- Home
- Entertainment
- సుడిగాలి సుధీర్ తో ఫస్ట్ టైం రొమాన్స్ జరిగిన రోజు.. సీక్రెట్ లీక్ కావడంతో రష్మీ సంతోషం చూశారా..
సుడిగాలి సుధీర్ తో ఫస్ట్ టైం రొమాన్స్ జరిగిన రోజు.. సీక్రెట్ లీక్ కావడంతో రష్మీ సంతోషం చూశారా..
సుడిగాలి సుధీర్ పూర్తిగా జబర్దస్త్ కి దూరం అయ్యాడు. కానీ సుధీర్ ప్రస్తావన మాత్రం కొనసాగుతూనే ఉంది. తాజాగా విడుదలైన జబర్దస్త్ ప్రోమో వైరల్ గా మారింది.

ప్రధాన కమెడియన్స్ దూరం కావడంతో జబర్దస్త్ షో ప్రభావం కాస్త తగ్గింది. కానీ తిరిగి ఇటీవల కొందరు కమెడియన్లు జబర్దస్త్ లో పాల్గొంటున్నారు. సుడిగాలి సుధీర్ పూర్తిగా జబర్దస్త్ కి దూరం అయ్యాడు. కానీ సుధీర్ ప్రస్తావన మాత్రం కొనసాగుతూనే ఉంది. తాజాగా విడుదలైన జబర్దస్త్ ప్రోమో వైరల్ గా మారింది.
ఈ ఎపిసోడ్ కి సీనియర్ కమెడియన్ కృష్ణ భగవాన్, సీనియర్ హీరోయిన్ ఖుష్బూ జడ్జీలుగా వ్యవహరించారు. కమెడియన్ల కంటే జడ్జిగా ఉన్న కృష్ణ భగవాన్ కామెడీ పంచ్ లే ఎక్కువ పేలుతున్నాయి. ఆటో రాంప్రసాద్, గెటప్ శ్రీను నవ్వించేందుకు తమ ప్రయత్నం చేస్తున్నారు.
ఇమ్మాన్యూల్ , వర్ష చేసిన స్కిట్ ఆకట్టుకునేలా ఉంది. జబర్దస్త్ కమెడియన్ ఒకరు రష్మీకి ప్రపోజ్ చేస్తుండగా కృష్ణ భగవాన్ అడ్డు తగులుతూ పంచ్ లు వేయడం నవ్వులు పూయిస్తోంది. ప్రోమో మొత్తం కృష్ణ భగవాన్ హైలైట్ అయితే.. చివర్లో రష్మీ మార్కులు కొట్టేసింది.
టైం మెషీన్ లో వెనక్కి వెళ్లే అవకాశం ఉంటే ఎవరెవరు ఏ టైంకి వెనక్కి వెళతారు అని రష్మీ ప్రశ్నించింది. తాను నిన్న మందు కొట్టలేదని..కాబట్టి ఒకరోజు వెనెక్కి వెళతానని సన్నీ చెప్పడంతో అందరి ముఖాల్లో నవ్వులు విరిశాయి. ఇక ఖుష్బూ ఎమోషనల్ స్టోరీ చెప్పారు.
నేను 1984లో సినిమాల్లోకి ఎంట్రీ ఇచ్చా. ఒబెన్ అనే ఆంటీ నాకు హెయిర్ స్టైలిస్ట్ గా ఉన్నారు. 2011 వరకు ఆమె నాతోనే ఉన్నారు. క్యాన్సర్ కారణంగా మరణించారు. ఛాన్స్ ఉంటే ఆమెని కలుసుకునేందుకు టైంలో వెనక్కి వెళ్లాలనుకుంటున్నట్లు ఖుష్బూ ఎమోషనల్ అయ్యారు.
నువ్వు ఎక్కడికి వెళతావు అని ఆటో రాంప్రసాద్ రష్మీని ప్రశ్నించగా ..నాకు తెలుసు అంటూ గెటప్ శ్రీను కల్పించుకుంటాడు. రష్మీ, సుడిగాలి సుధీర్ తొలి కలయిక గురించి శ్రీను పరోక్షంగా కామెంట్స్ చేస్తాడు. 2014 ఫిబ్రవరి 14 న వాలంటైన్స్ డే రోజున అంటూ శ్రీను హార్ట్ సింబల్ చూపిస్తుండగా రష్మీ ఒకవైపు సంతోషం, మరోవైపు సిగ్గుతో ఉక్కిరి బిక్కిరి అవుతుంది.