Nagabandham: 8 గంటల మేకప్, నిద్ర లేదు.. 'నాగబంధం' కోసం KGF గరుడ రామ్ పడిన కష్టాలు
'నాగబంధం' సినిమా కోసం KGF ఫేమ్ గరుడ రామ్ ఎంత ఇబ్బంది పడ్డాడో తెలుసా? కేవలం మేకప్ కోసమే 8 గంటలు సమయం పట్టడంతో.. రామ్ ఫేస్ చేసిన స్ట్రగుల్ అంతా ఇంతా కాదు. అనంత పద్మనాభస్వామి ఆలయ రహస్యం ఆధారంగా తెరకెక్కిన ఈ పాన్-ఇండియా సినిమా జులై 3న విడుదల కానుంది.
15

Image Credit : others
8 గంటల మేకప్
'నాగబంధం' సినిమాలో గరుడ రామ్ పాత్ర చాలా భయంకరంగా ఉంటుంది. దానికోసం ఆయన ఉదయం నుంచి సాయంత్రం వరకు 8 గంటల పాటు మేకప్ వేసుకునేవారు. రాత్రంతా ఆయనపైనే షూటింగ్ జరిగేది. ఆ సమయంలో ఆయనకు తిండి, నిద్ర సరిగ్గా ఉండేవి కావు.
గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండి
25
Image Credit : others
బైరాగి పాత్రలో రామ్
ఈ మాటలు రామ్ చెప్పినవి కాదు. 'నాగబంధం' సినిమా హీరోగా నటించిన విరాట్ కర్ణ వెల్లడించారు. ఈ చిత్రంలో గరుడ రామ్ 'బైరాగి' అనే పాత్రను పోషించారు.ఈ క్యారెక్టర్ కోసం ఆయన ఎంత కష్టపడ్డారు అనే విషయాన్ని విరాట్ కర్ణ వివరించారు.
35
Image Credit : others
విరాట్ కర్ణ కఠిన వ్రతం
'నేను పోషించిన శివుడి పాత్ర కోసం చాలా బాడీ ట్రాన్స్‌ఫర్మేషన్ చేసుకోవాల్సి వచ్చింది. శివమాల ధరించడంతో పాటు కొన్ని కఠినమైన వ్రతాలు కూడా చేశాను. లేకపోతే ఆ పాత్రకు కావాల్సిన ఎనర్జీ, ఫీల్ తీసుకురావడం సాధ్యమయ్యేది కాదు' అని హీరో విరాట్ చెప్పారు.
45
Image Credit : others
అనంత పద్మనాభస్వామి ఆలయ రహస్యం
ఈ చిత్రానికి అభిషేక్ నామా దర్శకత్వం వహించారు. కేరళలోని అనంత పద్మనాభస్వామి ఆలయం రహస్యమైన 'నాగబంధం' తో పాటు హిమాలయాల నేపథ్యంలో ఈ సినిమా కథ నడుస్తుంది.
55
Image Credit : others
నాగబంధం రిలీజ్ ఎప్పుడంటే?
హీరోయిన్ నభా నటేష్ సినిమాలోని ఓ పాటకు డ్యాన్స్ చేశారు. గరుడ రామ్, భజరంగీ ప్రసన్న, వినయ్ బిద్దప్ప ఈ ప్రెస్ మీట్‌లో పాల్గొన్నారు. ఈ సినిమా జులై 3న విడుదల కాబోతోంది.
Latest Videos

