- Home
- Entertainment
- సన్నగా ఉన్నానని నా శరీరంపై వాటిని పెట్టారు.. అసహ్యంగా అనిపించింది, హీరోయిన్ హాట్ కామెంట్స్
సన్నగా ఉన్నానని నా శరీరంపై వాటిని పెట్టారు.. అసహ్యంగా అనిపించింది, హీరోయిన్ హాట్ కామెంట్స్
చిత్ర పరిశ్రమలో హీరోయిన్లకు ఎక్కువగా ఇబ్బందులు ఎదురవుతుంటాయి. కెరీర్ ప్రారంభంలో అయితే ఆడిషన్స్ పేరుతో లైంగిక వేధింపులు కూడా జరుగుతాయని చాలా మంది నటీమణిలు తమ చేదు అనుభవాలని గతంలో బయట పెట్టారు.

చిత్ర పరిశ్రమలో హీరోయిన్లకు ఎక్కువగా ఇబ్బందులు ఎదురవుతుంటాయి. కెరీర్ ప్రారంభంలో అయితే ఆడిషన్స్ పేరుతో లైంగిక వేధింపులు కూడా జరుగుతాయని చాలా మంది నటీమణిలు తమ చేదు అనుభవాలని గతంలో బయట పెట్టారు. కాస్టింగ్ కౌచ్, మీటూ ఉద్యమాల్లో హీరోయిన్ల పై జరుగుతున్న వేధింపులు చాలా వరకు బయట పడ్డాయి.
ఇక తాము బాడీ షేమింగ్ కి కూడా గురవుతున్నామని కొంతమంది నటీమణులు వాపోతున్న సంగతి తెలిసిందే. ఆ జాబితాలో 'గాలిపటం' ఫేమ్ హీరోయిన్ ఎరికా ఫెర్నాండేజ్ కూడా ఉన్నారు. సౌత్ లో తనకు చాలా అసభ్యకరమైన సంఘటన, అవమానం ఎదురయ్యాయని ఎరికా ఓ ఇంటర్వ్యూలో హాట్ కామెంట్స్ చేసింది.
సౌత్ లో హీరోయిన్లు కొంచెం బొద్దుగా ఉంటేనే నచ్చుతారు. కానీ నేను మాత్రం సన్నగా ఉండేదాన్ని. దీనితో నేను లావుగా కనిపించడం కోసం నా శరీరంపై చాలా చోట్ల ప్యాడ్స్ పెట్టారు. అది నాకు చాలా అసభ్యంగా అనిపించేది. అవమానమా కూడా ఫీల్ అయ్యా.
నేను సన్నగా ఉండడం వీళ్లకు నచ్చడం లేదా అని అనుమానం కలిగేది. శరీరమంతా ప్యాడ్స్ ధరించి నటించాలంటే చాలా ఇబ్బందిగా అనిపించేది.వాళ్ళు కోరుకున్న విధంగా కనిపించడం కోసం చాలా ఇబ్బంది పడ్డాను అని ఎరికా ఫెర్నాండేజ్ తెలిపింది. ఒకరకంగా ఇది నాకు బాడీ షేమింగ్ అనిపించినట్లు ఎరికా వాపోయింది.
థైస్ తో పాటు ఇతర భాగాల్లో కూడా ప్యాడ్స్ పెట్టారు. వాటిని పెట్టుకుని నటించాలంటే కంఫర్టబుల్ గా ఉండదు. కానీ ఇప్పుడు పరిస్థితులు మారాయి. సన్నగా ఉన్నా కూడా నటీమణులని యాక్సెప్ట్ చేస్తున్నారు అని ఎరికా ఫెర్నాండేజ్ పేర్కొంది.
ఎరికా 2014లో హీరో ఆది సరసన గాలిపటం చిత్రంలో మెరిసింది. డేగ చిత్రంలో కూడా నటించింది. కొన్ని తమిళ చిత్రాల్లో కూడా ఎరికా ఫెర్నాండేజ్ అవకాశాలు అందుకుంది.