పవన్ ఫ్యాన్స్ టపాసులు పేల్చే వార్త.. అకీరా, ఆద్యలను ఏం చేయాలనుకుంటుందో చెప్పిన రేణు దేశాయ్.. పెద్ద ట్విస్టే
పవన్, రేణు దేశాయ్‌ల కుమారుడు అకీరా నందన్ హీరోగా ఎంట్రీ ఇస్తాడని పవన్ ఫ్యాన్స్ ఆశిస్తున్నారు. కోరుకుంటున్నారు. అలాంటి శుభ వార్త కోసం వేచి చూస్తున్నారు. ఇంతలో రేణు దేశాయ్ ట్విస్ట్ తో కూడిన క్రేజీ వార్త చెప్పింది.
రేణు దేశాయ్(Renu Desai).. చాలా రోజుల తర్వాత ఓపెన్ అవుతుంది. ఇన్నాళ్ల పబ్లిక్‌కి, మీడియాకి దూరంగా ఉన్నా ఆమె ఇటీవల కాలంలో మళ్లీ యాక్టివ్ అవుతుంది. ఆ మధ్య ఓ టీవీ షోలో సందడి చేసింది. ఇటీవల `టైగర్ నాగేశ్వరరావు` చిత్రంలో నటించింది. అయితే ఈ సందర్భంగా ఆమె మీడియాతో ముచ్చటించింది. అయితే అందులో ఓ ఇంటర్వ్యూ ఇప్పుడు బాగా పేలుతుంది. `ప్రేమ`కి ఇచ్చిన ఇంటర్వ్యూలో వ్యక్తిగతమైన విషయాలను పంచుకోవడం విశేషం. ఇందులో పవన్(Pawan Kalyan) గురించి, అకీరా(Akira Nandan), ఆద్యల(Aadhya) గురించి, తన పర్సనల్ లైఫ్ గురించి, హెల్త్ గురించి కూడా ఆమె మాట్లాడింది.
అయితే తనయుడు అకీరా నందన్ ఆ మధ్య హైదరాబాద్‌లో మెరిసింది. హైదరాబాద్ రేసింగ్ పోటీల సమయంలో ఆయన ట్యాంక్ బండ్ వద్ద సందడి చేశాడు. అందరి చూపులు తనవైపు తిప్పుకోవడంతోపాటు హాట్ టాపిక్‌గా మారాడు. తన సింప్లిసిటీ, అలాగే హైట్ విషయంలో అంతా మాట్లాడుకున్నారు. అయితే ఇప్పుడు అకీరా, కూతురు ఆద్యల కెరీర్‌కి సంబంధించి రేణు దేశాయ్ ఓపెన్ అయ్యింది. వారిని ఏం చేయాలనుకుంటున్నారు, ఎలా చూడాలనుకుంటున్నారనే ప్రశ్నకి రేణు దేశాయ్ క్రేజీగా స్పందించింది. ఆసక్తికర విషయాలను వెల్లడించింది.
అకీరాని తెరపై చూడాలని కలలు కంటుందట రేణు దేశాయ్. అతనిలో ఏదో ప్రత్యేకమైన సోల్ ఉందని, అతన్ని తెరపై చూసేందుకు ఉవ్విళ్లూరుతున్నట్టు చెప్పింది. యాక్టర్‌గా ఎలా ఉంటాడనేది చూడాలని ఉందని, అకీరా అంటే తనకు చాలా ఇష్టమని చెప్పింది. అతను పుట్టిన ఏడాదికో ఎప్పుడూ అతనిపై అభిమానాన్ని చూపిస్తుంటే, పవన్(మాజీ భర్త) అనేవాడు.. వాడిని ఫ్యాన్ క్లబ్ ఉంటే మొదటి మెంబర్ నువ్వే అని, అంతిష్టం వాడు నాకు అని చెప్పింది రేణు దేశాయ్.
అయితే ప్రస్తుతం అకీరా పియానో ప్లేయర్‌గా రాణిస్తున్నారు. ఆ మధ్య ఓపెన్‌గా పర్‌ఫెర్మ్ కూడా చేశాడు. అది ముందుండి చూశాను, చాలా సంతోషపడినట్టు చెప్పింది రేణు దేశాయ్. అయితే తనకు మాత్రం అకీరాని యాక్టర్‌గానే చూడాలని ఉందని స్పష్టం చేసింది. కానీ నేను ఒత్తిడి చేయనని, అతనికి ఇష్టం ఉంటేనే చేస్తానని చెప్పింది. ఏదో ఒక రోజు మమ్మీ తాను యాక్టర్ అవుతా అని చెప్పే సందర్భం కోసం చూస్తున్నానని, అది తన జీవితంలో బిగ్గెస్ట్ మెమరీ అవుతుందని తెలిపింది.
ఆ సమయంలో తాను అకీరా లాంఛ్ విషయాన్ని చాలా లౌండ్‌గా, బ్యాండ్ మోగించి మరీ గ్రాండ్‌గా ప్రకటిస్తానని తెలిపింది రేణు దేశాయ్. తన ఆనందాన్ని పంచుకుంది. అంతేకాదు యాక్టింగ్, పియానో అనేది పక్కన పెడితే, అకీరాని తాను రైతుగా చూడాలనుకుంటుందట. ఆ దిశగా పుష్ చేస్తున్నట్టు కూడా చెప్పింది. ఆర్గానిక్ ఫార్మర్‌గా చూడాలని ఉందని తెలిపింది రేణు.
మరోవైపు కూతురు ఆద్య గురించి చెబుతూ, ఆమెని స్పిరిచ్వల్ లీడర్‌గా చూడాలనుకుంటుందట. స్వతహాగా ఆమెకి ఆర్కిటెక్ కావాలని ఉందని, కానీ తాను మాత్రం ఆద్యని స్పిరిచ్వల్ లీడర్‌గా చూడాలని ఉందని చెప్పింది. అయితే ఏదో ఒక మతానికి సంబంధించిన వ్యక్తిలా కాకుండా, అన్ని మతాలను ప్రతింబించేలా, అన్ని అంశాలను భోదించే వ్యక్తిగా ఆద్యని తయారు చేయాలని ఉందని చెప్పింది. ఈ ఆలోచన ఆద్య పుట్టడానికి ఏడాది ముందే వచ్చిందని, ఓపుస్తకం చదివే సమయంలో ఆ థాట్ వచ్చిందని చెప్పింది. అయితే తాను కన్సీవ్ అయ్యాక తను ఇలాంటి లీడర్ అవుతుందని అనిపించిందని, ఆ ఫీలింగ్ కలిగిందని, తనలో అంతటి శక్తి ఉందని పేర్కొంది రేణు దేశాయ్.