MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
TRENDING :
IMD Weather Update
Today's Rasi Phalalu
Pakistan Economic Crisis
Epic First Semester BO Collections
Megastar Chiranjeevi
Bigg Boss Telugu 10
Srikanth Daughter Medha Meka
Asian Games 2026
IMD Weather Update
Today's Rasi Phalalu
Jr NTR Injury Update
OTT Releases This Week
Actress Roja Selvamani
Team India Captain
Dimpu Kallem Asha
Abhishek Sharma
Missing Meghana Movie Review
Getup Srinu Remuneration
Chicken Curry Recipe
  • Home
  • Entertainment
  • Funky vs Couple Friendly Box Office: ఫంకీ, కపుల్‌ ఫ్రెండ్లీ మూవీ కలెక్షన్లు.. విశ్వక్‌ సేన్‌కి సంతోష్‌ శోభన్‌ షాక్‌

Funky vs Couple Friendly Box Office: ఫంకీ, కపుల్‌ ఫ్రెండ్లీ మూవీ కలెక్షన్లు.. విశ్వక్‌ సేన్‌కి సంతోష్‌ శోభన్‌ షాక్‌

ప్రేమికుల రోజు సందర్భంగా తెలుగు నుంచి రెండు క్రేజీ సినిమాలు వచ్చాయి. విశ్వక్‌ సేన్‌ నటించిన `ఫంకీ`, సంతోష్‌ శోభన్‌, మానస వారణాసి నటించిన `కపుల్‌ ఫ్రెండ్లీ`. ఈ సినిమాల బాక్సాఫీసు రిజల్ట్ ఎలా ఉందంటే? 

2 Min read
Author : Aithagoni Raju
Published : Feb 19 2026, 11:01 AM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
15
ఫంకీ మూవీ రిజల్ట్
Image Credit : X/@SitharaEnts

ఫంకీ మూవీ రిజల్ట్

విశ్వక్‌ సేన్‌, కయాదు లోహర్‌ జంటగా నటించిన `ఫంకీ` మూవీ గత వారం విడుదలైంది. అనుదీప్‌ రూపొందించిన ఈ చిత్రాన్ని నాగవంశీ, సాయి సౌజన్య నిర్మించారు. ఈ చిత్రానికి మొదటి రోజు నుంచే నెగటివ్‌ టాక్‌ వచ్చింది. కామెడీ వర్కౌట్‌ కాలేదనే టాక్‌ వినిపించింది. అయితే ప్రారంభంలో మంచి ఓపెనింగ్స్ ని రాబట్టింది. మరి క్రమంగా తగ్గుతూ వస్తోంది. ఈ చిత్రం ఆరు రోజుల్లో ఎంత కలెక్ట్ చేసిందనేది చూస్తే.

గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండిgooglePreferred
25
ఫంకీ మూవీ కలెక్షన్లు
Image Credit : Asianet News

ఫంకీ మూవీ కలెక్షన్లు

ఈ మూవీకి మొదటి రోజు నాలుగున్నర కోట్ల గ్రాస్‌ వచ్చింది. అనుదీప్‌ మూవీ కావడం, విశ్వక్‌ సేన్‌, కయాదు లోహర్‌ వంటి క్రేజీ జంట నటించడంతో సినిమాకి మొదటి రోజు మంచి వసూళ్లు వచ్చాయి. కానీ  రెండో రోజు నుంచే తగ్గిపోయింది. క్రమంగా తగ్గుతూ వస్తోంది. ఇక ఆరు రోజులు పూర్తి చేసుకున్న ఈ చిత్రం ఇప్పటి వరకు సుమారు రూ.11కోట్ల రేంజ్‌లో వసూళ్లని రాబట్టింది. ఐదున్నర కోట్ల షేర్‌ని వసూలు చేసింది. ఈ సినిమా బ్రేక్‌ ఈవెన్‌ టార్గెట్‌ రూ.14కోట్లు. ఇంకా ఎనిమిది కోట్లకుపైగా షేర్‌ని రాబట్టాలి. అంటే పదహారు కోట్ల వరకు గ్రాస్‌ వసూళ్లు చేయాలి. కానీ ప్రస్తుతం ఆ పరిస్థితి కనిపించడం లేదు.

35
కపుల్‌ ఫ్రెండ్లీ మూవీ రిజల్ట్
Image Credit : Asianet News

కపుల్‌ ఫ్రెండ్లీ మూవీ రిజల్ట్

ఇక దీనికి పోటీగా వచ్చిన మరో సినిమా `కంపుల్‌ ఫ్రెండ్లీ`. ఇది ప్రేమికుల రోజు ఫిబ్రవరి 14న విడుదలైంది. ఇందులో సంతోష్‌ శోభన్‌, మానస వారణాసి జంటగా నటించారు. అశ్విన్‌ చంద్రశేఖర్‌ రూపొందించారు. యూవీ కాన్సెప్ట్స్ నిర్మించారు. అజయ్‌ నిర్మాత. ఈ చిత్రానికి సూపర్‌ హిట్‌ టాక్‌ వచ్చింది. ఫ్రెష్‌ లవ్‌ స్టోరీగా విమర్శకుల ప్రశంసలందుకుంది. కానీ బాక్సాఫీసు వద్ద ఆ జోరు కనిపించలేదు. ప్రారంభంలో శనివారం, ఆదివారం బాగానే జోరు చూపించిన ఈ చిత్రం ఇప్పుడు డల్‌ అయిపోయింది.

45
కపుల్‌ ఫ్రెండ్లీ మూవీ కలెక్షన్లు
Image Credit : Asianet News

కపుల్‌ ఫ్రెండ్లీ మూవీ కలెక్షన్లు

`కపుల్‌ ఫ్రెండ్లీ` చిత్రం ఐదు రోజులు పూర్తి చేసుకుంది. ఇప్పటి వరకు సుమారు ఆరున్నర నుంచి ఏడు కోట్ల వరకు వసూళ్లని రాబట్టింది. మూడున్నర కోట్ల షేర్‌ని సాధించింది. ఈ మూవీ సేఫ్‌ కావాలంటే ఆరున్నర కోట్లు రావాలి. అంటే ఇప్పుడు సగం వచ్చాయి. ఇంకా మూడు కోట్లు రావాలి. అంటే ఇంకా ఆరు కోట్ల వరకు గ్రాస్‌ వసూళ్లు రాబట్టాల్సి ఉంది. ఈ వారం నడిస్తే, ఇదే జోరు కనిపిస్తే సేఫ్‌ అవుతుంది. లేదంటే కొంత నష్టాలు తప్పవు.

55
ఫంకీకి, కపుల్‌ ఫ్రెండ్లీ షాక్‌
Image Credit : Asianet News

ఫంకీకి, కపుల్‌ ఫ్రెండ్లీ షాక్‌

అయితే `ఫంకీ`తో పోల్చితే `కపుల్‌ ఫ్రెండ్లీ` తక్కువ నష్టంతో ముగిస్తుందని చెప్పొచ్చు. కానీ బాగా  ఆడితే మాత్రం సేఫ్‌ అయ్యే ఛాన్స్ ఉంది. ఎందుకంటే ఈ వారం కూడా పెద్ద సినిమాలు లేవు. థియేట్రికల్‌గా మంచి స్కోప్‌ ఉంది. ఆ ఛాన్స్ ఉంది. కానీ `ఫంకీ` మూవీకి ఆ స్కోప్‌ కనిపించడం లేదు. ఈ మూవీ ఆల్మోస్ట్ క్లోజ్‌ అయ్యే పరిస్థితిలో ఉంది. లక్షల్లో వసూళ్లు వస్తున్నాయి. అవి కూడా క్రమంగా పడిపోతున్నాయి. ఈ రోజు, రేపటితో ఈ మూవీ థియేట్రికల్‌గా ముగింపు పలికే ఛాన్స్ కనిపిస్తుంది. ఇది విశ్వక్‌ సేన్‌, అనుదీప్‌, నాగవంశీలు పెద్ద షాక్‌ అనే చెప్పొచ్చు.

About the Author

AR
Aithagoni Raju
అయితగోని రాజు 2020 నుంచి ఏషియానెట్‌ తెలుగులో వర్క్ చేస్తున్నారు. ఆయనకు టీవీ, ప్రింట్‌, డిజిటల్‌ జర్నలిజంలో 13ఏళ్ల అనుభవం ఉంది. ప్రధానంగా న్యూస్‌, సినిమా జర్నలిజం, ఎంటర్‌టైన్‌మెంట్‌ రంగంలో ప్రముఖ సంస్థల్లో వర్క్ చేశారు. ప్రపంచ సినిమాని `షో`(నవతెలంగాణ) పేరుతో రాసిన ప్రత్యేక కథనాలు విశేష గుర్తింపుని తెచ్చిపెట్టాయి. ప్రస్తుతం ఏషియానెట్‌ తెలుగులో ఎంటర్‌టైన్‌ మెంట్ టీమ్‌ని లీడ్‌ చేస్తున్నారు. సబ్‌ ఎడిటర్‌గానే రిపోర్టర్ గా సినిమా ఫీల్డ్ అనుభవం ఉంది. ఎంటర్‌టైన్‌మెంట్‌ విభాగంలో సినిమా, టీవీ, ఓటీటీ కి సంబంధించి ఆసక్తికర కథనాలను, సినీ ఇండస్ట్రీలోని విషయాలను, సినిమా రివ్యూలు, విశ్లేషణాత్మక కథనాలు రాయడంలో మంచి పట్టు ఉంది. క్వాలిటీ కంటెంట్‌ని అందిస్తూ, క్వాలిటీ జర్నలిజాన్ని ముందుకు తీసుకెళ్లడంలో తనవంతు కృషి చేస్తున్నారు.
తెలుగు సినిమా
ఏషియానెట్ న్యూస్
ఏషియానెట్ న్యూస్ తెలుగు ఒరిజినల్స్
 

Latest Videos
Recommended Stories
Recommended image1
కీర్తి సురేష్ సినిమా పెద్దలకు మాత్రమేనా? ట్రైలర్ చూసి ఫ్యాన్స్ షాక్
Recommended image2
Ranabaali: రియల్‌ కపుల్‌ రొమాన్స్ అదిరిపోయేలా ఏందయ్య సామీ.. రణబాలి మూవీ ఫస్ట్ సాంగ్‌ ఎలా ఉందంటే?
Recommended image3
జీవితంలో ఎంత క‌ష్ట‌మైనా రానీ.. ఒక్క‌సారి ఈ పాట వింటే మీ ఆలోచ‌న మార‌డం ఖాయం
Related Stories
Recommended image1
Barabar Premistha Total Collections: చంద్రహాస్‌ మూవీకి వడ్డీ డబ్బులు కూడా రాలేదా? బరాబర్‌ ప్రేమిస్తా టోటల్‌ వసూళ్లు
Recommended image2
Chiranjeevi: రజనీకాంత్‌, మోహన్‌ బాబు కుట్ర.. చిరంజీవికి ఇండస్ట్రీ హిట్‌ మిస్‌, కానీ మంచే జరిగిందా?
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved