- Home
- Entertainment
- గీతా మాధురి పేరు, ఫోటోతో వాట్సాప్ చాటింగ్.. నమ్మించి అలా చేస్తూ, తెగించిన ఆన్లైన్ మోసగాళ్లు
గీతా మాధురి పేరు, ఫోటోతో వాట్సాప్ చాటింగ్.. నమ్మించి అలా చేస్తూ, తెగించిన ఆన్లైన్ మోసగాళ్లు
సింగర్ గా గీతా మాధురి టాలీవుడ్ బాగా పాపులర్. తన గాత్రంలో మాస్ సాంగ్స్ పడుతూ అభిమానులని అలరిస్తోంది. ఎక్కువగా మాస్ నంబర్స్ లో పాడే అవకాశం గీతా మాధురికి వస్తూ ఉంటుంది.

సింగర్ గా గీతా మాధురి టాలీవుడ్ బాగా పాపులర్. తన గాత్రంలో మాస్ సాంగ్స్ పడుతూ అభిమానులని అలరిస్తోంది. ఎక్కువగా మాస్ నంబర్స్ లో పాడే అవకాశం గీతా మాధురికి వస్తూ ఉంటుంది. ఇక గీతా మాధురి బిగ్ బాస్ షో తో మరింత క్రేజ్ పొందారు. బిగ్ బాస్ 2లో గీతా మాధురి రన్నరప్ గా నిలిచారు.
geetha madhuri
కౌశల్ కి గట్టి పోటీ ఇచ్చిన గీతా మాధురి ఆ సీజన్ లో అద్భుతంగా పెర్ఫామ్ చేసింది. ఇక వివాదాలకు గీతా మాధురి దూరంగా ఉంటుంది. కానీ కొన్ని రూమర్స్ ఆమె పర్సనల్ లైఫ్ ని డిస్ట్రబ్ చేసే విధంగా ఉంటాయి. ఆ మధ్యన గీతా మాధురి తన భర్త నందుతో విడిపోతోంది అంటూ పుకార్లు వినిపించాయి.
ఆ రూమర్స్ ని గీతా, నందు ఇద్దరూ ఖండించారు. ప్రస్తుతం ఈ జంట అన్యోన్యంగా జీవిస్తున్నారు. ఆన్లైన్ లో ఎలాంటి మోసాలు జరుగుతుంటాయి ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. సోషల్ మీడియా వేదికగా సెలెబ్రిటీల పేరుతో అనేక ఫేక్ ప్రొఫైల్స్ దర్శనం ఇస్తూ ఉంటాయి.
కొన్ని సార్లు ఈ ఫేక్ ప్రొఫైల్స్ వల్ల సెలెబ్రిటీలు స్వయంగా వివరణ ఇవ్వాల్సిన పరిస్థితి ఏర్పడుతుంది. ప్రముఖ దర్శకులు, నటుల పేర్లు వాడుకుంటూ ఫేక్ ప్రొఫైల్స్ తో గతంలో జరిగిన మోసాలని గమనించాం. తాజాగా అలాంటి ఫ్రాడ్ ఒకటి గీతా మాధురి పేరుతో బయట పడింది.
స్వయంగా గీతా మాధురి ఈ విషయాన్ని తెలియజేసింది. నా పేరు, ప్రొఫైల్ ఫోటో తో యూఎస్ నంబర్ నుంచి ఎవరో వాట్సాప్ చాటింగ్ చేస్తున్నారని తెలిసింది. వాళ్ళు నా పేరు వాడుకుంటూ ఇతర సెలెబ్రిటీల ఫోన్ నంబర్స్ అడుగుతున్నారట. అది నేను కాదు. దయచేసి గమనించండి.
నా పేరుతో ఎవరైనా ఎలాంటి వివరాలు అడిగినా షేర్ చేయకండి అని గీతా మాధురి హెచ్చరించింది. దీనిపతి గీతా మాధురి లీగల్ గా కూడా వెళ్లే అవకాశం ఉంది. మోసాలకు పాల్పడడానికే ఆ ఫేక్ ప్రొఫైల్ లో గీతా మాధురి పేరు ఉపయోగించుకుంటున్నారు.