MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
  • Home
  • Entertainment
  • క్రాక్ కి ముందు గోపీచంద్ కష్టాలు, ఆస్తులు పోగొట్టుకుని.. అన్ స్టాపబుల్ లో కన్నీరు పెట్టుకున్న బాలయ్య డైరెక్టర్

క్రాక్ కి ముందు గోపీచంద్ కష్టాలు, ఆస్తులు పోగొట్టుకుని.. అన్ స్టాపబుల్ లో కన్నీరు పెట్టుకున్న బాలయ్య డైరెక్టర్

నందమూరి బాలకృష్ణ నటిస్తున్న లేటెస్ట్ మూవీ వీర సింహారెడ్డి. గోపీచంద్ మలినేని దర్శకత్వంలో తెరకెక్కిన ఈ చిత్రం సంక్రాంతి కానుకగా మరికొన్ని గంటల్లో ప్రేక్షకుల ముందుకు రానుంది. 

2 Min read
Author : Sreeharsha Gopagani
| Updated : Jan 11 2023, 07:42 PM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
16

నందమూరి బాలకృష్ణ నటిస్తున్న లేటెస్ట్ మూవీ వీర సింహారెడ్డి. గోపీచంద్ మలినేని దర్శకత్వంలో తెరకెక్కిన ఈ చిత్రం సంక్రాంతి కానుకగా మరికొన్ని గంటల్లో ప్రేక్షకుల ముందుకు రానుంది. మైత్రీ మూవీస్ సంస్థ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. అఖండ తర్వాత బాలయ్య నుంచి వస్తున్న చిత్రం కావడంతో భారీ అంచనాలు నెలకొన్నాయి.  

 

గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండిgooglePreferred
26

వీరసింహారెడ్డి చిత్రం జనవరి 12న ప్రపంచ వ్యాప్తంగా విడుదలవుతోంది. ఇప్పటికే ప్రీమియర్ షోలకి సంబంధించిన ఏర్పాట్లు పూర్తయ్యాయి. అడ్వాన్స్ బుకింగ్స్ మోతెక్కుతున్నాయి. ఇక సిల్వర్ స్క్రీన్ పై బాలయ్య సింహగర్జన మాత్రమే తరువాయి. ఈ నేపథ్యంలో ప్రచార కార్యక్రమాలు ఒక రేంజ్ లో సాగుతున్నాయి. 

36

నందమూరి బాలకృష్ణ హోస్ట్ గా చేస్తున్న అన్ స్టాపబుల్ షో బ్లాక్ బస్టర్ గా దూసుకుపోతోంది. వీరసింహారెడ్డి ప్రమోషన్స్ లో భాగంగా చిత్ర యూనిట్ బాలయ్య అన్ స్టాపబుల్ షోకి హాజరయ్యారు. ఈ ప్రోమో ప్రస్తుతం వైరల్ గా మారింది. దర్శకుడు గోపీచంద్ మలినేని, నెగిటివ్ రోల్స్ చేసిన వరలక్ష్మి శరత్ కుమార్, దునియా విజయ్ తో పాటు మైత్రి నిర్మాత నవీన్, రచయిత సాయి మాధవ్ బుర్రా ఈ షోలో హాజరయ్యారు. 

46

ఎప్పటిలాగే బాలయ్య హంగామా చేస్తూ తన టీంని, దర్శకుడిని అడగాల్సిన ప్రశ్నలు సూటిగా అడిగారు. సంక్రాంతికి వచ్చే బాలకృష్ణ సినిమా నిజమైన అన్ స్టాపబుల్ అని బాలయ్య రచ్చ మొదలు పెట్టారు. నేను డైరెక్టర్ అడిగేస్తున్నా ని గోపీచంద్ ని ప్రశ్నించారు. బాలకృష్ణ సినిమాలో వరా(వరలక్ష్మి శరత్ కుమార్) విలనా లేక వరా విలన్ గా చేసిన సినిమాలో బాలకృష్ణ హీరోనా అని సరదాగా ప్రశ్నించి తికమక పెట్టారు. 

56

దీనితో వరలక్ష్మి శరత్ కుమార్ బదులిస్తూ.. నేనే ఎక్కువ హైపర్ గా ఉంటానని అనుకున్నా.. కానీ మీరు నాకంటే ఎక్కువ హైపర్ గా ఉన్నారు అని తెలిపింది. మధ్యలో బాలకృష్ణ.. మాస్ మహారాజ్ రవితేజతో ఫోన్ లో సంభాషించారు. 100 కోట్ల హీరోకి కంగ్రాట్స్ అని బాలయ్య ధమాకా సక్సెస్గురించి రవితేజని విష్ చేశారు. థాంక్యూ తమ్ముడు అంటూ రవితేజ సరదాగా బదులివ్వడం ఆకట్టుకుంది. 

66

అలాగే వీరసింహారెడ్డి ముచ్చట్లు మాట్లాడుకున్నారు. ఈ చిత్రంలో స్పెషల్ రోల్ చేసిన హనీ రోజ్ కూడా ఈ షోలో పాల్గొంది. ఇక బాలయ్య గోపీచంద్ ని ప్రశ్నిస్తూ.. ఇది అవుట్ ఆఫ్ సిలబస్ క్వశ్చన్.. క్రాక్ కి ముందు ఏడాదిన్నర పాటు చాలా కష్టాలు పడ్డావు కదా.. ఆస్తులు కూడా అమ్మేశావ్.. ఆయా టైం లో ఎలా అనిపించింది అని బాలయ్య ప్రశ్నించారు. దీనితో గోపీచంద్ ఒక్కసారిగా ఎమోషనల్ అయ్యారు. కన్నీరు పెట్టుకోవడంతో పక్కనే ఉన్న వరలక్ష్మి అతడిని ఓదార్చింది. ఈ ఎపిసోడ్ జనవరి 13న టెలికాస్ట్ కానుంది. 

About the Author

SG
Sreeharsha Gopagani
నందమూరి బాలకృష్ణ
Latest Videos
Recommended Stories
Recommended image1
Peddi 5 Days Collections: సోమవారం ఊహించని కలెక్షన్లు, ఐదో రోజు పెద్ది ఎంత వసూలు చేసిందంటే?
Recommended image2
Balakrishna Birthday Special: ఒకేరోజు మూడు సినిమాలు రిలీజ్‌, అభిమానులకు బాలయ్య ఇవ్వబోతున్న కొత్త ట్రీట్స్ ఇవే
Recommended image3
Soundarya: ఎంత స్టార్ అయినా సౌందర్య కాళ్ళు పట్టుకోవాల్సిందే, ఆ హీరో చేసిన పనిని పబ్లిక్ గా బయటపెట్టాం
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved