Guppedantha Manasu: మళ్ళీ మొదలైన ప్రేమ పాటలు.. గౌతమ్ ప్రేమకు విలన్ గా రిషీ?
Guppedantha Manasu: బుల్లితెరపై ప్రసారం అవుతున్న గుప్పెడంత మనసు (Guppedantha Manasu) సీరియల్ ప్రేక్షకులను బాగా ఆకట్టుకుంటోంది. ఇక అనేది ఎపిసోడ్ లో ఏం జరిగిందో ఇప్పుడు మనం తెలుసుకుందాం.. జగతి ( Jagathi) పెళ్లి పోయినందుకు ధరణి బాధపడుతూ ఉండగా ఇంతలో అక్కడికి దేవయాని వచ్చి ఏమయింది అని అడుగుతుంది. ఏమి లేదు అత్తయ్య కంట్లో నలుసు పడింది అని చెబుతోంది ధరణి (Dharani )

ధరణి ఇంట్లో అందరికీ స్వీట్ చేసి పెట్టు.. ఎందుకంటే జగతి ఇంటిలో నుంచి వెళ్ళిపోయింది అదే నాకు పెద్ద పండుగ అని చెబుతుంది దేవయాని (Devayani). అప్పుడు ధరణి సరే అత్తయ్య గారు అంటూ.. దేవయాని తన మనసులో తిట్టుకుంటూ ఉంటుంది. మరొకవైపు జగతి ఇంట్లో మహేంద్ర (Mahendra), వసుధార కూర్చుని జరిగినదాని గురించి బాధపడుతూ ఉంటారు.
అప్పుడు వసుధర (Vasudhara )మాట్లాడుతూ మహేంద్ర ను ఎందుకు మీరు మేడం ని బయటకు తీసుకువచ్చారు అని అడుగుతుంది. మేడం ఎప్పటి నుంచో ఎదురు చూస్తోంది అందుకోసమే కదా సార్ అని అడగగా.. అప్పుడు మహేంద్ర జగతీ నీకు మేడం అయితే.. నాకు ప్రాణం వసుధారా అని చెబుతాడు మహేంద్ర. అనంతరం రిషి (Rishi) జగతిని ఇంటికి నా కోసమే తీసుకు వచ్చాడు అని వసుధర కీ చెబుతాడు మహేంద్ర.
రిషి జగతిని అమ్మ గుర్తించి, తనంతట తానే తన అమ్మని ఇంటికి తీసుకుని రావాలి అని మాట్లాడతాను మహేంద్ర. ఇంతలో జగతి అక్కడికి రాగానే జగతి నీ విషయంలో నేను తప్పు చేశానా అని మహేంద్ర అనగా.. నువ్వు కాదు మహేంద్ర కాలమే తప్పు చేసింది అంటూ జగతి కాస్త ఎమోషనల్ అవుతుంది. మరొక వైపు నుంచి జరిగినదంతా తలుచుకుని బాధపడుతూ ఉంటాడు.
ఇంతలో అక్కడికి గౌతమ్ వచ్చి రిషి నువ్వు చెప్పినట్టుగానే ఐస్క్రీమ్ తీసుకు వచ్చాను.. వెళ్దాం పద అని అడగగా రిషి (Rishi) నాకు వద్దు లేదు నువ్వు వెళ్ళు అని అంటాడు. ఇంతలో అక్కడికి ధరణి వస్తుంది. వదినా మీరు ఎందుకో బాధ గా ఉన్నారు అని అడగగా.. ఏమీ లేదు రిషి సంతోషం ఇలా వచ్చి అలా వెళ్ళి పోయింది అంటే బాధపడుతుంది ధరణి.
మరొకవైపు వసుధర జరిగినంత తలచుకుని బాధ పడుతూ ఉంటుంది. ఇంతలో జగతి(Jagathi) కాఫీ తీసుకుని వచ్చి వసుధరకు ఇచ్చి.. జరిగిన దాని గురించి బాధపడకు వదిలేయ్ అని చెబుతుంది. ఇంతలో జగతి ఇంటికి రిషీ వస్తాడు. రిషి ని ఒక్కసారిగా చూసి వసుధార, జగతి షాక్ అవుతారు. కాఫీ తాగండి సార్ అని, వసుధ అడగగా ఇది కూడా కాకి ఎంగిలి నా అని అంటాడు రిషి.
అనంతరం కాలు బాగాలేదు ఎక్కువ తిరగకు అంటూ వసుధరకు జాగ్రత్తలు చెబుతాడు రిషి (Rishi). ఆ తర్వాత తన తండ్రి మహేంద్ర తన ఆరోగ్యం పట్ల శ్రద్ధ చూపడం లేదు అంటూ మహేంద్ర మందలిస్తాడు రిషి. ఇక అక్కడనుంచి వెళ్ళి పోతాడు. అనంతరం మహేంద్ర కూడా వెళ్ళిపోతాడు. మరోవైపు గౌతమ్ వసుధర ఫోటో చూస్తూ మురిసిపోతూ ఉంటాడు. ఇక్కడి రేపటి భాగం లో ఏం జరుగుతుందో చూడాలి మరి.