MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
  • Home
  • Entertainment
  • 'యానిమల్' నచ్చలేదు కానీ , ఆ మాట అంటే సందీప్ వంగా ఎటాక్ చేస్తారు అంటున్న స్టార్ డైరక్టర్

'యానిమల్' నచ్చలేదు కానీ , ఆ మాట అంటే సందీప్ వంగా ఎటాక్ చేస్తారు అంటున్న స్టార్ డైరక్టర్

సినిమా వచ్చి దాదాపు ఐదు నెలలు అవుతున్నా సరే ఇప్పటికీ ఎవరో ఒకరు 'యానిమల్'పై విమర్శలు చేస్తూనే ఉన్నారు.

4 Min read
Surya Prakash
Published : Apr 23 2024, 12:31 PM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
113
Sandeep Reddy Vanga

Sandeep Reddy Vanga


రణ్‌బీర్‌ కపూర్‌ - సందీప్ వంగా కాంబినేషన్‌లో వచ్చిన ‘యానిమల్‌’ భారీ విజయాన్ని సొంతం చేసుకున్న సంగతి తెలిసిందే. ఈ చిత్రంపై పలువురు ప్రముఖులు వారి అభిప్రాయాన్ని సోషల్ మీడియా వేదికగా తెలియజేశారు. అలాగే  'యానిమల్' సినిమాని ఎంతమందికి నచ్చింది అనేది ప్రక్కన పెడితే  విమర్శలు మాత్రం చాలా ఎక్కువే వచ్చాయి. చాలామంది సినీ ప్రముఖులు ఈ సినిమాలోని సన్నివేశాలపై బహిరంగంగానే కామెంట్స్ చేశారు. అయితే సందీప్ వంగా వాటిని తేలిగ్గా తీసుకోలేదు. డైరక్ట్ గానే కౌంటర్స్ ఇస్తూ వచ్చారు.  దాంతో గౌతమ్ వాసుదేవ మీనన్ వంటి స్టార్ డైరక్టర్ సైతం ఈ సినిమాపై కామెంట్స్ చేయటానికి జంకారు. ఆయన ఏమన్నారో చూద్దాం.

213


రీసెంట్ గా గౌతమ్ మీనన్ ని సందీప్ తాజా చిత్రం యానిమల్ పై అభిప్రాయం చెప్పమని ఇంటర్వూలో అడగటం జరిగింది. అయితే దానికి గౌతమ్ మాట్లాడుతూ ...సినిమా నేరేషన్,  క్యారెక్టరైజేషన్‌పై తనకు రిజర్వేషన్లు ఉన్నాయని మీనన్ చెప్పారు.  అయితే తన కామెంట్స్  అవాంఛిత చర్చలకు దారితీస్తుందనే భయంతో వివరించకూడదని ఆగిపోతున్నానని అన్నారు. 
 

313


యానిమల్ చిత్రం చేస్తున్నప్పుడు కొందరు ఓ హార్రర్ మూవీని చూస్తున్నట్లుగా కనిపించారని అన్నారు. తరచుగా వారి ముఖాలను చేతులతో కప్పి, వేళ్ళతో సినిమాని చూస్తున్నారని అన్నారు. తాను యానిమల్ చిత్రం ఫస్టాఫ్ చూసిన తర్వాత థియేటర్ నుండి బయటకు వెళ్లిపోయినట్లు చెప్పారు. ఆ తర్వాత  సెకండాఫ్ చూడటానికి ఐదు రోజుల తర్వాత తిరిగి వచ్చానని చెప్పారు. 
 

413


అలాగే కంటిన్యూ చేస్తూ.., “నేను కనక సినిమా గురించి ఏమైనా చెప్తే, వంగా టీమ్ నాకు ఈ సినిమా గురించి మాట్లాడటానికి అధారిటి ఏమిటి అని ప్రశ్నించవచ్చు. అలాగే అసలు నువ్వు అనవచ్చు . అవి అనేక మాటల యుద్దాలకు ,కాంప్లికేషన్స్ కు దారి తీస్తాయి. కాబట్టి నేను అలాంటి జరగకుండా జాగ్రత్తపడుతున్నాను .ఇక సినిమా ఎలా ఉన్నా రణబీర్ కపూర్ మాత్రం అద్బుతంగా నటించారు” అన్నారు.

513

సోషల్ మీడియా జనం గౌతమ్ మీనన్ మాట్లాడిన ఈ క్లిప్ ని షేర్ చేస్తూ వంగాని ట్యాగ్ చేస్తు ...ఫన్ చేస్తున్నారు.  ఇప్పుడు మీనన్ కు కౌంటర్ ఇవ్వు అని రెచ్చగడొతున్నారు. అయితే సందీప్ వంగా ఇలా రెచ్పిపోయి మాట్లాడే మనిషి కాదు. తనకు అసంబద్దంగా అనిపిస్తేనే ఆయన ఎదురు కౌంటర్ ఇస్తున్నారు. ఈ నేపధ్యంలో కొందరు గౌతమ్ మీనన్ ని భలే తప్పించుకున్నారు సార్ అని మెచ్చుకుంటూంటే ,మరికొందరు సందీప్ వంగాని పొగుడుతున్నారు. అంత గొప్ప సినిమా తీసినప్పుడు ఆ మాత్రం మాట్లాడకపోతే ఎలా అంటున్నారు. 

613


 
 జనవరి 26 నుంచి ప్రముఖ ఓటీటీ నెట్‌ఫ్లిక్స్‌లో యానిమల్ స్ట్రీమింగ్ అవుతోంది. ఓటీటీలో యానిమల్ మూవీ చూసిన సెలబ్రిటీలు విమర్శలు చేస్తున్నారు. అదేం సినిమా అంటూ పలు కామెంట్స్‌తో తమ రివ్యూ ఇచ్చారు. ఈ క్రమంలోనే బాలీవుడ్ సూపర్ స్టార్ అమీర్ ఖాన్ మాజీ భార్య కిరణ్ రావు సైతం యానిమల్ మూవీపై రియాక్ట్ అయింది.

713


బోల్డ్ కంటెంట్, స్త్రీల పట్ల ద్వేషం, వేధింపులను ప్రోత్సహించేలా ఉన్నాయని కిరణ్ రావు అన్నారు. దాంతో ఆ వీడియో నెట్టింట్లో తెగ వైరల్ అయింది. కిరణ్ రావు చేసిన కామెంట్స్‌పై తాజాగా ఓ మీడియా సంస్థకు ఇంటర్వ్యూలో ఆమె పేరు ఎత్తకుండా స్ట్రాంగ్ కౌంటర్ ఇచ్చారు. దాంతో సందీప్ రెడ్డి కామెంట్స్ కూడా సోషల్ మీడియాలో తెగ ట్రెండ్ అవుతున్నాయి.

813


''ఈ రోజు ఉదయం నా ఏడీ (అసిస్టెంట్ డైరెక్టర్) నాకు ఒక ఆర్టికల్ చూపించారు. అవి సూపర్ స్టార్ రెండో మాజీ భార్య చేసిన కామెంట్స్. బాహుబలి 2, కబీర్ సింగ్ లాంటి సినిమాలు స్త్రీ వ్యతిరేకతను, వేధింపులను ప్రోత్సహిస్తున్నాయని ఆమె అంటున్నారు. వేధింపులకు, దగ్గరవడానికి మధ్య తేడా ఆమెకు తెలియదని నేను అనుకుంటున్నాను. ప్రజలు ఈ విషయాలను సందర్భోచితంగా చదివినప్పుడు వారు అంగీకరిస్తారు. ఇది పూర్తిగా తప్పు'' అని సందీప్ రెడ్డి వంగా అన్నాడు.

913
Sandeep reddy vanga

Sandeep reddy vanga


 సందీప్ వంగా తనపై చేసిన కామెంట్ల గురించి ఆమిర్‌ ఖాన్ మాజీ భార్య కిరణ్‌ రావు (Kiran Rao) స్పందించారు. ‘నేను ప్రత్యేకించి సందీప్‌ చిత్రాల గురించి మాట్లాడలేదు. కొన్ని సినిమాల్లో స్త్రీలను కించపరిచేలా సన్నివేశాలను చిత్రీకరిస్తున్నారని అన్నాను. ఇదే విషయం నేను గతంలోనూ చాలా వేదికలపై చెప్పాను. నేను తన సినిమాల గురించే మాట్లాడుతున్నానని ఎందుకు ఊహించుకున్నారో నాకు తెలియదు. మీరు ఈ విషయం ఆయన్నే అడగండి’ అన్నారు.

1013


ఇప్పుడు ఈ లిస్టులో 12th ఫెయిల్ నటుడు, మాజీ ఐఏఎస్ వికాస్ దివ్యకృతి కూడా చేశారు. ఈ చిత్రం మన సమాజాన్ని పదేళ్లు వెనక్కి తీసుకెళ్తుందని కౌంటర్స్ వేశారు.''యానిమల్' లాంటి సినిమా మన సమజాన్ని పదేళ్లు వెనక్కి తీసుకెళ్తుంది. ఇలాంటిది అసలు తీసి ఉండకూడదు. మీకు డబ్బులు వచ్చి ఉండొచ్చు. కానీ హీరోని మీరు జంతువులా చూపించారు. అలానే ఈ సినిమాలో హీరోయిన్ ని హీరో తన కాలికి ఉన్న షూ నాకమనే సీన్ ఒకటి ఉంటుంది. దీన్ని చూసి రేప్పొద్దున యూత్ కూడా ఇలానే ప్రవర్తిస్తే ఏంటి పరిస్థితి? ఇలాంటి కేర్ లెస్, బుద్ధిలేని సినిమాలు తీయడం చూస్తుంటే బాధేస్తోంది. మూవీ చూస్తుంటే చిరాకేసింది' అని వికాస్ దివ్యకృతి ఆవేదన వ్యక్తం చేశారు.

1113


 ప్రముఖ రచయిత జావేద్‌ అక్తర్‌ (Javed Akhtar) గతంలో ఈ చిత్రంలోని సన్నివేశాన్ని పరోక్షంగా విమర్శించిన సంగతి తెలిసిందే. ఇలాంటి చిత్రాలు ప్రమాదకరమన్నారు. దీనిపై సందీప్ (Sandeep Reddy Vanga) తాజాగా ఓ ఆంగ్ల మీడియాకు ఇచ్చిన ఇంటర్వ్యూలో స్పందించారు. ‘‘మీర్జాపుర్‌’ సిరీస్‌లో ఎన్నో అభ్యంతరకరమైన పదాలు ఉన్నాయి. ఆ సినిమాను నిర్మించిన ఫర్హాన్‌ అక్తర్‌ (జావేద్‌ కుమారుడు)కు సలహా ఇవ్వమనండి. ప్రపంచంలో ఉన్న అసభ్యపదాలన్నీ అందులోనే ఉన్నాయి. నేను దాన్ని పూర్తిగా చూడలేదు. ప్రకటనల్లో వచ్చిన సీన్స్ చూసే వాంతి వచ్చిన ఫీలింగ్ కలిగింది. ముందు తన కుమారుడు నిర్మించే వాటిపై జావేద్‌ను శ్రద్ధపెట్టమనండి..’’ అని ఘాటుగా రిప్లై ఇచ్చారు. ప్రస్తుతం ఈ వ్యాఖ్యలు బాలీవుడ్‌లో తీవ్ర చర్చనీయాంశమవుతున్నాయి.
 

1213


విజయ్ దేవరకొండ హీరోగా చేసిన అర్జున్ రెడ్డి సినిమాతో బోల్డ్ డైరెక్టర్‌గా సక్సెస్ కొట్టాడు సందీప్ రెడ్డి వంగా. 3 గంటల 6 నిమిషాల రన్ టైమ్‌తో అర్జున్ రెడ్డి మూవీని తెరకెక్కించడంతోపాటు సెన్సేషనల్ హిట్ కొట్టిన సందీప్ రెడ్డి వంగా పేరు అప్పట్లే మారుమోగిపోయిన విషయం తెలిసిందే. అనంతరం అదే సినిమాను హిందీలో షాహిద్ కపూర్, కియారా అద్వానీలతో కబీర్ సింగ్‌ టైటిల్‌తో రీమేక్ చేశాడు. అక్కడ కూడా కబీర్ సింగ్ మూవీ సూపర్ హిట్ కొట్టింది.

1313

మరో ప్రక్క బాలీవుడ్‌ హీరో రణ్‌వీర్‌ సింగ్‌ ‘యానిమల్‌’పై తన స్పందనను సందీప్‌కు ఫోన్ చేసి చెప్పారట. ‘ఈ చిత్రానికి రణ్‌వీర్‌ సింగ్‌ ఇచ్చిన రివ్యూను నేను మర్చిపోలేను. దాన్ని ఇప్పటికీ నమ్మలేకపోతున్నా. ‘యానిమల్‌’ చూశాక నాకు ఫోన్‌ చేసి 40 నిమిషాలు మాట్లాడాడు. ఆ తర్వాత ఓ సుదీర్ఘ మెసేజ్‌ పెట్టాడు. దాన్ని నాలుగు సార్లు చదువుకున్నా. చాలా ఆనందం వేసింది. సినిమా గురించి చాలా విషయాలు రాశాడు. ఇందులో ఇన్ని విశేషాలున్నాయా అని నేనే ఆశ్చర్యపోయాను’ అని చెప్పారు.
 

About the Author

SP
Surya Prakash
తెలుగు సినిమా జర్నలిజం లో గత ఇరవై ఏళ్లుగా ఉన్నారు. కొన్ని వందల రివ్యూలు, విశ్లేషణాత్మక ఆర్టికల్స్ రాశారు. ఈయన ప్రముఖ సినీ విమర్శకుడు కూడా.

Latest Videos
Recommended Stories
Related Stories
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2025 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved