బ్యూటీ టాలీవుడ్ లో చాలా హిట్స్ సొంతం చేసుకుంది. హన్సికకి మిగతా హీరోయిన్లతో పోల్చుకుంటే ఎక్కువ వయసు లేదు. ఆమె ఏజ్ 32 ఏళ్ళు మాత్రమే. కానీ అప్పుడే హన్సిక సెకండ్ ఇన్నింగ్స్ ప్రారంభమైనట్లు ఉంది.
హన్సికకి చాలా కాలం క్రితమే కమర్షియల్ చిత్రాల్లో అవకాశాలు తగ్గిపోయాయి. ఇటీవల హన్సిక సోలో హీరోయిన్ లేడీ ఓరియెంటెడ్ చిత్రాలతో నెట్టుకొస్తోంది. అవకాశాలు బాగా తగ్గడంతో హన్సిక షాకింగ్ డెసిషన్ తీసుకున్నట్లు ఉంది.
హన్సిక బుల్లితెరపైకి ఎంట్రీ ఇస్తోంది. ఢీ షోకి హన్సిక జడ్జిగా మారబోతోంది. దీనికి సంబందించిన ప్రోమో తాజాగా రిలీజ్ చేశారు. ప్రియమణి, పూర్ణ, ప్రణీత సుభాష్ లాంటి హీరోయిన్లు సెకండ్ ఇన్నింగ్స్ లో బుల్లితెరపై డ్యాన్స్ షోలకు న్యాయ నిర్ణేతలుగా వ్యవహరించారు.
ఇప్పుడు హన్సిక రంగంలోకి దిగుతోంది. ఢీ సెలెబ్రిటీ షో సీజన్ 2 కి హన్సిక జడ్జిగా రాబోతున్నట్లు లేటెస్ట్ ప్రోమోలో కంఫర్మ్ చేసారు. ఫుల్ జోష్ లో హన్సిక ఈ షో కోసం ముస్తాబవుతోంది.
ఇప్పటి వరకు ప్రియమణి, ప్రణీత శుభాష్, శ్రద్దా దాస్, పూర్ణ లాంటి వారు జడ్జీలుగా అలరించారు మరి హన్సిక ఎలా మెప్పిస్తుందో చూడాలి. సినిమా ఆఫర్స్ లేకపోవడం వల్లే ఈ నిర్ణయం తీసుకుందా లేక వైవిధ్యంగా ప్రయత్నిస్తూ జడ్జిగా కూడా చేయాలని డెసిషన్ తీసుకుందో హన్సికకే తెలియాలి.