- Home
- Entertainment
- రూ.100 కోట్ల క్లబ్ లోకి ‘గాడ్ ఫాదర్’.. యూఎస్ఏలోనూ అదిరిపోయే కలెక్షన్స్.. డిటేయిల్స్!
రూ.100 కోట్ల క్లబ్ లోకి ‘గాడ్ ఫాదర్’.. యూఎస్ఏలోనూ అదిరిపోయే కలెక్షన్స్.. డిటేయిల్స్!
మెగాస్టార్ చిరంజీవి ప్రధాన పాత్రలో నటించి పొలిటికల్ డ్రామా ‘గాడ్ పాధర్’. ప్రేక్షకాదరణ పొందిన ఈ చిత్రం బాక్సాఫీస్ వద్ద కలెక్షన్ల వర్షం కురిపిస్తోంది. తాజాగా రూ.100 కోట్ల క్లబ్ లోకి చేరడం విశేషం.

మలయాళం చిత్రం ‘లూసిఫర్’కు రీమేక్ గా వచ్చిన చిత్రమే ‘గాడ్ ఫాదర్’ (Godfather). పొలిటికల్ డ్రామాగా తెలుగు ఆడియెన్స్ ముందుకు వచ్చిన ఈ చిత్రంలో మెగాస్టార్ చిరంజీవి (Chiranjeevi) ప్రధాన పాత్రలో నటించారు. లేడీ సూపర్ స్టార్ నయనతారా (Nayanthara) కీలక పాత్ర పోషించింది. విజయదశమి సందర్భంగా ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ చిత్రానికి భారీగానే ప్రేక్షకాదరణ దక్కుతోంది.
ఇప్పటికే చిత్ర యూనిట్ కూడా బ్లాక్ బాస్టర్ సక్సెస్ మీట్ తో ఆడియెన్స్ కు ప్రత్యేక ధన్యవాదాలు తెలిపిన విషయం తెలిసింది. మరోవైపు సినిమా కలెక్షన్ల పరంగా కూడా దూసుకుపోతోంది. గాడ్ ఫాదర్ థియేటర్లలో వచ్చి ఇంకా వారం కూడా పూర్తి చేసుకోలేదు. అంతలోనే రూ.100 కోట్ల క్లబ్ లోకి అడుగుపెట్టింది. ఇప్పటికే చిత్రీకరణ కోసం మేకర్స్ వెచ్చించిన డబ్బులు తిరిగి రావడంతో పాటు.. ప్రస్తుతం లాభాల బాటలో పయనిస్తోందీ మూవీ. ఫస్ట్ వీకెండ్ లో సినిమా మధ్యస్థంగా వసూళ్లను రాబ్టటింది.
అయినప్పటికీ ప్రపంచ వ్యాప్తంగా రూ.100 కోట్ల గ్రాస్ కలెక్షన్స్ ను వసూల్ చేసిందని మేకర్స్ అధికారికంగా ప్రకటించారు. రెండో వారంలోనూ చిత్రం మరింతగా వసూళ్లు రాబట్టే అవకాశం ఉందని ట్రేడ్ వర్గాలు అంచనాలు వేస్తున్నాయి. ప్రస్తుతం పెద్ద సినిమాలేవీ లేకపోవడంతో ‘గాడ్ ఫాదర్’కు పోటీగా లేకపోవడంతో మరికొద్ది రోజులు థియేటర్లలో మెగాస్టార్ సందడి చేయనున్నారని తెలుస్తోంది.
ఐదోవ రోజు ఆదివారం ‘గాడ్ ఫాదర్’ అన్నీ భాషల్లో ప్రపంచ వ్యాప్తంగా రూ.9 కోట్ల గ్రాస్ కలెక్ట్ చేసినట్టు తెలుస్తోంది. ఒక్క వీకెండ్ లోనే రూ.18 కోట్ల గ్రాస్ కలెక్ట్ చేసినట్టు నివేదికలు చెబుతున్నారు. ఇక యూఎస్ ఏలో నూ గాడ్ ఫాదర్ దుమ్ములేపుతున్నారు. ఐదురోజుల్లో యూఎస్ఏ బాక్సాఫీస్ వద్ద మైల్ స్టోన్ ను రీచ్ అయినట్టు తెలుస్తోంది. 1 మిలియన్ డాలర్ల వసూళ్లను సాధించి.. ఇంకా సందడి చేస్తోంది. ఈమేరకు మేకర్స్ కూడా అఫిషియల్ అనౌన్స్ మెంట్ అందించారు.
రీమేక్ గా వచ్చిన ఈ చిత్రానికి దర్శకుడు మోహన రాజా చిన్నచిన్న మార్పులు చేయడంతో ప్రేక్షకుల నుంచి మంచి రెస్పాన్స్ వస్తోంది. మరోవైపు భారీ స్టార్ కాస్ట్ ను కూడా ఎంచుకోవడం సినిమాకు మరింత ప్లస్ అయ్యింది. టెక్నీషియన్స్ కూడా బెస్ట్ అవుట్ పుట్ ను అందించడంతో ఆడియెన్స్ ఖుషీ అవుతున్నారు. ఈక్రమంలో రెండో వారం కూడా ‘గాడ్ ఫాదర్’ స్టడీగా కలెక్షన్స్ రాబట్టే అవకాశం ఉంది.
చిరంజీవి, నయనతారా, సత్యదేవ్ కీలక పాత్రల్లో నటించారు. బాలీవుడ్ స్టార్ హీరో సల్మాన్ ఖాన్ కూడా గెస్ట్ అపియరెన్స్ తో అలరించారు. దర్శకుడు పూరీ జగన్నాథ్ కూడా కామియో అపియరెన్స్ తో ఆకట్టుకున్నారు. తమిళ దర్శకుడు మోహన్ రాజా సినిమాను కొత్తగా డైరెక్ట్ చేశారు. కొణిదెల ప్రొడక్షన్ కంపెనీ, సూపర్ గుడ్ ఫిల్మ్స్ బ్యానర్లపై నిర్మాతలు రామ్ చరణ్, ఆర్బీ చౌదరీ, ఎన్వీ ప్రసాద్ నిర్మించారు. సంచలన సంగీత దర్శకుడు ఎస్ థమన్ అదిరిపోయే మ్యూజిక్ అందించారు.