'గ్యాంగ్స్ ఆఫ్ గోదావరి' తర్వాత పవన్ కళ్యాణ్ తో 'పవర్ పేట' ?
టాలీవుడ్ లో తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్న యువ హీరోల్లో విశ్వక్ సేన్ ఒకరు. విశ్వక్ సేన్ తనదైన పంథాలో వైవిధ్యమైన చిత్రాలు చేస్తూ రాణిస్తున్నాడు. విశ్వక్ సేన్ నుంచి మరికొన్ని గంటల్లో రాబోతున్న చిత్రం గ్యాంగ్స్ ఆఫ్ గోదావరి.

టాలీవుడ్ లో తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్న యువ హీరోల్లో విశ్వక్ సేన్ ఒకరు. విశ్వక్ సేన్ తనదైన పంథాలో వైవిధ్యమైన చిత్రాలు చేస్తూ రాణిస్తున్నాడు. విశ్వక్ సేన్ నుంచి మరికొన్ని గంటల్లో రాబోతున్న చిత్రం గ్యాంగ్స్ ఆఫ్ గోదావరి. నేహా శెట్టి ఈ చిత్రంలో హీరోయిన్ గా నటిస్తోంది.
మే 31న ఈ చిత్రం రిలీజ్ అవుతోంది. దీనితో మరికొన్ని గంటల్లో వరల్డ్ వైడ్ గా షోలు ప్రారంభం కాబోతున్నాయి. ఇటీవల విడుదలైన ట్రైలర్ చాలా ప్రామిసింగ్ గా ఉంటూ సినిమాపై అంచనాలు పెంచేసింది. విశ్వక్ సేన్ బోల్డ్ పెర్ఫామెన్స్ తో చెలరేగిపోయినట్లు ఉన్నాడు. పొలిటికల్, క్రైమ్ అంశాలు ఈ చిత్రంలో మెండుగా కనిపిస్తున్నాయి.
ఈ చిత్రం హిట్ గ్యారెంటీ అంటూ అంచనాలు మొదలయ్యాయి. లిరిసిస్ట్ గా గుర్తింపు సొంతం చేసుకున్న కృష్ణ చైతన్య దర్శకత్వంలో ఈ చిత్రం తెరకెక్కింది. అయితే ఈ చిత్రం కొంతమంది హీరోల చేతులు మారింది అనే రూమర్స్ ఉన్నాయి. అందులో మొదటిగా వినిపించే పేరు నితిన్.
రౌడీ ఫెల్లో చిత్రం తర్వాత కృష్ణ చైతన్య నితిన్ తో చల్ మోహన్ రంగా అనే మూవీ చేశారు. ఆ చిత్రం నిరాశపరిచింది. అయినప్పటికీ కృష్ణ చైతన్య నితిన్ తో కొంతకాలంగా ట్రావెల్ చేశారు. పవర్ పేట అనే టైటిల్ తో నితిన్ తో యాక్షన్ మూవీ చేయాలనుకున్నారు. ఆ చిత్రమే గ్యాంగ్స్ ఆఫ్ గోదావరిగా మారిందా అనే రూమర్స్ రావడంతో డైరెక్టర్ క్లారిటీ ఇచ్చారు.
గ్యాంగ్స్ ఆఫ్ గోదావరి చిత్రాన్ని నితిన్ తో చేయాలనుకోలేదని.. శర్వానంద్ తో చేయాలనుకున్నట్లు కృష్ణ చైతన్య తెలిపారు. శర్వానంద్ ఈ కథ తనకి సెట్ అవుతుందా అనే అనుమానంతో ఒకే చేయలేదు. ఆ విధంగా ఈ మూవీ విశ్వక్ సేన్ చేతుల్లోకి వచ్చింది. గ్యాంగ్స్ ఆఫ్ గోదావరి రిలీజ్ అవుతుండడంతో పవర్ పేట గురించి కూడా చర్చ మొదలైంది
కృష్ణ చైతన్య స్వస్థలం వెస్ట్ గోదావరిలోని ఏలూరు. అక్కడ పవర్ పేట ఉంది. అక్కడ జరిగే పొలిటికల్ అంశాలతో కథ రాసుకున్నారు. నితిన్ తో భారీ బడ్జెట్ లో చేయాలనుకున్నారు. నితిన్ రిస్క్ ఎందుకు అని వదిలేశాడో ఏమో. రీసెంట్ గా గ్యాంగ్స్ ఆఫ్ గోదావరి ప్రొమోషన్స్ లో కృష్ణ చైతన్య పవర్ పేట గురించి చిన్న హింట్ ఇచ్చారు.
Pawan Kalyan
పవర్ పేట కథని ఎవరితో చేస్తారు అని ప్రశ్నించగా.. ఆ కథ పవన్ కళ్యాణ్ లాంటి వారికి బాగా సెట్ అవుతుందని కృష్ణ చైతన్య తెలిపారు. పవన్ తో సినిమా చేయడం తన డ్రీం అని కూడా కృష్ణ చైతన్య పేర్కొన్నాడు. ఇదే కనుక జరిగితే పవన్ ఫ్యాన్స్ కి పండగే అని చెప్పొచ్చు.