- Home
- Entertainment
- Guppedantha Manasu: గౌతమ్ కు వార్నింగ్ ఇచ్చిన రిషి.. ప్రేమ గురించి ఆలోచనలో పడ్డ వసు!
Guppedantha Manasu: గౌతమ్ కు వార్నింగ్ ఇచ్చిన రిషి.. ప్రేమ గురించి ఆలోచనలో పడ్డ వసు!
Guppedantha Manasu: బుల్లితెరపై ప్రసారమవుతున్న గుప్పెడంత మనసు (Guppedantha Manasu ) సీరియల్ ప్రేక్షకులను బాగా ఆకట్టుకుంటుంది. కుటుంబ కథ నేపథ్యంలో ట్విస్ట్ ల మీద ట్విస్ట్ లతో కొనసాగుతున్న ఈ సీరియల్ రేటింగ్ లో మొదటి స్థానంలో దూసుకు వెళుతుంది. ఇక ఈరోజు ఎపిసోడ్ హైలెట్ ఏంటో చూద్దాం.

వసు, రిషిలు ఒకచోట కూర్చుని ఉండగా మధ్యలో పానకంలో పుడకలా వచ్చిన గౌతమ్ (Gautham), వసుకు రోమియో జూలియట్ పుస్తకం గురించి వివరిస్తాడు. దాన్నీ చిరాగ్గా భావించిన రిషి.. వసుధార (Vadhara) ను అక్కడి నుంచి పంపిస్తాడు.

వసుధార (Vasudhara) అక్కడి నుంచి వెళ్లిపోయిన తర్వాత గౌతమ్, నువ్వు నా పాలిట యముడిలా తయారయ్యావని రిషిని అంటాడు. అలా కొంత సమయం ఆ ఇద్దరి మధ్య మాటలు యుద్ధం నడుస్తుంది. ఈ క్రమంలో రిషి (Rishi), వసు విషయంలో స్ట్రాంగ్ వార్నింగ్ ఇస్తాడు.
ఆ తర్వాత రిషి, గౌతమ్ (Gautham) ను కాఫీ తాగుదాం రా రా అంటూ.. ఫ్రెండ్లీగా తీసుకువెళ్తాడు. ఇక అక్కడి నుంచి ఇంటికి వెళ్లిన వసుధార (Vasudhara) వాళ్ళిద్దరూ ప్రేమ గురించి చెప్పిన మాటలు గుర్తు చేసుకుని నిజంగా ప్రేమ అంత గొప్పదా అని ఆలోచిస్తుంది.
ఆ తర్వాత జగతి (Jagathi) బోర్ కొడుతుంది అని చెప్పగా.. వసు మహేంద్ర కాల్ కలిపి ఇంటికి రమ్మంటుంది. దీంతో మహేంద్ర ఆనందంగా ఉరుకులు పరుగులతో రాగా ఈ సమయంలో రిషి ఎదురవుతాడు. ఇక మహేంద్ర (Mahendra) స్టన్ అవుతాడు.
మరోవైపు గౌతమ్ (Gautham ) కూడా వసును చూడడానికి మంచి జోష్ తో రెడీ అవుతాడు. వెళ్లడానికి మహేంద్ర కార్ నె లిఫ్ట్ గా ఎంచుకుంటాడు. మహేంద్ర (Mahendra) కూడా సరే తన తనతో పాటు తీసుకెళతాడు. కానీ ఇద్దరూ ఒక గూటికే చేరుతున్న సంగతి వాళ్లకు తెలియదు.
హడావిడిగా ఏం జరుగుతుందో అని వసుధార (Vasudhara ) దగ్గరికి రిషి వస్తాడు. ఆ తర్వాత వాటర్ తాగి తిరిగి వెళ్ళుతుండగా కాలు జారీ పడబోతుంటే వసు పట్టుకుంటుంది. ఈ గ్యాప్ లో వీళ్లిద్దరు ఒక సాంగ్ చేసుకుంటారు. ఇంతలో మహేంద్ర (Mahendra) రానే వస్తాడు.
కారులో నుంచి దిగిన మహేంద్ర (Mahendra ) అక్కడ ఉన్న రిషిని చూసి షాక్ అవుతాడు. ఆ తర్వాత వాటర్ అడుగుతాడు. ఈలోపు అక్కడకు గౌతమ్ (Gautham) ఆటోలో రానే వస్తాడు. ముగ్గురు ఒకేసారి రావడంతో ఏంటని జగతి ఆలోచిస్తుంది.
ఆటోలో నుంచి దిగిన గౌతమ్ (Gautham) వీరిద్దరిని చూసి షాక్ అవుతాడు. వీళ్ళకు ఏం సమాధానం చెప్పాలని మనసులో ఆలోచించుకుంటాడు. తనకు ఏమీ తెలియనట్టు అందరికీ హాయ్ హలో చెబుతాడు. ఇక ముగ్గురు ఒక గూటికి చేరుకుంటున్న తరుణంలో రేపటి భాగం లో ఏం జరుగుతుందో చూడాలి.