- Home
- Entertainment
- Janaki Kalaganaledu: జానకి రామచంద్రలను వేరు చేసేందుకు మల్లిక ప్లాన్.. వార్నింగ్ ఇచ్చిన జ్ఞానాంబ!
Janaki Kalaganaledu: జానకి రామచంద్రలను వేరు చేసేందుకు మల్లిక ప్లాన్.. వార్నింగ్ ఇచ్చిన జ్ఞానాంబ!
Janaki Kalaganaledu: బుల్లితెరపై ప్రసారమవుతున్న జానకి కలగనలేదు (Janaki Kalaganaledu) సీరియల్ ప్రేక్షకులను బాగా ఉంటుంది. మంచి కుటుంబ కథతో ఈ సీరియల్ కొనసాగుతుంది. ఇక ఈ రోజు జులై 15 ఎపిసోడ్ లో ఏం జరిగిందో తెలుసుకుందాం.

ఈరోజు ఎపిసోడ్ లో జానకి(janaki) జ్ఞానాంబ మాటలను తలుచుకొని బాధపడుతూ ఉంటుంది. ఆ తర్వాత రామచంద్ర తో గడిపిన క్షణం తలుచుకొని బాధపడుతూ ఉంటుంది జానకి. అప్పుడు జానకి రామచంద్ర తో రాత్రి జరిగింది మొత్తం తలుచుకొని బాధపడుతూ ఉంటుంది. అప్పుడు రామచంద్ర (rama chandra)మీరు అమ్మకి ఇచ్చిన మాట కోసం తాపత్రయపడుతున్నారు నేను నీకు ఇచ్చిన మాట కోసం తాపత్రయపడుతున్నాను.
మీరు అమ్మకు ఇచ్చిన మాట నిలబడాలి అంటే మీరు అనుకున్న కళ మొదటి నెరవేరాలి అని అంటాడు రామచంద్ర. అప్పుడు జానకి(janaki)ఎంత చెప్పినా కూడా వినిపించుకోడు రామ చంద్ర. అప్పుడు జానకి ఎంత మెసేజ్ చెప్పడానికి ప్రయత్నించినా కూడా నెరవేరాలి మొదట అని చెబుతాడు. అప్పుడు జానకి రామచంద్ర(rama chandra)ను బ్రతిమలాడుతూ ఉంటుంది. కానీ రామచంద్ర మాత్రం జానకి మాటలు వినిపించుకోడు. అయితే ఇదంతా కూడా తలచుకొని జానకి బాధపడుతూ ఉంటుంది.
అప్పుడు జానకి (janaki)తనలో తానే మాట్లాడుకుంటూ అత్తయ్య గారు మొదటి నా నుంచి శుభవార్తను వినాలి అనుకుంటున్నారు అనుకుని రామచంద్రను తలుచుకుని బాధపడుతూ ఉంటుంది. మరొకవైపు రామచంద్రా స్వీట్ షాప్ లో నైట్ ఏం జరిగింది అని ఆలోచించుకుంటూ ఉంటాడు. ఇంతలోనే జానకి ఫోన్ చేసి ఏం చేస్తున్నారు శ్రీవారు రాత్రి జరిగిన తీపి జ్ఞాపకాల గుర్తు చేసుకుంటున్నారా అని అనగా ఇదే రామచంద్ర(rama chandra)తీపి లేదు కారం లేదు అసలు ఎందుకు ఫోన్ చేశారో చెప్పండి అని అంటాడు.
అప్పుడు జానకి రామచంద్ర(rama chandra)కు మూడ్ వచ్చే విధంగా మాట్లాడుతూ ఉంటుంది. అప్పుడు రామచంద్ర నైట్ ఏమి జరగలేదు నేను ఏ కోర్టుకు వచ్చి చెప్పమన్నా చెబుతాను అని అనగా వెంటనే జానకి అసలు ఏం మనిషి వయ్యా నువ్వు? చేసినంత చేసి ఏమి తెలియనట్టుగా మాట్లాడుతున్నావు అనగా వెంటనే రామచంద్ర ఏంటండీ ఒకటే సారి అలా మాట్లాడుతున్నారు అని అనడంతో వెంటనే జానకి(janaki)భాషను మార్చి రామచంద్రని ఒక ఆట ఆడుకుంటుంది.
ఆ తర్వాత జానకి(janaki)ఇంటికి వచ్చేటప్పుడు మల్లెపూలు తీసుకుని రండి అని అడగగా రామచంద్ర అదేపనిగా ఎందుకు అని వెటకారంగా అడగడంతో జానకి తన స్టైల్లో సమాధానం చెబుతుంది. నీకోసం ఎదురు చూస్తూ ఉంటాను అని చెప్పడంతో రామచంద్ర టెన్షన్ పడుతూ ఉంటాడు. మరొకవైపు జానకి రామచంద్ర కోసం ఎదురు చూస్తూ ఉంటుంది. ఆ తర్వాత మల్లిక(mallika) ఎక్కిళ్ళు వస్తూ ఉండగా పని మనిషి చికితని నీళ్లు తీసుకొని రమ్మని చెప్పి అడుగుతూ ఉంటుంది.
పనిమనిషి ఎంతసేపటికి రాకపోవడంతో మల్లిక(mallik) బయటకి వెళ్లి చూడగా జానకిని చూసి కుళ్ళుకుంటూ ఉంటుంది. అప్పుడు రామ చంద్ర రావడంతో జానకి(janaki) నవ్వుతూ ఎదురు వెళుతుంది. అప్పుడు రామ చంద్ర దానికి వైపు అలానే చూస్తూ ఉంటాడు. అది చూసి మల్లిక కుళ్ళుకుంటూ ఉంటుంది. అప్పుడు మల్లికా ఎలా అయినా మళ్ళీ వాళ్ళ ఏకాంతని చెడగొట్టాలి అని అనుకుంటుంది.
ఇంతలోనే విష్ణు(vishnu) అక్కడికి వచ్చి ప్రేమగా మాట్లాడించడంతో మల్లికా కసురుకొని విష్ణుని పంపిస్తుంది. ఆ తర్వాత రామచంద్ర జానకి ఏం చేస్తున్నారా అని తొంగి తొంగి చూడగా ఇంతలో అక్కడికి జ్ఞానాంబ వస్తుంది. అప్పుడు మల్లికా ఒక్కసారిగా జ్ఞానాంబ దంపతుల ముందర బుక్ అవుతుంది. అప్పుడు జ్ఞానాంబ కోపంతో చూస్తూ ఉండగా మల్లిక టెన్షన్ పడుతూ ఉంటుంది. అప్పుడు జ్ఞానాంబ నోరు ముయ్యి నీ భర్త అంటే అసలు నీకు విలువ ఉందా అని అనగా వెంటనే మల్లిక(mallika)తిక్క తిక్క సమాధానాలు చెబుతూ ఉంటుంది.