- Home
- Entertainment
- Pushpa: ఒక స్మగ్లర్ కి అలాంటి డైలాగా.. అల్లు అర్జున్, సుకుమార్ పై గరికపాటి తీవ్ర విమర్శలు
Pushpa: ఒక స్మగ్లర్ కి అలాంటి డైలాగా.. అల్లు అర్జున్, సుకుమార్ పై గరికపాటి తీవ్ర విమర్శలు
పుష్ప మూవీ, అల్లు అర్జున్ నటనపై దేశవ్యాప్తంగా ఉన్న సెలెబ్రిటీలు ప్రశంసలు కురిపిస్తున్నారు. అయితే ప్రవచన కర్త, అవధాని ఇటీవల పద్మశ్రీ అవార్డుకు ఎంపికైన గరికపాటి నరసింహారావు పుష్ప చిత్రంపై తీవ్రమైన విమర్శలు చేశారు.

ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ నటించిన పుష్ప చిత్ర మానియా ప్రపంచ వ్యాప్తంగా వ్యాపించింది. వరల్డ్ వైడ్ గా ఉన్న సెలెబ్రిటీలు, స్టార్ క్రికెటర్లు సైతం చిత్రంలోని పాటలకు డాన్స్ చేస్తూ కనిపిస్తున్నారు. గత ఏడాది డిసెంబర్ లో విడుదలైన పుష్ప మొదటి భాగం మంచి విజయం సాధించింది. సెకండ్ పార్ట్ కి కావలసిన పబ్లిసిటీ ఆల్రెడీ క్రియేట్ అయిపోయింది అనే చెప్పాలి.
దీనితో పార్ట్ 2పై ఊహించని విధంగా అంచనాలు పెరిగిపోయాయి. అల్లు అర్జున్ ఈ చిత్రంలో ఎర్రచందనం స్మగ్లర్ గా అద్భుతంగా నటించాడు. అల్లు అర్జున్ యాటిట్యూడ్, చిత్తూరు యాసలో డైలాగ్ డెలివరీ ప్రేక్షకులని విశేషంగా ఆకట్టుకున్నాయి. ఇక సుకుమార్ తన క్రియేటివిటీతో ఆసక్తికరమైన పాత్రలు సృష్టించారు.
పుష్ప మూవీ, అల్లు అర్జున్ నటనపై దేశవ్యాప్తంగా ఉన్న సెలెబ్రిటీలు ప్రశంసలు కురిపిస్తున్నారు. అయితే ప్రవచన కర్త, అవధాని ఇటీవల పద్మశ్రీ అవార్డుకు ఎంపికైన గరికపాటి నరసింహారావు పుష్ప చిత్రంపై తీవ్రమైన విమర్శలు చేశారు. ఓ ఇంటర్వ్యూలో భాగంగా గరికపాటి పుష్ప సినిమాపై ఆగ్రహం వ్యక్తం చేస్తూ టీనా మనసులో భావాలని బయట పెట్టారు.
గరికపాటి నరసింహారావు మాట్లాడుతూ.. ఇవాళ సినిమాల్లో హీరోలని రౌడీగా, ఇడియట్ గా చూపిస్తున్నారు. ఇటీవల విడుదలై విజయం సాధించిన పుష్ప చిత్రంలో హీరో ఒక స్మగ్లర్. అందులో అనుమానం లేదు కదా. ఒక స్మగ్లర్ ని హీరో చేసి చూపించారు. అడిగితే చివర్లో ఒక 5 నిమిషాలు మంచిగా చూపిస్తాం.. పార్ట్ 2లో మంచిగా చూపిస్తాం.. పార్ట్ 3 అంటూ కబుర్లు చెబుతారు.
అంటే అప్పటి వరకు సమాజం చెడిపోయినా ఫర్వాలేదా.. ఈ సినిమా వల్ల స్మగ్లింగ్ అనేది ఒక గొప్ప విషయం అనే భావన కలగలేదా.. సమాజం చెడిపోవడం అంటే ఇదే. పైగా స్మగ్లింగ్ చేసే వ్యక్తికి తగ్గేదే లే అంటూ డైలాగ్ చెబుతాడు. ఆ డైలాగ్ ప్రస్తుతం సమాజంలో ఒక ఉపనిషత్తు సూక్తి లాగా మారిపోయింది. ఎవరైనా కుర్రాడిని కొడితే తగ్గేదే లే అని అంటాడు. దీనికి కారణం ఎవరు ?
హీరో అల్లు అర్జున్, డైరెక్టర్ సుకుమార్ ని నాకు సమాధానం చెప్పమనండి.. మొత్తం కడిగేస్తా అంటూ గరికపాటి తీవ్ర విమర్శలు చేశారు. ఇలాంటి సినిమాల వల్ల సమాజంలో నేరాలు పెరుగుతున్నాయి. తగ్గేదే లే అనే మాట హరిశ్చంద్రుడు లాంటివారో.. శ్రీరాముడి లాంటి వారో అనాలి. ఒక స్మగ్లర్ ఆ డైలాగు చెప్పడం ఏంటి అంటూ గరికపాటి ఆగ్రహం వ్యక్తం చేశారు.
గరికపాటి భారత సంస్కృతి, పురాణాలపై ప్రసంగాలు చేస్తుండడం చూస్తూనే ఉన్నాం. ఇప్పటి పరిస్థితులు, అలవాట్లపై ఆయన ఫన్నీ సెటైర్లు వేస్తూ తన ప్రసంగాల్లో ఉదహరిస్తుంటారు. గతంలో అల్లు అర్జున్ 'బన్నీ' చిత్రంలోని టైటిల్ సాంగ్ పై కూడా ఆయన చేసిన వ్యాఖ్యలు యూట్యూబ్ లో వైరల్ అయ్యాయి.