- Home
- Entertainment
- Janaki Kalaganaledu: నీ భార్య కోసం నన్ను మోసం చేశావ్ కదా రామ.. కన్నీళ్లు పెట్టిన జ్ఞానాంబ!
Janaki Kalaganaledu: నీ భార్య కోసం నన్ను మోసం చేశావ్ కదా రామ.. కన్నీళ్లు పెట్టిన జ్ఞానాంబ!
Janaki Kalaganaledu: బుల్లితెరపై ప్రసారమవుతున్న జానకి కలగనలేదు (Janaki Kalaganaledu) సీరియల్ ప్రేక్షకులను బాగా ఉంటుంది. మంచి కుటుంబ కథతో ఈ సీరియల్ కొనసాగుతుంది. ఇక ఈ రోజు జులై 27ఎపిసోడ్ లో ఏం జరిగిందో తెలుసుకుందాం.

ఈరోజు ఎపిసోడ్ లో జానకి(janaki) స్టేజ్ మై బహుమతి తీసుకున్న తర్వాత ఈ అవార్డు నాకు రావడానికి కారణం ఇద్దరు ఒకరు నా భర్త, ఇంకొకరు మా నాన్న అని చెప్పి సంతోషపడుతుంది. జానకి స్పీచ్ చూసి రామచంద్ర ఆనంద పడుతూ ఉంటాడు. తన భర్త గురించి గొప్పగా పొగుడుతూ ఉండగా రామచంద్ర అది చూసి సంతోష పడుతూ ఉంటాడు. అదంతా చూస్తున్నా జ్ఞానాంబ(jnanamba)కోపంతో రగిలిపోతూ ఉంటుంది. అది చూస్తున్న మల్లిక జ్ఞానాంబను మరింత రెచ్చగొడుతూ ఉంటుంది.
ఇంతలోనే జ్ఞానాంబ(jnanamba)ను చూసినా మల్లిక భయపడుతూ ఉంటుంది. రామచంద్ర కూడా జ్ఞానాంబ చూసి టెన్షన్ పడుతూ ఉంటాడు. అప్పుడు జ్ఞానాంబ ఏమి మాట్లాడకుండా రామచంద్రవైపు జానకి వైపు మౌనంగా చూస్తూ ఉంటుంది. ఆ తర్వాత జ్ఞానాంబ ఏమి మాట్లాడకుండా మౌనంగా అక్కడి నుంచి వెళ్ళిపోతుంది. అప్పుడు జానకి అందరూ కలిసి జ్ఞానాంబను వెతుకుతూ ఉంటారు. కానీ జరిగింది మొత్తం ఊహించుకొని నేను ఒకటి అనుకుంటే ఇంకొకటి జరిగింది అని మల్లిక(mallika) బాధపడుతూ ఉంటుంది.
అప్పుడు జ్ఞానాంబ(jnanamba)కుటుంబ సభ్యులు అందరూ ఆమె కోసం ఎంత వెతికినా కనిపించకపోయేసరికి టెన్షన్ పడుతూ ఉంటారు. అప్పుడు జ్ఞానాంబ జరిగిన మొత్తం తలుచుకుని బాధపడుతూ రోడ్డుపై నడుచుకుంటూ వెళుతూ ఉంటుంది. మరొకవైపు గోవిందరాజులు జ్ఞానాంబ వెతుకుతూ ఇంటికి వెళ్తాడు. అప్పుడు పిల్లలు ఏమి అయ్యింది అని అడగగా అప్పుడు మల్లిక అవకాశం దొరికింది కదా అని జానకి(Janaki)పై లేనిపోని నిందలు వేసి జానకి చేసిన పనికి అత్తయ్య ఇంట్లో నుంచి వెళ్ళిపోయింది అని చెప్పడంతో అందరూ ఆశ్చర్యపోతారు.
అప్పుడు మల్లిక (mallika)అసలు విషయం చెప్పడంతో ఇంట్లో అందరూ ఒక్కసారి కూడా షాక్ అవుతారు. అప్పుడు గోవిందరాజులు ఇదంతా నీ వల్లే జరిగింది అనడంతో మల్లిక ఏమీ తెలియనట్టుగా నటిస్తూ ఉంటుంది. అప్పుడు గోవిందరాజు(govindaraju),రామచంద్ర కు ఫోన్ చేసి కనిపించిందా అని అడగగా లేదని అంటాడు. మరొకవైపు జ్ఞానాంబ ఆలోచిస్తూ కార్ కింద పడబోతుంది. అప్పుడు ఆ కారు అతను జ్ఞానాంబను కారు అతను నోటికొచ్చిన విధంగా తిట్టే అక్కడి నుంచి వెళ్ళిపోతాడు.
ఆ తర్వాత జ్ఞానాంబ (jnanamba) ఆలోచించుకుంటూ చెరువు దగ్గరికి వెళుతుంది. జరిగిన విషయాలు పదే పదే తలుచుకొని బాధపడుతూ ఉంటుంది. ఇంతలో రామచంద్ర జానకి వాళ్ళు బండి వస్తూ టెన్షన్ పడుతూ ఉంటారు. అప్పుడు జ్ఞానాంబ కనిపించేసరికి టెన్షన్ తో అక్కడికి వెళ్తారు. అప్పుడు రామచంద్ర(ramachandra) వాళ్ళు చేసిన పనికి ఎమోషనల్ అవుతూ మాట్లాడుతుంది.
అప్పుడు రామచంద్ర(ramachandra)నువ్వు నాకు నమ్మకద్రోహం చేసావ్ నీ అమ్మ ఎప్పుడో చచ్చిపోయింది అని మాట్లాడడంతో మాట్లాడకు అని అంటారు రామచంద్ర. తప్పు చేయలేదు రామచంద్ర మోసం చేశావు అని అంటుంది. ఈ అమ్మ నమ్మకంతో ఈ అమ్మ ప్రేమతో ఆట ఆడుకున్నావు అని అంటుంది జ్ఞానాంబ. చివరికి నన్ను పిచ్చిదాన్ని చేశావు అని అంటుంది జ్ఞానాంబ(jnanamba). అప్పుడు జ్ఞానాంబ తన బాధను మొత్తం బాధ పడుతూ ఉంటుంది.
అప్పుడు జానకి(janaki)రామ చంద్ర లను అపార్ధం చేసుకుంటుంది. నాకు తెలియకుండా నువ్వు తనని చదివించడమే కాకుండా అబద్ధాలు కూడా చెబుతున్నావు అంటూ బాధపడుతుంది జ్ఞానాంబ. నీకు ఇచ్చిన మాట కోసమే జానకిని చదివిస్తున్నాను అనడంతో జ్ఞానాంబ ఆలోచనలో పడుతుంది.