- Home
- Entertainment
- Guppedantha Manasu: వసుకు రోజాతో ప్రపోజ్ చేసిన గౌతమ్.. జగతి చేసిన కాఫీకి ఫిదా అయిన దేవయాని!
Guppedantha Manasu: వసుకు రోజాతో ప్రపోజ్ చేసిన గౌతమ్.. జగతి చేసిన కాఫీకి ఫిదా అయిన దేవయాని!
Guppedantha Manasu: బుల్లితెరపై ప్రసారమవుతున్న గుప్పెడంత మనసు (Guppedantha Manasu) సీరియల్ కుటుంబ నేపథ్యంలో కొనసాగుతూ ప్రేక్షకులను బాగా ఆకట్టుకుంటుంది. ఇక ఈ రోజు ఏప్రిల్ 20వ తేదీ ఎపిసోడ్ లో ఏం జరిగిందో తెలుసుకుందాం.

ఇక ఈ రోజు ఎపిసోడ్ ప్రారంభంలోనే వసు, రిషి కలిసి కాసేపు సరదాగా మాట్లాడుకుంటూ ఉంటారు. వసు తను ఉంటున్న ఇల్లు గురించి వివరిస్తూ ఉండగా రిషి బొద్దింకల పేరుతో వసు (Vasu) ను ఒక ఆట ఆడుకుంటాడు. ఇక వసు అక్కడున్న వాతావరణం గురించి మాట్లాడుతూ వుండగా వెంటనే రిషి (Rishi) తనను భవిష్యత్తు గురించి ఆలోచించుకోమని చదువుకోమని అంటాడు.
ఉదయానే రిషి, గౌతమ్ లు వ్యాయామాలు చేస్తూ ఉండగా గౌతమ్ (Gautham) రిషితో తన డ్రీమ్ గురించి చెబుతాడు. కానీ రిషి మాత్రం అవాయిడ్ చేస్తూ ఉంటాడు. అంతలోనే మహేంద్రవర్మ అక్కడికి రావడంతో వెంటనే గౌతమ్ మహేంద్ర (Mahendra) కు తన డ్రీం గురించి వివరిస్తాడు. అందులో తను వసు దగ్గరికి వెళ్లి రోజా పువ్వుతో ప్రపోజ్ చేయడానికి కనిపిస్తాడు.
అంతలోనే రిషి (Rishi) ఆ రోజా పువ్వును కట్ చేసి గౌతమ్ ముందుకు వచ్చి షాక్ ఇస్తాడు. ఇక దాంతో గౌతమ్ అరవడంతో తన డ్రీమ్ లో నుంచి బయటపడతాడు. తన డ్రీమ్ లో విలన్ రిషి లాగా ఉన్నాడు అనటంతో వెంటనే మహేంద్ర ఆశ్చర్యపోతాడు. రిషి మాత్రం అవన్నీ గమనిస్తూనే ఉంటాడు. వెంటనే మహేంద్ర (Mahendra) ఆ విలన్ కానీ ఆ అమ్మాయిని లవ్ చేస్తున్నాడా అని అంటాడు.
వెంటనే రిషి (Rishi) షాక్ అవుతాడు. మరోవైపు దేవయాని ఇంట్లో.. వంట గదిలో.. జగతి కాఫీ పెడుతుంది. పక్కనే ఉన్న ధరణి నేను చేస్తాను అత్తయ్య అంటూ మాట్లాడుతూ ఉండగానే అప్పుడే దేవయాని వచ్చి వారితో ఫైర్ అవుతూ కనిపిస్తుంది. జగతి కూడా అస్సలు తగ్గకుండా ఆ ఇంట్లో కోడలి హోదాగా గట్టిగా మాట్లాడుతుంది. పక్కనే ఉన్న ధరణి (Dharani) షాక్ అవుతుంది.
అంతేకాకుండా ఉదయాన్నే కాఫీ తాగుతూ ఇన్ని రోజులకు కాఫీ అద్భుతంగా పెట్టావు ధరణి (Dharani) అంటూ ఫిదా అవ్వగా వెంటనే జగతి నేనే పెట్టాను అక్కయ్య అంటూ సమాధానం ఇస్తుంది. దాంతో దేవయాని (Devayani) ఎదిరించి మాట్లాడటంతో జగతి మాత్రం వెటకారంగా సమాధానం చెబుతుంది. ఇక ఆ సమయానికి అక్కడ రిషి రావడంతో దేవయాని కాస్త ఓవర్ చేస్తుంది.
తర్వాత రిషి (Rishi) అక్కడి నుంచి కాలేజీకి వెళ్లగా అక్కడ తన క్లాసులో నోటీస్ వస్తుంది. అది చూసి వసుధార హాలిడే అనుకుంటూ మురిసిపోతుంది. కానీ అది స్కాలర్ షిప్ టెస్ట్ అని ఇందులో ఎవరెవరు పాల్గొంటారు అని అనడంతో ఎవరు దానికి స్పందించరు. దాంతో రిషి వసు (Vasu) పేరు రాసి వసు ను ఎగ్జామ్ కు ప్రిపేర్ అవ్వమని చెబుతాడు.