- Home
- Entertainment
- Guppedantha Manasu: రిషిను కౌగిలించుకొని మరీ ఆ మాట చెప్పేసిన వసు.. మల్లెపూల వరకూ వెళ్లిన వ్యవహారం!
Guppedantha Manasu: రిషిను కౌగిలించుకొని మరీ ఆ మాట చెప్పేసిన వసు.. మల్లెపూల వరకూ వెళ్లిన వ్యవహారం!
Guppedantha Manasu: బుల్లితెరపై ప్రసారమవుతున్న గుప్పెడంత మనసు సీరియల్ కుటుంబ నేపథ్యం లో కొనసాగుతూ ప్రేక్షకులను బాగా ఆకట్టుకుంటుంది. ఇక ఈరోజు మే 14 ఎపిసోడ్ లో ఏం జరిగిందో తెలుసుకుందాం.

ఇక ఎపిసోడ్ ప్రారంభంలోనే వసు (Vasu) ఆ బొమ్మ గురించి వివరాలు ఆ బాబు ని అడిగి తెలుసుకుంటాను అని రిషి (Rishi) తో అంటుంది. కానీ రిషి వసు ను వెళ్లనివ్వకుండా ఏదో ఒక సాకు చెబుతాడు. అయినప్పటికీ వసు ఆ బాబు దగ్గరికి వెళ్లి ఈ బొమ్మ నీకు ఎవరు ఇచ్చారు రా అని అడుగుతుంది.
ఇక ఈ క్రమంలో రిషి (Rishi) అక్కడకు వెళ్లి ఆ బాబు నోరు విప్పకుండా నానా రకాలుగా కవర్ చేస్తూ ఉంటాడు. ఇక చివరికి రిషి వసు ను అక్కడి నుంచి పంపించి వేస్తాడు. మరోవైపు సాక్షి (Sakshi) జగతి ని కలిసి మహేంద్ర అంకుల్ ను మా పేరెంట్స్ కలుద్దాం అనుకుంటున్నారు అని చెబుతుంది. ఇక ఈ విషయం నాకు ఎందుకు చెప్తున్నావ్ అని జగతి అడుగుతుంది.
ఇక సాక్షి (Sakshi) అంటే అంకుల్ కి మీరు ఏమైనా చెబుతారని అని అంటుంది. సాక్షి ఇంటికి వెళుతున్న క్రమంలో జగతి (Jagathi) రిషి ను కలవడానికి ఈ టైం లో కాకుండా పొద్దున వస్తే బాగుంటుందేమో అని అంటుంది. ఇక ఈ టైంలో వస్తే కాలేజీలో ఉన్న స్ట్రెస్ అంత కూడా నీ పైన చూపిస్తాడు అన్నట్లు సాక్షి చెబుతుంది.
ఇక సాక్షి (Sakshi) పొద్దున్న వచ్చిన మాట్లాడకపోతే ఏం చేయాలి ఆంటీ అని అడుగుతుంది. అప్పుడు రావడం మానేయాలి అని జగతి సాక్షి ముఖం మీద కుండ బద్దలు కొట్టినట్టు గా చెబుతుంది. ఇక రిషి (Rishi) దగ్గరకు ఒక పూలు అమ్మే ముసలమ్మ వచ్చి పూలు కొని మీ మనసులో ఉన్న వారికి ఇవ్వండి సార్ అని అంటుంది.
ఇక రిషి (Rishi) ఆ ముసలావిడ కోసమైన పూలు తీసుకుంటాడు. ఆ తర్వాత అదే దారిలో నడుచుకుంటూ ఈ బొమ్మ కు రిషి సార్ కి ఏమైనా సంబంధం ఉందా లేదా అని వసు (Vasu) అనుకుంటూ వస్తుంది. దానితో అదే దారిలో ఉన్న రిషి నాకేం సంబంధం లేదు అని అంటాడు. ఇక రిషి ఈ బొమ్మ గీసిన వ్యక్తి కనపడితే ఏం చేస్తావ్ అని అడుగుతాడు.
కౌగిలించుకొని థాంక్స్ చెబుతాను అని వసు (Vasu) రిషి కి అర్థమయ్యేలా రిషి (Rishi) ను కౌగిలించుకొని థాంక్స్ చెబుతుంది. ఇక రిషి కారులో వసు మల్లె పూలు చూసి ఈ మల్లెపూలు నేను తీసుకుంటాను సార్ అని అడుగుతుంది. ఇక రిషి మరింత ఆనందంగా ఆ మల్లెపూలు వసుకు ఇస్తాడు.