MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
TRENDING :
IMD Weather Update
Today's Rasi Phalalu
Women's Asia Cup 2026
Post Office RD Scheme
Hey Ram Controversy
Epic Movie Review
Smart Investment Tips
iPhone 18 Pro Max
YS Jaganmohan Reddy
Vastu Tips
Hyderabad Elevated Corridor Project
PM Viksit Bharat Rozgar Yojana
  • Home
  • Entertainment
  • Pawan Kalyan: పవన్‌ కళ్యాణ్ గురించి పూనకాలు తెప్పించే వార్త.. అసలు ఈ ఐడియాకే మొక్కాలి

Pawan Kalyan: పవన్‌ కళ్యాణ్ గురించి పూనకాలు తెప్పించే వార్త.. అసలు ఈ ఐడియాకే మొక్కాలి

పవన్‌ కళ్యాణ్‌ కి సంబంధించిన ఒక ఇంట్రెస్టింగ్‌ వార్త సోషల్‌ మీడియాలో చక్కర్లు కొడుతుంది. ఒక భారీ సినిమాలో ఆయన క్యామియో రోల్‌ చేస్తున్నారనేది వార్త దుమారం రేపుతుంది. కానీ నిజం ఏంటంటే? 

2 Min read
Author : Aithagoni Raju
Published : Apr 10 2026, 09:04 PM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
14
ఉస్తాద్‌ భగత్‌ సింగ్‌తో డిజప్పాయింట్‌ చేసిన పవన్‌ కళ్యాణ్‌
Image Credit : Asianet News

ఉస్తాద్‌ భగత్‌ సింగ్‌తో డిజప్పాయింట్‌ చేసిన పవన్‌ కళ్యాణ్‌

పవర్‌ స్టార్‌ పవన్‌ కళ్యాణ్‌ ఇటీవల `ఉస్తాద్‌ భగత్‌ సింగ్‌`తో ఆడియెన్స్ ముందుకు వచ్చారు. హరీష్‌ శంకర్‌ రూపొందించిన ఈ మూవీ బాక్సాఫీసు వద్ద డిజప్పాయింట్‌ చేసింది. ఆడియెన్స్ ని ఆకట్టుకోలేకపోయింది. దీంతో దారుణమైన పరాజయం చెందింది. ఇటీవల కాలంలో పవన్‌ కళ్యాణ్‌ నటించిన `హరి హర వీరమల్లు` మూవీ ఫ్లాప్‌ అయితే, `ఉస్తాద్‌ భగత్‌ సింగ్‌` దారుణమైన పరాజయం చెందింది. ఈ సినిమా ద్వారా సుమారు రూ.70-80కోట్లు పోయినట్టు సమాచారం.

గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండిgooglePreferred
24
సస్పెన్స్ లో సురేందర్‌ రెడ్డి సినిమా
Image Credit : Youtube print shot/@JanaSenaParty

సస్పెన్స్ లో సురేందర్‌ రెడ్డి సినిమా

పవన్‌ కళ్యాణ్‌ నెక్ట్స్ సినిమాకి సంబంధించి ఇంకా క్లారిటీ లేదు. ఇప్పుడు చేసిన `హరి హర వీరమల్లు`, `ఓజీ`, `ఉస్తాద్‌ భగత్‌ సింగ్‌` చిత్రాలు గతంలో ఒప్పుకున్న ప్రాజెక్ట్ లు. డిప్యూటీ సీఎం అయిన తర్వాత టైమ్‌ చూసుకుని వీటి షూటింగుల్లో పాల్గొన్నారు. సినిమాలు పూర్తి చేశారు. వీటిలో ఒక్క `ఓజీ`నే బాగా ఆడింది. మిగిలినవి అంతగా మెప్పించలేదు. అయితే నెక్ట్స్ ఆయన ఎప్పుడు డేట్స్ ఇస్తాడు? ఎప్పుడు సినిమా చేస్తాడనేది పెద్ద ప్రశ్నార్థకంగా మారింది. ముందు కమిట్‌ మెంట్‌ ప్రకారం సురేందర్‌ రెడ్డితో సినిమా చేయాల్సి ఉంది. కానీ ఇది స్క్రిప్ట్ ఫైనల్‌ కాలేదు. కథ ఓకే అయ్యాక, పవన్‌ డేట్స్ ఇస్తే పట్టాలెక్కుతుంది. లేదంటే అది ప్రశ్నార్థకమే. కానీ ఇప్పుడు పరిస్థితుల్లో పవన్‌ ఎలా డేట్స్ అడ్జెస్ట్ చేస్తాడనేది ప్రశ్న.

34
పవన్‌ కళ్యాణ్‌ గురించి గూస్‌ బంమ్స్ వార్త వైరల్‌
Image Credit : Youtube print shot/Mega Surya Production

పవన్‌ కళ్యాణ్‌ గురించి గూస్‌ బంమ్స్ వార్త వైరల్‌

ఇదిలా ఉంటే పవన్‌ కళ్యాణ్‌కి సంబంధించిన ఒక షాకిచ్చే వార్త, పూనకాలు తెప్పించే మ్యాటర్‌ ఇప్పుడు సోషల్‌ మీడియాలో వినిపిస్తోంది. ఇది పెద్ద కామెడీగా ఉండటమే కాదు, టూ క్రేజీగా ఉంది. పవన్‌ కళ్యాణ్‌.. `జైలర్‌ 2`లో గెస్ట్ రోల్‌ చేస్తున్నాడనే వార్త దుమ్ముదుమారం రేపుతుంది. పవన్‌ కళ్యాణ్‌.. `జైలర్‌ 2`లో నటించడమనేది ఇంపాజిబుల్‌. అసలు ఆయన సినిమాలు చేయడానికే టైమ్‌ లేదంటే ఇక గెస్ట్ రోల్స్ ఎలా చేస్తాడనేది ప్రశ్న. ఇప్పుడున్న పరిస్థితుల్లో అది సాధ్యం కాదు, పైగా పవన్‌ ఇలాంటి గెస్ట్ రోల్స్ కి ప్రయారిటీ ఇవ్వరు. కానీ `జైలర్‌ 2`కోసం మేకర్స్ ఆయన్ని అప్రోచ్‌ అయ్యారని అంటున్నారు.

44
జైలర్‌ 2లో పవన్‌ నటిస్తాడా?
Image Credit : stockphoto

జైలర్‌ 2లో పవన్‌ నటిస్తాడా?

రజనీకాంత్‌ హీరోగా నటించే ఈ మూవీకి నెల్సన్‌ దిలీప్‌ కుమార్‌ దర్శకుడు. ఇందులో మోహన్‌లాల్‌, శివ రాజ్‌ కుమార్‌ క్యామియో రోల్స్ చేస్తున్నారు. హిందీ నుంచి షారూఖ్‌ ఖాన్‌ నటిస్తారనే ప్రచారం జరిగింది. కానీ ఆయన తప్పుకున్నారట. ఆయన స్థానంలో పవన్‌ కనిపిస్తారంటూ సోషల్‌ మీడియాలో పోస్ట్ లు కనిపిస్తున్నాయి. ఇది చూసి అభిమానులు నవ్వుకుంటున్నారు. ఈ రూమర్‌ క్రియేట్‌ చేసినోడికి దెండం పెట్టాలని, ఫస్ట్ ఈ ఐడియా రావడమే గ్రేట్‌ అంటూ కామెంట్లు పెడుతున్నారు. మొత్తంగా ఇది పెద్ద రచ్చ అవుతుంది. తెలుస్తోన్న సమాచారం మేరకు ఇది క్రేజ్‌ కోసం క్రియేట్‌ చేసిందే తప్ప, ఇందులో నిజం లేదని టాక్‌. నిజం ఏంటో గానీ వినడానికి మాత్రం అదిరిపోయేలా ఉంది. ఇక `జైలర్‌ 2` సినిమాపై రజనీకాంత్‌ స్పందించారు. ఎయిర్‌పోర్ట్ లో ఆయన్ని మీడియా కలిసింది. ఈ సందర్భంగా `జైలర్‌ 2` మూవీ చిత్రీకరణ ఆల్మోస్ట్ పూర్తయ్యిందని, రిలీజ్‌ డేట్ నిర్మాణ సంస్థ ప్రకటిస్తుందని తెలిపారు. అలాగే కమల్‌ హాసన్‌తో చేస్తున్న సినిమా ఆగస్ట్ లో ప్రారంభమవుతుందని వెల్లడించారు.

About the Author

AR
Aithagoni Raju
అయితగోని రాజు 2020 నుంచి ఏషియానెట్‌ తెలుగులో వర్క్ చేస్తున్నారు. ఆయనకు టీవీ, ప్రింట్‌, డిజిటల్‌ జర్నలిజంలో 13ఏళ్ల అనుభవం ఉంది. ప్రధానంగా న్యూస్‌, సినిమా జర్నలిజం, ఎంటర్‌టైన్‌మెంట్‌ రంగంలో ప్రముఖ సంస్థల్లో వర్క్ చేశారు. ప్రపంచ సినిమాని `షో`(నవతెలంగాణ) పేరుతో రాసిన ప్రత్యేక కథనాలు విశేష గుర్తింపుని తెచ్చిపెట్టాయి. ప్రస్తుతం ఏషియానెట్‌ తెలుగులో ఎంటర్‌టైన్‌ మెంట్ టీమ్‌ని లీడ్‌ చేస్తున్నారు. సబ్‌ ఎడిటర్‌గానే రిపోర్టర్ గా సినిమా ఫీల్డ్ అనుభవం ఉంది. ఎంటర్‌టైన్‌మెంట్‌ విభాగంలో సినిమా, టీవీ, ఓటీటీ కి సంబంధించి ఆసక్తికర కథనాలను, సినీ ఇండస్ట్రీలోని విషయాలను, సినిమా రివ్యూలు, విశ్లేషణాత్మక కథనాలు రాయడంలో మంచి పట్టు ఉంది. క్వాలిటీ కంటెంట్‌ని అందిస్తూ, క్వాలిటీ జర్నలిజాన్ని ముందుకు తీసుకెళ్లడంలో తనవంతు కృషి చేస్తున్నారు.
పవన్ కళ్యాణ్
తెలుగు సినిమా
ఏషియానెట్ న్యూస్
ఏషియానెట్ న్యూస్ తెలుగు ఒరిజినల్స్
తమిళ సినిమా
 

Latest Videos
Recommended Stories
Recommended image1
Chiranjeevi: ఆయనకి ఎన్టీఆర్ అయినా, చిరంజీవి అయినా ఒకటే..ఎదురు చూసే అలవాటు లేదు, అందుకే సినిమాలు చేయలేదు
Recommended image2
Rajamouli: తీశావులే బోడి బాహుబలి అంటూ.. రాజమౌళిని అవమానించింది ఎవరో తెలుసా? హీరో నాని చెప్పిన సీక్రెట్..
Recommended image3
Nagarjuna: హలో బ్రదర్ సినిమాలో నాగార్జున డూప్ గా నటించిన స్టార్ హీరో ఎవరో తెలుసా? ఎలా ఒప్పుకున్నాడంటే?
Related Stories
Recommended image1
OTT Movies: ఓటీటీలో చిరంజీవికి ఝలక్‌ ఇచ్చిన కుర్ర హీరో కామెడీ మూవీ.. జీ 5 టాప్‌ 10 మూవీస్‌ ఇవే
Recommended image2
Tamanna Favorite Hero: తమన్నాకి ఇష్టమైన హీరో ఎవరో తెలుసా? ఆయన సినిమా ఎన్నిసార్లు చూసిందో లెక్కే లేదు
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved