MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
  • Home
  • Entertainment
  • పవన్‌ ఫ్యాన్స్ కి పూనకం తెచ్చే న్యూస్‌.. బాలయ్య `అన్‌స్టాపబుల్‌2`షోకి పవర్‌స్టార్‌.. ఇద్దరు కలిస్తే రచ్చ రచ్చే

పవన్‌ ఫ్యాన్స్ కి పూనకం తెచ్చే న్యూస్‌.. బాలయ్య `అన్‌స్టాపబుల్‌2`షోకి పవర్‌స్టార్‌.. ఇద్దరు కలిస్తే రచ్చ రచ్చే

పవన్‌ ఫ్యాన్స్ కి పూనకాలు తెప్పించే వార్త ఒకటి ఇప్పుడు సోషల్‌ మీడియాలో చక్కర్లు కొడుతుంది. బాలకృష్ణ షోకి పవర్‌ స్టార్‌ గ్రీన్‌ సిగ్నల్‌ ఇచ్చారనే న్యూస్‌ ఇంటర్నెట్‌ని ఊపేస్తుంది. 

2 Min read
Author : Aithagoni Raju
| Updated : Dec 15 2022, 07:24 PM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
16

బాలకృష్ణ (Balakrishna) హోస్ట్ గా రన్‌ అవుతున్న `అన్‌స్టాపబుల్ విత్‌ ఎన్బీకే`(UnstoppablewithNBK2) ఎంతటి ఆదరణ పొందుతుందో తెలిసిందే. ఇండియాలోనే టాప్‌ వన్‌ టాక్ షోగా నిలిచింది. అత్యధికంగా వీక్షిస్తున్న షోగా నిలుస్తుంది. ఇందులో టాలీవుడ్‌ టాప్‌ స్టార్లు, రాజకీయ ప్రముఖులు పాల్గొనడం ఓ విశేషమైతే, వాళ్లు సంచలన విషయాలు, మోస్ట్ ఇంట్రెస్టింగ్‌ విషయాలను వెల్లడించడం మరో విశేషం. ఇవన్నీ పక్కన పెడితే బాలకృష్ణ వంటి సీనియర్‌, కల్ట్ మాస్‌ ఫాలోయింగ్‌ ఉన్న హీరో హోస్ట్ గా చేయడం ఇంతటి క్రేజ్‌కి కారణమని చెప్పొచ్చు. ఎప్పుడూ హోస్ట్ గా చేయని బాలయ్య మొదటి సారి వ్యాఖ్యాతగా మారి చేస్తుండటంతో, బోల్డ్ గా గెస్ట్ లను ప్రశ్నించడం వంటివి ఈ షోకి మరింత హైప్‌ని తీసుకొస్తున్నాయి. 
 

26

ఇదిలా ఉంటే ఇప్పటి వరకు బన్నీ, మహేష్‌తోపాటు యంగ్‌ హీరోలు, నిర్మాతలు, దర్శకులు ఈ షోలో పాల్గొన్నారు. కుర్రహీరోలు సందడి చేశారు. మాజీ సీఎంలు చంద్రబాబు నాయుడు, కిరణ్‌ కుమార్‌ రెడ్డిలు సందడి చేశారు. అనేక ఆసక్తికర విషయాలను వెల్లడించారు. అయితే ఇప్పుడు ప్రభాస్‌(Prabhas), గోపీచంద్‌లు పాల్గొన్న ఎపిసోడ్‌ త్వరలో స్ట్రీమింగ్‌ కాబోతుంది. ఈ ఎపిసోడ్‌ కోసం కోట్లాది మంది అభిమానులు ఎదురుచూస్తున్నారు. 
 

36

ఈ క్రమంలో ఇప్పుడు ఈ షోకి సంబంధించి మరో సెన్సేషనల్‌ అప్‌డేట్‌ వచ్చింది. ఈ షోలో పవన్‌ కళ్యాణ్‌(Pawan Kalyan) పాల్గొనబోతున్నారనే వార్త ఇప్పుడు నెట్టింట వైరల్‌ అవుతుంది. సోషల్‌ మీడియాని షేక్‌ చేస్తుంది. బాలయ్య `అన్‌స్టాపబుల్‌2` షోకి పవన్‌ కళ్యాణ్‌ గెస్ట్ గా రాబోతున్నారని తెలుస్తుంది. ఇందులో పాల్గొనేందుకు పవర్‌ స్టార్‌ గ్రీన్‌ సిగ్నల్‌ ఇచ్చారని తెలుస్తుంది. దీంతో పవన్‌ ఫ్యాన్స్ ఇప్పుడు ఊగిపోతున్నారు. ఓ రకంగా ఇది పవర్‌ స్టార్‌ అభిమానులకు పూనకాలు తెప్పించేలా ఉండటం విశేషం. 

46

రెండో సీజన్‌ `అన్‌స్టాపబుల్‌విత్‌ఎన్బీకే2` రెండో ఎపిసోడ్‌లో నిర్మాత సూర్యదేవర నాగవంశీ హాజరయ్యారు. ఆయన ముందే బాలయ్య.. దర్శకుడు త్రివిక్రమ్‌తో ఫోన్‌లో మాట్లాడారు. మా షోకి రావాలని అడగ్గా, మీరు పిలిస్తే కాదంటానా సర్‌ అని త్రివిక్రమ్‌ బదులిచ్చారు. ఆ సమయంలోనే ఎవరితో రావాలో తెలుసుగా అని బాలయ్య ప్రశ్నించగా, అందుకు త్రివిక్రమ్‌ నవ్వులు చిందించారు. అంటే బాలయ్య ఉద్దేశంలో పవన్‌ కళ్యాణ్‌తో రావాలని త్రివిక్రమ్‌కి చెప్పారు. అప్పుడే పవన్‌ వస్తారనే ప్రచారంఊపందుకుంది. 
 

56

అయితే ఇన్నాళ్లకి పవన్‌ ఓకే చేశారట. ఈ షోలో పాల్గొనేందుకు పవన్‌ టైమ్‌ ఇచ్చారని తెలుస్తుంది. టైమ్‌ ఫిక్స్ చేసుకున్నారని టాక్. మరి త్రివిక్రమ్‌(Trivikram), పవన్‌ కలిసే వస్తారా? అనేది ఆసక్తికరంగా మారింది. ఇందులో నిజమెంతా అనేది తెలియాల్సి ఉంది. అయితే పవన్‌ ఈ షోకి వస్తే అది టాలీవుడ్‌లోనే అతిపెద్ద బ్రేకింగ్‌ న్యూస్‌ అవుతుందని, బాలయ్య, పవన్‌ మధ్య కన్వర్జేషన్‌ సంచలనంగా మారుతుందని చెప్పొచ్చు. ఇది కేవలం పవన్‌కే కాదు, బాలయ్య ఫ్యాన్స్ కి కూడా పూనకాలు తెప్పించేలా ఉంటుందని చెప్పడంలో అతిశయోక్తి లేదు. ఇక బాలయ్య, పవన్‌ కలిస్తే షో రచ్చ రచ్చ అవుతుందని చెప్పొచ్చు. అది ఇద్దరి అభిమానులకు కళ్ల సంబురం లాంటి ఎపిసోడ్‌ అవుతుంది. 

66

టాలీవుడ్‌లో మెగా, నందమూరి ఫ్యామిలీల మధ్య కాస్త గ్యాప్‌ ఉందని తరచూ చర్చజరుగుతుంటుంది. ఇక బాలయ్య, పవన్‌ మధ్య ఆ గ్యాప్‌ మరింత ఎక్కువే అని టాక్‌. రాజకీయంగా దగ్గరగా ఉన్నా, సినిమా రంగంలో మాత్రం ఈ ఇద్దరు రెండు భిన్న ధృవాల్లాంటివారు. మరి అలాంటి ఈ ఇద్దరు కలిసి ఒకే షోలో మెరిస్తే ఆ ఫీలింగ్‌ని మాటల్లో వర్ణించలేని విధంగా ఉంటుందని కామన్‌ ఆడియెన్స్ అభిప్రాయం. మరి ఈ షో కోసం బాలయ్య, పవన్‌ ఫ్యాన్స్ తోపాటు కమన్‌ సినిమా అభిమానులు సైతం ఈగర్‌గా వెయిట్‌ చేస్తున్నారు. 
 

About the Author

AR
Aithagoni Raju
అయితగోని రాజు 2020 నుంచి ఏషియానెట్‌ తెలుగులో వర్క్ చేస్తున్నారు. ఆయనకు టీవీ, ప్రింట్‌, డిజిటల్‌ జర్నలిజంలో 13ఏళ్ల అనుభవం ఉంది. ప్రధానంగా న్యూస్‌, సినిమా జర్నలిజం, ఎంటర్‌టైన్‌మెంట్‌ రంగంలో ప్రముఖ సంస్థల్లో వర్క్ చేశారు. ప్రపంచ సినిమాని `షో`(నవతెలంగాణ) పేరుతో రాసిన ప్రత్యేక కథనాలు విశేష గుర్తింపుని తెచ్చిపెట్టాయి. ప్రస్తుతం ఏషియానెట్‌ తెలుగులో ఎంటర్‌టైన్‌ మెంట్ టీమ్‌ని లీడ్‌ చేస్తున్నారు. సబ్‌ ఎడిటర్‌గానే రిపోర్టర్ గా సినిమా ఫీల్డ్ అనుభవం ఉంది. ఎంటర్‌టైన్‌మెంట్‌ విభాగంలో సినిమా, టీవీ, ఓటీటీ కి సంబంధించి ఆసక్తికర కథనాలను, సినీ ఇండస్ట్రీలోని విషయాలను, సినిమా రివ్యూలు, విశ్లేషణాత్మక కథనాలు రాయడంలో మంచి పట్టు ఉంది. క్వాలిటీ కంటెంట్‌ని అందిస్తూ, క్వాలిటీ జర్నలిజాన్ని ముందుకు తీసుకెళ్లడంలో తనవంతు కృషి చేస్తున్నారు.
వినోదం
పవన్ కళ్యాణ్

Latest Videos
Recommended Stories
Recommended image1
చిరు, చరణ్, పవన్, సూర్య తో పాటు అల్లు శిరీష్ పెళ్లిలో సందడి చేసిన తారలు ఎవరెవరో తెలుసా?
Recommended image2
Dhurandhar 2: అడ్వాన్స్ బుకింగ్స్ లో ధురంధర్‌ 2 సంచలనం.. యానిమల్‌, జవాన్‌ రికార్డులు బ్రేక్‌?
Recommended image3
Allu Sirish Wedding: నయనికతో అల్లు శిరీష్‌ గ్రాండ్‌గా పెళ్లి.. ఆమె బ్యాక్‌ గ్రౌండ్‌ ఇదే.. పెద్ద సౌండ్‌ పార్టీనే
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved