Intinti Gruhalashmi: వార్ ఇక్కడ నుంచి మొదలైందన్న అభి.. ప్రేమ్ కు మళ్లీ అవమానం!
Intinti Gruhalashmi: బుల్లితెరపై ప్రసారమవుతున్న ఇంటింటి గృహలక్ష్మి (Intinti Gruhalashmi) సీరియల్ కుటుంబం మీద ఉన్న బాధ్యత అనే నేపథ్యంలో కొనసాగుతూ ప్రేక్షకులను బాగా ఆకట్టుకుంటుంది. ఇక ఈ రోజు జూన్ 9 ఎపిసోడ్ లో ఏం జరిగిందో తెలుసుకుందాం.

ఇక ఎపిసోడ్ ప్రారంభంలోనే అంకిత (Ankitha) వాళ్ళ నాన్న ఎక్కడికి వెళ్ళాడు అని వివరాలు అడుగుతూ ఉండగా గాయత్రి (Gayathri) కూల్ గా సమాధానం చెబుతుంది. ఒకవైపు అభి మాత్రం టెన్షన్ పడుతూ ఉంటాడు. ఈ లోపు అంకిత వాళ్ళ నాన్న డాక్యుమెంట్స్ పట్టుకొని వస్తాడు. ఇక గాయత్రి ఆస్తిని అంకిత పేరు మీద ఎందుకు ట్రాన్స్ఫర్ చేయించారు అని విరుచుకు పడుతుంది. దాంతో అంకిత ఒకసారి గా స్టన్ అవుతుంది.
కథ ఇలా అడ్డం తిరిగింది ఏంటి? అని అభి (Abhi) మనసులో బాధ పడుకుంటాడు. ఇక ఆస్తి అభి పేరు మీద వద్దు.. అంకిత (Ankitha) పేరుమీద రాయించమని తులసి నాకు సలహా ఇచ్చిందని అంకిత తండ్రి చెబుతాడు. ఇక తులసి ఆస్తి విషయంలో లాస్య వేసే ఎత్తుగడలు గురించి అంకిత తండ్రికి చెబుతుంది. అంతేకాకుండా తులసి తన కొడుకు విషయంలో పడే తపన ను మొత్తం అంకిత తండ్రికి చెబుతుంది.
ఇక డబ్బు విషయంలో మన ఫ్యామిలీ విడిపోకూడదు. మీరు ఆస్తిని అంకిత (Anktha) పేరు మీదకు రాయించండి. అందరి దృష్టిలో నా కొడుకు చెడ్డవాడు అవ్వకూడదు అని తులసి (Tulasi) అంకిత తండ్రిని వేడుకుంటుంది. ఇక నన్ను ఆలోచించుకోనివ్వు అమ్మ అని అంకిత తండ్రి అక్కడనుంచి వెళ్ళి పోతాడు. ఇక గాయత్రి మీరు తులసి మాట వినాల్సిన అవసరం మీకు ఏమి వచ్చింది అని అంటుంది.
గాయత్రి కన్నతల్లి కొడుకుని అసమర్థుడు అని అంటుంది.. అలాంటి తల్లిని సమర్ధించ మంటావా అంటూ గాయత్రి (Gayathri) అంకితను అడుగుతుంది. ఇక తల్లి కొడుకుల మధ్య అపార్ధాలు క్రియేట్ చేయడానికి ట్రై చేయకు అని అంకిత తండ్రి గాయత్రి మీద విరుచుకు పడతాడు. ఇక గాయత్రి తులసి (Tulasi) గురించి నానారకాలుగా నెగటివ్ గా చెబుతుంది. ఇక అయినా అబద్ధాలు చెప్పాల్సిన అవసరం తులసికి ఏముంది అని అంకిత తండ్రి అడుగుతాడు.
ఇక నాకు తెలిసినంతవరకు తులసి (Tulasi) డబ్బు మనిషి కాదు అంటూ.. అంకిత (Ankitha) వాళ్ల నాన్న అంటారు. ఇక అభి కూడా అది అంకిత పుట్టింటి ఆస్తి మీరు కరెక్ట్ డిసిషన్ తీసుకున్నారు అని గాయత్రి కి అడ్డం తిరిగి మాట్లాడతాడు. ఇక చాలా పెద్ద తనంగా ఆలోచించవు అని అభిను వాళ్ళ మావయ్య దగ్గరికి తీసుకుంటాను. మరోవైపు ప్రేమ్ కొత్త ఆల్బమ్ పాడడానికి స్పాన్సర్ చేయమని ఒక మేనేజర్ ని అడుగుతాడు.
తరువాయి భాగం లో అభి (Abhi) లాస్య (Lasya) దంపతుల దగ్గరికి వెళ్లి అమ్మతో ఇప్పటినుంచి యుద్ధం స్టార్ట్ అవుతుంది అని అంటాడు. ఇక వాళ్ళ అమ్మ దగ్గరికి వెళ్లి నువ్వు చేసిన మోసం నేను మర్చిపోను.. దోసివి నువ్వే నువ్వే అంటూ తన తల్లి పై లేనిపోని నిందలు వేస్తాడు. ఇక ఈ క్రమంలో రేపటి భాగం లో ఏం జరుగుతుందో చూడాలి.