నన్ను కాదని వసుని ఎందుకు పెళ్లి చేసుకున్నావ్..? ఏంజెల్ ప్రశ్నలు, నిజం చెప్పేసిన రిషి..?
‘అసలు మీ అమ్మ ఎవరు? మేము ఎన్ని సార్లు అడిగినా, మీ అమ్మ, నాన్నల గురించి చెప్పలేదు. ఆ రోజు నీకు పెళ్లి చేసుకోవడం ఇష్టం లేక, నీకు భార్య ఉంది అని చెప్పావ్, ఈ రోజు ఈ విషయం కప్పిపుచ్చడానికి అమ్మ చెప్పింది అంటున్నావ్’ అని ఏంజెల్ ప్రశ్నిస్తుంది
తెలుగు ప్రేక్షకులను విపరీతంగా ఆకట్టుకుంటున్న సీరియల్స్ లో గుప్పెడంత మనసు ఒకటి. ఈ సీరియల్ రేటింగ్ లోనూ టాప్ గా దూసుకుపోతంది. మధ్యలో కొన్ని ఎపిసోడ్స్ సాగదీసినట్లుగా అనిపించినా, మళ్లీ కథను పట్టాలెక్కించే ప్రయత్నం చేస్తున్నారు. ఓ వైపు జగతిని చంపిన వారు ఎవరో తెలుసుకునే పనిలో రిషి ఉన్నాడు. మరోవైపు వసుధార కాలేజీ బాధ్యతలు చేపడుతోంది. కాగా, నిన్నటి ఎపిసోడ్ లో ఈ నవ దంపతులు గతంలో తాము పని చేసిన విష్ కాలేజీకి వెళతారు. అక్కడ వారికి అందరూ శుభాకాంక్షలు చెబుతున్న సమయంలో, ఏంజెల్ కనపడుతుంది. వారిద్దరూ పెళ్లి చేసుకోవడం చూసి ఏంజెల్ షాకౌతుంది. మరి, నేటి కథనంలో ఏం జరిగిందో తెలుసుకుందాం.... టీవీలో ప్రసారం కాకముందే, ఈ సీరియల్ కథనాన్ని మేము మీ ముందు ఉంచుతున్నాం..
Guppedantha manasu
Guppedantha manasu Today: ఏంజెల్, విశ్వనాథం ఇంటికి వెళతారు. ఇంట్లో ఏంజెల్ కూర్చొని బాధపడుతూ ఉంటుంది. అప్పుడే విశ్వం వచ్చి, ‘బాధపడుతున్నావామ్మ’ అని అడుగుతాడు. దానికి ఏంజెల్ ‘రిషి, వసుధారలు పెళ్లి చేసుకున్నందుకు నాకు బాధలేదు విశ్వం, నేను రిషిని బెస్ట్ ఫ్రెండ్ అనుకున్నాను. కానీ, తనకు నేను ఏమీ కాను అని, ఈ రకంగా చెప్పాడు అనిపిస్తోంది విశ్వం’ అంటూ బాధపడుతుంది. అలా కాదు అని విశ్వం నచ్చచెప్పాలని ప్రయత్నించినా ఏంజెల్ వినిపించుకోదు. ‘ విశ్వం, నేను అంత తొందరగా ఎవరితోనూ కలిసిపోను. కానీ, వసుధారతో మొదటి పరిచయంతోనే మా మధ్య మంచి ఫ్రెండ్ షిప్ ఏర్పడింది. కానీ తను కూడా నాకు ఏం చెప్పలేదు. అసలు వీళ్లిద్దరూ నన్ను మోసం చేశారా లేక, నేనే మోసపోయానా అనే విషయం అర్థం కావడం లేదు విశ్వం’ అంటూ ఏంజెల్ తన ఆవేదన బయటపెడుతుంది.
దీంతో, విశ్వం ఆమెకు పరిస్థితిని అర్థమయ్యేలా వివరించే ప్రయత్నం చేస్తాడు. ‘ నువ్వేమీ బాధపడకమ్మ, జరిగిపోయింది ఏదీ మళ్లీ తిరిగి రాదు. జరిగినదాని గురించి పదే పదే ఆలోచిస్తూ, నీ మనసు పాడు చేసుకోకు. నువ్వు బాధపడుతుంటే నేను తట్టుకోలేనమ్మా. నువ్వు సంతోషంగా ఉండాలి. అందుకే కదమ్మా, నీకు నచ్చినట్లు నిన్ను ఉండనిచ్చాను. నువ్విలా బాధపడితే ఎలా? చెప్పమ్మా. నాకు నువ్వు తప్ప ఇంకెవరు ఉన్నారు. నాకంటూ ఉన్నవారందరినీ పోగొట్టుకున్నాను. మిగిలినవాళ్లని రమ్మన్నా రారు. వాళ్లు నా గురించి పట్టించుకోరు. అమ్మా, ఏంజెల్ దయచేసి, నువ్వు ఇలా ఎక్కువగా ఆలోచించకమ్మా, నిన్ను చూస్తుంటే నాకు అదోలా ఉందమ్మా, గుండె బరువు ఎక్కినట్లుగా ఉంది’ అంటూ విశ్వం కూడా ఎమోషనల్ అయిపోతాడు.
దీంతో, ఏంజెల్ కాస్త కామ్ డౌన్ అవుతుంది. వెంటనే విశ్వంను కూల్ చేసే ప్రయత్నం చేస్తుంది. ‘ విశ్వం, నువ్వు బాధపడకు. నేను నాలాగా ఉంటాను. కానీ, రిషిని మాత్రం ఇలా ఎందుకు చేశావు అని అడగాలి విశ్వం’అని చెబుతూనే ఏంజెల్ కాస్త ఎమోషనల్ అవుతుంది. కానీ, తన తాత చూస్తే బాధపడతాడు అని వెంటనే కవర్ చేసేస్తుంది. దానికి విశ్వం కూడా అలాగేనమ్మా అంటాడు. ‘ ఎందుకు ఇలా చేశావ్ రిషి, ఒక్క మాట చెబితే సరిపోతుంది కదా’ అని ఏంజెల్ మనసులో అనుకుంటూ ఉంటుంది.
అక్కడ సీన్ కట్ చేస్తే, రిషి, వసు దగ్గర మొదలౌతుంది. రిషి,వసులో కారు దగ్గర దీర్ఘంగా ఆలోచిస్తూ ఉంటారు. ఏంజెల్ అన్న మాటలు తలుచుకుంటారు. ఇదే విషయాన్ని రిషి, వసుతో మాట్లాడతాడు. ‘ వసుధారా, ఏంజెల్ వాళ్లు నాకు చాలా హెల్ప్ చేశారు. ఆరోజు ఏంజెల్, విశ్వనాథం సర్ లేకపోతే నేను ఏమైపోయేవాడినో వసుధార. వాళ్ల దగ్గర మన విషయం దాచినందుకు నాకు చాలా బాధగా ఉంది. అసలు ఇప్పుడు నేను తనను ఎలా ఫేస్ చేయాలో కూడా నాకు తెలియడం లేదు. ఏంజెల్ చాలా బాధపడుతుంది’ అని రిషి అంటాడు. రిషి మాటలకు వసుధార కూడా ఏకీభవిస్తుంది. ‘ అవును సర్, ఏంజెల్ చాలా బాధపడుతుంది. కానీ, అప్పుడు నిజం చెప్పడానికి అవకాశం లేదు కదా సర్’ అని వసు అంటుంది. ‘ అవును వసుధార, అప్పుడు పరిస్థితులు అలా ఉన్నాయి. మన బంధం మీద మనకే క్లారిటీ లేనప్పుడు, ఇక అవతలివాళ్లకు ఏం చెబుతాం? అప్పుడు నేను ఉన్న పరిస్థితిలో నా ఆలోచనలు వేరు. కానీ, నీకు పూర్తి నమ్మకం ఉన్నప్పుడు, ఈ రిషి సర్ నీ వాడు అనే నమ్మకం ఉన్నప్పుడు నువ్వు చెప్పాల్సింది వసుధార. నువ్వు అన్న ఏ మాట నేను ఎప్పుడూ కాదు అనలేదు కదా వసుధార. మరి నువ్వెందుకు ఏంజెల్ కి నిజం చెప్పలేదు ’ అంటూ వసుని రిషి ప్రశ్నిస్తాడు.
దానికి వసు ‘ ఈ వసుధార ఎప్పుడూ మీ మాటకే కట్టుబడి ఉంటుంది. ఇప్పుడు మీరు నన్ను గుర్తించారు కాబట్టి, ఇలా అంటున్నారు. కానీ అప్పుడు చెబితే, మీరు నన్ను అపార్థం చేసుకునేవారు. నన్ను అపార్థం చేసుకోవడం పక్కన పెడితే, మీరు బాధపడటం నేను చూడలేను సర్. అందుకే నేను చెప్పలేదు’ అంటూ వసు సమాధానం ఇస్తుంది. ‘ కానీ, ఇప్పుడు వాళ్లతో మాట్లాడాలి అంటే, ఏదో తప్పు చేసినట్లుగా అనిపిస్తోంది వసుధారా’ అంటూ రిషి తన మనసులోని భయాన్ని బయటపెడతాడు. ‘ సర్, మీరు ఏ తప్పు చేయలేదు, మనం ఏదీ కావాలని చేయలేదు, అలా జరిగిపోయింది సర్, మీరు దీని గురించి ఏం ఆలోచించకండి సర్, మీరు మీ ఫ్రెండ్ షిప్ నిలపెట్టుకోవడానికి ఏం చేయాలో అది చేయండి ’ అంటూ వసు రిషిని సముదాయిస్తుంది.
‘ మనం ఏదీ కావాలని చేయలేదు, అన్నీ అలా జరిగిపోయాయి. నాకు నమ్మకం ఉంది. ఏంజెల్ మనల్ని అర్థం చేసుకుంటుందని’ అని రిషి నమ్మకం వ్యక్తం చేయగా, ‘ మీ నమ్మకం నిజం అవుతుందని నాకు కూడా అనిపిస్తోంది సర్, ఎందుకంటే, ప్రేమ, స్నేహంలోనూ అపార్థాలు, దూరాలు ఏర్పడితే, కలిగే బాధ మనం భరించలేం సర్, అది అనుభవించాక, ఆ బాధ ఇంకెవరికీ రాకూడదు అనిపించింది. మీ ఇద్దరి మధ్య ఎలాంటి పొరపొచ్చాలు ఏర్పడకూడదు సర్ ’ అంటూ వసు ధైర్యం చెబుతుంది. ‘థాంక్స్ వసుధారా’ అని రిషి అనగా, ‘పదండి సర్, వాళ్లు మన కోసం ఎదురు చూస్తూ ఉంటారు’ అని వసు చెబుతుంది.
అక్కడ సీన్ కట్ చేస్తే, ఇంట్లో మహేంద్ర జ్యూస్ తాగుతూ ఉంటాడు. అప్పుడే ఫణీంద్ర, శైలేంద్ర, దేవయానికి అక్కడికి వస్తారు. వస్తూ వస్తూనే శేలేంద్ర రిషి అని పిలుస్తూ ఉంటాడు. మహేంద్రా అంటూ ఫణీంద్రా ప్రేమగా దగ్గరకు వస్తాడు. మహీంద్ర కూడా అన్నయ్య అంటూ ప్రేమగా దగ్గరకు వెళ్లి కౌగిలించుకుంటాడు. తర్వాత కూర్చో అన్నయ్య అని కూర్చోపెడతాడు. ఎలా ఉన్నావ్ మహీంద్రా అని ఫణీంద్ర అడగగా, పర్వాలేదు అన్నయ్య అని సమాధానం ఇస్తాడు. ‘ బాబాయ్, రిషి ఏం చేస్తున్నాడు, రిషీ, రీషీ..’ అని శైలేంద్ర పిలుస్తూ ఉంటే, రిషి ఇంట్లో లేడు అని మహేంద్ర సమాధానం చెబుతాడు.
‘ ఇంట్లో లేడా, ఎక్కడికి వెళ్లాడు? చెప్పండి బాబాయ్, ఎక్కడికి వెళ్లాడు?’అంటూ ప్రశ్నలు వేస్తాడు. ‘ రిషి, వసులు విష్ కాలేజీకి వెళ్లారు అని తెలిస్తే, ఈ శైలేంద్ర ఏదో ఒకటి చేస్తాడు’ అని మహేంద్ర మనసులో అనుకుంటాడు. ‘ మహేంద్ర, వసుధార కూడా కనపడట్లేదు, ఇంట్లో లేదా’ అని ఫణీంద్ర అడగగా,లేదు అన్నయ్య, ఇద్దరూ కలిసి బయటకు పనిమీద వెళ్లారు అని మహేంద్ర సమాధానం చెబుతాడు. ‘అవునా, ఏ పనిమీద వెళ్లారు బాబాయ్’ అని శైలేంద్ర అత్యుత్సాహంచూపించగా, ‘ మిషన్ ఎడ్యుకేషన్ పని’అని మహేంద్ర కౌంటర్ వేస్తాడు.
‘నాకు చెబితే, నేను కూడా వెళ్లేవాడిని కదా బాబాయ్, ఇప్పుడు అయినా పర్వాలేదు, చెప్పండి నేను ఇప్పుడైనా వెళతాను’ అని శైలేంద్ర అనగా, తనకు తెలీదు అని మహేంద్ర అంటాడు. అయినా, వదిలిపెట్టకుండా, తెలుసుకునేందుకు శైలేంద్ర ప్రయత్నాలు చేస్తాడు. అతని ప్రయత్నాలకు ఫణీంద్ర అడ్డుకట్ట వేస్తాడు. శైలేంద్ర ఏదో చెప్పడానికి ప్రయత్నించగా, నువ్వు చేసిన ఘనకార్యాలు చాలులే, ఇంకా ఏమీ చేయాల్సిన అవసరం లేదు అని ఫణీంద్ర కౌంటర్ వేస్తాడు. ఆ తర్వాత ఫణీంద్ర, తన తమ్ముడిపై ప్రేమ చూపిస్తాడు, వాళ్లు బయటకు వెళ్లినప్పుడు నువ్వు ఒంటరిగా ఎందుకు ఉన్నావని, తమ దగ్గరకు రావచ్చు కదా అని అడుగుతాడు. దానికి మహీంద్ర తనకు ఒంటరితనం అలవాటే అని, జగతి లేదు అనే విషయాన్ని ఇన్ డైరెక్ట్ గా చెబుతాడు. రిషి రమ్మని చెప్పినా, తాను వెళ్లేదంటాడు,
ఇక, రిషి, వసు లేరు కాబట్టి, తమతో పాటు ఇంటికి రమ్మని ఫణీంద్ర అడుగుతాడు. దేవయాని కూడా అదే విషయాన్ని కాస్త వెటకారంగా అడుగుతుంది. ఇక, కాసేపు దేవయాని పాత విషయాలు తీసి, నన్ను క్షమించలేవా అని అడుగుతుంది. కొన్ని మాటలు మనసుకు గుచ్చుకుంటాయని, వాటిని మర్చిపోలేం అంటూ మహేంద్ర చెబుతాడు. ఇక, జగతి లేని ఆ ఇంట్లో తాను అడుగుపెట్టలేనని చెబుతాడు. దేవయాని ఏదో చెప్పడానికి ప్రయత్నించినా, మహేంద్ర అడ్డుకుంటాడు. ఫణీంద్ర కూడా రమ్మని బతిమిలాడినా, మహేంద్ర ఆ ఇంటికి రాలేను అని తేల్చి చెప్పేస్తాడు. భోజనానికి అక్కడికి రాలేనని, కావాలంటే, ఇక్కడే భోజనాలు ఏర్పాటు చేస్తానని చెబుతాడు. దానికి ఫణీంద్ర ఒకే చెబుతాడు. తాను తమ్ముడితో కలిసి భోజనం చేస్తానని, బార్యకు షాకిస్తాడు.
ఇక, తదుపరి సీన్ మళ్లీ విశ్వనాథం ఇంట్లో మొదలౌతుంది. విశ్వం, రిషిని ప్రశ్నిస్తూ ఉంటాడు.‘నీకు ఆల్రెడీ పెళ్లి అయినప్పుడు, వసుధారను ఎలా పెళ్లి చేసుకున్నావ్? అని ప్రశ్నిస్తాడు. ‘ సర్, అందుకు ఒక కారణం ఉంది’ అని రిషి అంటాడు. మధ్యలో ఏంజెల్ దూరి, ఆ కారణం ఏంటో తనకు తెలుసు అని చెబుతుంది. ‘15 రోజుల్లో తన భార్యను చూపించకుంటే, నన్ను పెళ్లి చేసుకోవాల్సి వస్తుంది అని నేను అన్నాను , అందుకే వసుధారను పెళ్లి చేసుకున్నాడు. నన్ను పెళ్లి చేసుకోవడం ఇష్టం లేక, వసు తన భార్య అని చూపించడానికి పెళ్లి చేసుకున్నాడు’ అని ఏంజెల్ ప్రశ్నలు వేస్తుంది.
విశ్వం కూడా అలాంటి ప్రశ్నలే వేస్తాడు. ఏంజెల్ ని కాదు అని, వసుధారను ఎలా పెళ్లి చేసుకున్నావ్ అని విశ్వం ప్రశ్నలు వేస్తాడు. వసుని పెళ్లి చేసుకుంటున్నావ్ అని తెలిస్తే, మేము ఎక్కడున్నా, ఆ పెళ్లికి వచ్చేవాళ్లం కదా అని అడుగుతాడు. ‘ సర్, నాకు మీ మంచితనం తెలుసు. కానీ, ఇదంతా నేను కావాలని చేయలేదు. కాకపోతే, అలా జరిగిపోయింది అంతే’ అని రిషి చెప్పగా, ఏంజెల్ ఊరుకోదు. ‘ మా పెళ్లి జరగడానికి కారణం మా అమ్మ’ అంటూ రిషి నిజం చెప్పేస్తాడు. ‘అసలు మీ అమ్మ ఎవరు? మేము ఎన్ని సార్లు అడిగినా, మీ అమ్మ, నాన్నల గురించి చెప్పలేదు. ఆ రోజు నీకు పెళ్లి చేసుకోవడం ఇష్టం లేక, నీకు భార్య ఉంది అని చెప్పావ్, ఈ రోజు ఈ విషయం కప్పిపుచ్చడానికి అమ్మ చెప్పింది అంటున్నావ్’ అని ఏంజెల్ ప్రశ్నిస్తుంది
దీంతో, తాను అబద్దం చెప్పడం లేదని, నిజమే చెబుతున్నానని రిషి అంటాడు. మా అమ్మకూడా మీకు తెలుసు అంటాడు. దీంతో, మీ అమ్మ ఎవరో చెప్పు అని ఏంజెల్ ప్రశ్నించగా, జగతి మేడమ్ అని రిషి సమాధానం చెబుతాడు. జగతి మేడమ్ మీ అమ్మా అని విశ్వనాధం కూడా షాకౌతాడు. దీంతో, మీకు స్పష్టంగా తెలియాల్సిన విషయాలు చాలా ఉన్నాయి అని, మహేంద్ర, జగతి తన తల్లి, తండ్రి అని చెప్పి షాకిస్తాడు. తాను, అలా అబద్దం చెప్పడానికి కారణం ఇదే అంటూ, గతంలో జరిగిన విషయాలు బయటపెడతాడు. వసుధారతో ప్రేమ, వారు విడిపోయిన విషయం అన్నీ వివరిస్తాడు. అందుకే, అప్పుడు తాను గతం చెప్పడానికి ఇష్టపడలేదు అని అన్నాడు. నేను, మీకు భార్యను చూపిస్తాను అని చెప్పాను కదా, అప్పుడు చూపిస్తాను అన్నది కూడా ఎవరినో కాదు, వసుధారనే అంటూ అసలు నిజం చెప్పేస్తాడు.
Angel, Guppedantha manasu
ఏంజెల్ షాకవ్వగా, వసుకి తనకు ఎంగేజ్మెంట్ అయిపోయిన తర్వాతే తాము విడిపోయాం అని చెబుతాడు. వసుధార, తాను ప్రేమించుకున్నామని, ఎంగేజ్మెంట్ కూడా జరిగిందని గతంలో జరిగిన సీన్స్ అన్నీ వివరిస్తాడు.చివరి ట్విస్ట్ ఏంటంటే, రిషి మొత్తం నిజం చెప్పినా, ఏంజెల్ నమ్మదు. రిషి అబద్దం చెబుతున్నాడని భావిస్తుంది. ఇక్కడితో నేటి కథనం ముగిసింది. మరి, రేపటి ఎపిసోడ్ లో ఏం జరుగుతుందో చూద్దాం..