- Home
- Entertainment
- వాళ్ళకి తెల్లమ్మాయి అయితే చాలు, నితిన్ వివాదాన్ని మళ్ళీ కెలికింది, బాడీపై డ్రెస్ కూడా ఉంచరు అంటూ కామెంట్స్
వాళ్ళకి తెల్లమ్మాయి అయితే చాలు, నితిన్ వివాదాన్ని మళ్ళీ కెలికింది, బాడీపై డ్రెస్ కూడా ఉంచరు అంటూ కామెంట్స్
యంగ్ హీరో నితిన్ నటించిన రాబిన్ హుడ్ చిత్రం మార్చి 28న గ్రాండ్ రిలీజ్ కి రెడీ అవుతోంది. ఈ చిత్రంలో కేతిక శర్మ చేసిన అదిదా సర్ప్రైజు అనే ఐటెం సాంగ్ యూత్ లోకి బాగా వెళ్ళింది.ఈ క్రమంలో నితిన్ చాలా ఏళ్ళ క్రితం నటించిన ఒక మూవీలోని ఐటెం సాంగ్ చర్చనీయాంశంగా మారింది.
- FB
- TW
- Linkdin
Follow Us

Nithiin
Gutta Jwala Item Song: యంగ్ హీరో నితిన్ నటించిన రాబిన్ హుడ్ చిత్రం మార్చి 28న గ్రాండ్ రిలీజ్ కి రెడీ అవుతోంది. వెంకీ కుడుముల దర్శకత్వంలో తెరకెక్కిన ఈ చిత్రంలో నితిన్, శ్రీలీల జంటగా నటించారు. ఈ చిత్రంలో కేతిక శర్మ చేసిన అదిదా సర్ప్రైజు అనే ఐటెం సాంగ్ యూత్ లోకి బాగా వెళ్ళింది. కేతిక శర్మ ఈ సాంగ్ కోసం చేసిన హుక్ స్టెప్ వైరల్ అవుతోంది.
ఈ క్రమంలో నితిన్ చాలా ఏళ్ళ క్రితం నటించిన ఒక మూవీలోని ఐటెం సాంగ్ చర్చనీయాంశంగా మారింది. నితిన్ పదేళ్ళపాటు వరుస ఫ్లాపులు ఎదుర్కొని ఇక సినిమాలకు దూరం అవుదాం అని అనుకుంటున్నాడు. ఆ టైంలో ఇష్క్ చిత్రం నితిన్ కెరీర్ ని నిలబెట్టింది. ఆ చిత్రం మంచి విజయం సాధించింది. ఆ తర్వాత నితిన్ కి కెరీర్ లో బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్ చిత్రం పడింది. ఆ మూవీ గుండె జారి గల్లంతయ్యిందే. ఈ చిత్రంలో నితిన్, నిత్యమీనన్ మధ్య కెమిస్ట్రీ, కన్ఫ్యూజన్ డ్రామా అదిరిపోయాయి.
<p>gutta jwala</p>
గుండెజారి గల్లంతయ్యిందే చిత్రం సూపర్ హిట్ గా నిలిచింది. ఈ మూవీలో ఒక ఐటెం సాంగ్ ఉంది. ఈ సాంగ్ లో బ్యాడ్మింటన్ స్టార్ గుత్తా జ్వాలా నటించడం అప్పట్లో హాట్ టాపిక్. నితిన్, గుత్తా జ్వాలా ఇద్దరూ మంచి స్నేహితులు. తనకి ఏమాత్రం ఐటెం సాంగ్ చేయడం ఇష్టం లేనప్పటికీ నితిన్ కోసం చేశానని గుత్తా జ్వాలా అప్పట్లోనే చెప్పింది. తాజాగా ఒక పాడ్ కాస్ట్ ఇంటర్వ్యూలో గుత్తా జ్వాలా ఆ సాంగ్ గురించి హాట్ కామెంట్స్ చేశారు.
Gutta Jwala
నేను సినిమా మెటీరియల్ కాదు. నితిన్ కంటే ముందు కొంతమంది సినిమాల్లో నటించమని అప్రోచ్ అయ్యారు. మన టాలీవుడ్ గురించి తెలిసిందే కదా.. తెల్ల అమ్మాయి ఉంటే చాలు, ఇంకేమి పట్టించుకోరు అంటూ తీవ్ర వ్యాఖ్యలు చేసింది. గుండె జారీ గల్లంతయ్యిందే చిత్రంలో ఆ సాంగ్ వల్ల జరిగిన ఒకే ఒక్క పాజిటివ్ అంశం ఏంటంటే.. నితిన్ అప్పటి వరకు నటించిన చిత్రాలు వర్కౌట్ కాలేదు. నా వల్ల అతడికి హిట్ వచ్చింది అంటూ గుత్తా జ్వాలా తెలిపింది. నా సాంగ్ వల్ల ఆ మూవీ నేషనల్ మీడియాలోకి కూడా వెళ్ళింది అని గుత్తా జ్వాలా తెలిపింది.
Gutta Jwala
కానీ ఆ సాంగ్ చేసినన్ని రోజులు చాలా ఎంబార్సింగ్ గా ఫీల్ అయ్యాను. నితిన్ ఒక రోజు పార్టీలో కలసి నువ్వు నా సినిమాలో ఐటెం సాంగ్ చేయాలి అన్నాడు. క్యాజువల్ గా అంటున్నాడు అనుకున్నా. మూడు నెలల తర్వాత నా కోసం ఐటెం సాంగ్ రెడీ చేసి ఆ సీడీ తీసుకువచ్చి ఇచ్చాడు. నేను షాక్ అయ్యాయి. సాంగ్ కూడా రెడీ అయింది. ఆ టైంలో నో చెప్పలేను. తప్పని పరిస్థితుల్లో ఐటెం సాంగ్ చేశా. షూటింగ్ జరిగినన్ని రోజులు నా డ్రెస్ సైజు బాగా తగ్గిపోతోంది. ఏంటిది నితిన్ అని అడిగితే నో ప్రాబ్లమ్ నీకు చాలా బావుంది అని అంటున్నాడు. మొత్తానికి ఆ సాంగ్ ని పూర్తి చేసానని గుత్తా జ్వాలా తెలిపింది.
Gutta Jwala
గుత్తా జ్వాలా పర్సనల్ లైఫ్ విషయానికి వస్తే ఆమె గతంలో చేతన్ ఆనంద్ ని వివాహం చేసుకున్నారు. ఆ తర్వాత వీరిద్దరూ విభేదాల కారణంగా విడిపోయారు. 2021లో గుత్తా జ్వాలా తమిళ హీరో విష్ణు విశాల్ ని ప్రేమించి రెండో వివాహం చేసుకుంది.