MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
  • Home
  • Entertainment
  • ఇలాంటి భార్యే కావాలని కుర్రాళ్ళు కలలు కనేలా చేసిన 'గుడ్ నైట్' నటి నిశ్చితార్థం.. త్వరలో పెళ్లి 

ఇలాంటి భార్యే కావాలని కుర్రాళ్ళు కలలు కనేలా చేసిన 'గుడ్ నైట్' నటి నిశ్చితార్థం.. త్వరలో పెళ్లి 

మీతా రఘునాథ్ ఎక్కువ సినిమాల్లో నటించలేదు. గుడ్ నైట్ చిత్రంతోనే మీతాకి మంచి గుర్తింపు దక్కింది. కానీ అప్పుడే మీతా పెళ్లి పీటలు ఎక్కేందుకు రెడీ అయిపోయింది. 

1 Min read
Author : Sreeharsha Gopagani
Published : Nov 24 2023, 04:22 PM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
17

ప్రస్తుతం ఓటిటి ప్రభావం వల్ల ఇతర భాషల్లో తెరెకెక్కించిన చిన్న చిత్రాలు కూడా దేశం నలుమూలల ప్రేక్షకులకు ఈజీగా చేరువవుతున్నాయి. మంచి కంటెంట్ ఉన్న చిత్రాలు ఆదరణ పొందుతున్నాయి. తమిళంలో తెరకెక్కిన గుడ్ నైట్ మూవీ అలాంటిదే. 

27

చిన్న చిత్రంగా హాట్ స్టార్ ఓటిటిలో విడుదలైన ఈ చిత్రం సూపర్ సక్సెస్ అయింది. అత్యంత సాధారణమైన గురక కాన్సెప్ట్ తెరకెక్కిన ఈ చిత్రం యువతతో పాటు ఫ్యామిలీ ఆడియన్స్ హృదయాలు దోచుకుంది.

37

మీతా రఘునాథ్, మణికంఠన్ జంటగా నటించిన ఈ చిత్రాన్ని వినాయక్ చంద్రశేఖరన్ తెరకెక్కించారు. గురక సమస్య ఉన్న టెక్కీగా మణికంఠన్ ఎంత అద్భుతంగా నటించాడో.. అతడి భార్యగా మీతా రఘునాథ్ కూడా అంతే అద్భుతంగా నటించింది. 

47

భర్త కోసం దేన్నైనా త్యాగం చేసే భార్యగా మెప్పించింది. ఏమాత్రం మేకప్ లేకుండా సహజసిద్ధమైన లుక్స్ తో కట్టిపడేసింది. ఎమోషనల్ పెర్ఫామెన్స్ తో అదరహో అనిపించింది. ఈ చిత్రం చూసిన యువత మొత్తం ఇలాంటి భార్యే కావాలని కలలు కనేలా చేసింది మీతా రఘునాథ్. 

57

మీతా రఘునాథ్ ఎక్కువ సినిమాల్లో నటించలేదు. గుడ్ నైట్ చిత్రంతోనే మీతాకి మంచి గుర్తింపు దక్కింది. కానీ అప్పుడే మీతా పెళ్లి పీటలు ఎక్కేందుకు రెడీ అయిపోయింది. 

67

తాజాగా మీతా రఘునాథ్ నిశ్చితార్థం చేసుకుంది. తనకు కాబోయే భర్తతో ఉన్న ఫొటోస్ సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. అలాగే మీతా ఎంతో అందంగా ట్రెడిషనల్ చీరకట్టులో మెరిసిపోతోంది. ఆమెకి కాబోయే భర్త గురించి ఎలాంటి వివరాలు తెలియలేదు. 

77

త్వరలోనే వీరిద్దరి పెళ్లి కూడా జరగబోతోంది. అయితే నెటిజన్లు మీతాకి శుభాకాంక్షలు చెబుతూనే పెళ్లి తర్వాత కూడా నటిగా కొనసాగాలని, సినిమాలు చేయాలని కోరుతున్నారు. ప్రస్తుతం మంచి ఆఫర్స్ వస్తున్న తరుణంలో మీతా పెళ్లి చేసుకోవాలని డిసైడ్ అయింది. మరి సినిమాలు కొనసాగిస్తుందో లేదో చూడాలి. 

About the Author

SG
Sreeharsha Gopagani
Latest Videos
Recommended Stories
Recommended image1
Tollywood: క్లాసిక్ టైటిల్స్ పెట్టారు.. దెబ్బకు వాటి మార్క్‌ను చెడగొట్టేశారు.. లిస్టులో కాజల్ సినిమా..
Recommended image2
RP Patnaik: 'గాజువాక పిల్ల' పాట వెనుక అంత విషాదం ఉందా.. ఆర్పీ పట్నాయక్ ఏం చెప్పారంటే.?
Recommended image3
తెలుగు స్టార్ హీరోతో సినిమా కోసం రిషబ్ శెట్టి ప్రయత్నం.. ఎవరితో చేయబోతున్నాడో తెలుసా?
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved