MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
TRENDING :
Toxic Movie First Review
IMD Weather Update
Today Rasi Phalalu
Irumudi Movie 4 Days Collections
Megastar Chiranjeevi
Dhruv Jurel
OTT Releases
Devdutt Padikkal
Dakshina Kailasam Temple
Bigg Boss Agnipariksha
  • Home
  • Entertainment
  • Shah Rukh Khan: ఒకప్పుడు ఢిల్లీలో సమోసాలు అమ్మిన షారుఖ్ ఖాన్ ప్రస్తుతం 6000 కోట్లకు అధిపతి, షాకింగ్ నిజం చెప్పింది ఎవరో తెలుసా?

Shah Rukh Khan: ఒకప్పుడు ఢిల్లీలో సమోసాలు అమ్మిన షారుఖ్ ఖాన్ ప్రస్తుతం 6000 కోట్లకు అధిపతి, షాకింగ్ నిజం చెప్పింది ఎవరో తెలుసా?

షారుఖ్ ఖాన్ జీవితం కేవలం ఒక సక్సెస్ స్టోరీ మాత్రమే కాదు. పేదరికం, ఆకలి, అవమానాలను ఎదుర్కొని సింహాసనం అధిష్టించిన ఒక సామాన్యుడి స్ఫూర్తిదాయక ప్రయాణం . రీసెంట్ గా బాలీవుడ్ బాద్ షా గురించి బయటపడ్డ అసలు నిజం ఏంటో తెలుసా? 

2 Min read
Author : Mahesh Jujjuri
Published : Jun 24 2026, 12:12 PM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
14
సమోసాలు అమ్మిన కుర్రాడు.. ప్రస్తుతం బాలీవుడ్ బాద్‌షా
Image Credit : Instagram

సమోసాలు అమ్మిన కుర్రాడు.. ప్రస్తుతం బాలీవుడ్ బాద్‌షా

బాలీవుడ్ 'కింగ్ ఖాన్', 'బాద్‌షా', 'ప్రపంచంలోనే అత్యంత ధనవంతుడైన నటుడు'... షారుఖ్ ఖాన్‌కు ఇలాంటి బిరుదులు చాలానే ఉన్నాయి. ఇప్పుడు ముంబైలోని 'మన్నత్' అనే రాజభవనంలో నివసిస్తున్న షారుఖ్.. కోట్లాది మంది అభిమానులకు ఆరాధ్య దైవం. కానీ, ఆయన విలాసవంతమైన జీవితం వెనుక ఎవరూ ఊహించలేని కన్నీటి కథ, కఠోర శ్రమ ఉన్నాయి. ఒకప్పుడు ఇదే సూపర్ స్టార్ ఢిల్లీ వీధుల్లో సమోసాలు అమ్ముకున్నాడనే విషయం ఇప్పుడు సోషల్ మీడియాలో హాట్ టాపిక్‌గా మారింది.

గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండిgooglePreferred
24
ఎన్‌ఎస్‌డీ క్యాంటీన్ సమోసా కుర్రాడు
Image Credit : Facebook

ఎన్‌ఎస్‌డీ క్యాంటీన్ సమోసా కుర్రాడు

ఇటీవల సీనియర్ నటుడు పంకజ్ కపూర్ పంచుకున్న ఒక జ్ఞాపకం ఇప్పుడు అందరినీ ఆశ్చర్యపరుస్తోంది. 1970లలో పంకజ్ కపూర్, నసీరుద్దీన్ షా లాంటి దిగ్గజ నటులు ఢిల్లీలోని 'నేషనల్ స్కూల్ ఆఫ్ డ్రామా' (NSD)లో నటన నేర్చుకుంటున్నారట. ఆ సమయంలో క్యాంటీన్‌కు వేడి వేడి సమోసాలు తీసుకువచ్చే ఒక చిన్న కుర్రాడు అందరి దృష్టిని ఆకర్షించేవాడట. ఆ కుర్రాడు మరెవరో కాదు, నేటి గ్లోబల్ సూపర్ స్టార్ షారుఖ్ ఖాన్.

Related Articles

Related image1
Roja Selvamani Daughter: హీరోయిన్ గా రోజా కూతురు అన్షు మాలిక ఎంట్రీ ఇవ్వబోతోందా? స్టార్ హీరో వారసుడితో జతకట్టబోతుందా?
Related image2
Mahesh Babu: అన్న కొడుకు కోసం రంగంలోకి మహేష్ బాబు, జయకృష్ణ కోసం ఏం చేయబోతున్నాడంటే?
34
తండ్రి హోటల్.. షారుఖ్ కష్టాలు
Image Credit : Facebook

తండ్రి హోటల్.. షారుఖ్ కష్టాలు

షారుఖ్ ఖాన్ తండ్రి మీర్ తాజ్ మొహమ్మద్ ఖాన్ ఢిల్లీలో 'ఖతిర్' పేరుతో ఒక చిన్న రెస్టారెంట్ నడిపేవారు. ఇంటి ఆర్థిక పరిస్థితి అంతంతమాత్రంగానే ఉండేది. దీంతో, షారుఖ్ చిన్న వయసులోనే తండ్రికి పనుల్లో సహాయం చేసేవాడు. రెస్టారెంట్‌లో చేసిన సమోసాలను బుట్టలో పెట్టుకుని ఎన్‌ఎస్‌డీ క్యాంటీన్‌కు చేరవేయడం ఆయన పని. అప్పట్లో పెద్ద పెద్ద కళాకారులు సమోసాలు తింటూ నాటకాల గురించి చర్చిస్తుంటే, ఈ కుర్రాడు దూరం నుంచి వాళ్లనే ఆశ్చర్యంగా చూస్తూ ఉండేవాడట. అప్పుడు సమోసాలు ఇచ్చిన కుర్రాడే, భవిష్యత్తులో అదే నటులతో స్క్రీన్ పంచుకుంటాడని ఎవరూ ఊహించలేదు!

44
దీవానా నుంచి 'బాద్‌షా' వరకు.. అసాధారణ ప్రయాణం:
Image Credit : Red Chillies Entertainment

దీవానా నుంచి 'బాద్‌షా' వరకు.. అసాధారణ ప్రయాణం:

1992లో 'దీవానా' చిత్రంతో షారుఖ్ ఖాన్ బాలీవుడ్‌లోకి అడుగుపెట్టినప్పుడు ఆయనకు ఎలాంటి గాడ్‌ఫాదర్ లేరు. అప్పటి సూపర్ స్టార్ రిషి కపూర్ ముందు నటించడం అంత సులభం కాదు. కానీ షారుఖ్ తన కళ్లలోని కసితోనే ప్రేక్షకులను గెలుచుకున్నాడు. ఆ తర్వాత 'బాజీగర్', 'డర్' లాంటి సినిమాల్లో విలన్‌గా కనిపించి మ్యాజిక్ చేశాడు. 'దిల్‌వాలే దుల్హనియా లే జాయేంగే'తో ప్రేమకథా చిత్రాలకు రారాజుగా మారిపోయాడు.షారుఖ్ ఖాన్ కథ ఒక ముఖ్యమైన పాఠం నేర్పుతుంది. జీవితంలో మనం ఎక్కడ ఉన్నామనేది కాదు, ఎక్కడికి చేరుకోవాలనే పట్టుదల ముఖ్యం. అప్పట్లో సమోసాలు అమ్ముకున్న కుర్రాడు, ఈ రోజు అక్షరాలా 6000 కోట్లకు పైగా ఆస్తికి అధిపతి.

About the Author

MJ
Mahesh Jujjuri
మహేశ్ జుజ్జూరి 13 ఏళ్ళకు పైగా తెలుగు జర్నలిస్టుగా పని చేస్తున్నారు. ఈయన గతంలో 10 టీవీలో సినిమా, ఫీచర్స్ జర్నలిస్టుగా పని చేశారు. 2021 నుంచి ఏసియా నెట్ తెలుగులో సినిమా జర్నలిస్టుగా ఉన్నరు. ఓటీటీ, టీవీ, బిగ్ బాస్, లైఫ్ స్టైల్ ఇతర సెలబ్రిటీలకు సంబందించిన విశేషాలను, ఫీచర్లను రాయడం ఈయన ప్రత్యేకత. క్వాలిటీ కంటెంట్‌ తో విశ్లేషణాత్మక కథనాలు రాయడంలో మంచి పట్టు ఉంది.
వినోదం
ఏషియానెట్ న్యూస్
బాలీవుడ్

Latest Videos
Recommended Stories
Recommended image1
ANR: పెళ్లై పిల్లలున్న హీరోయిన్‌తో ఏఎన్నార్ ఆన్ స్క్రీన్ రొమాన్స్... 275 రోజులు ఆడి రికార్డు సృష్టించిన సినిమా ఏదో తెలుసా?
Recommended image2
Ashika Ranganath: ఫ్లోరల్ ప్రింట్ చీరలో ఆషికా రంగనాథ్‌ మతిపోయే పోజులు.. హైలైట్‌ ఇదే
Recommended image3
Mahakali: మహాకాళి అవతారంలో శ్రియా రెడ్డి.. సలార్ స్టార్ బ్యాక్‌గ్రౌండ్, క్రికెట్ ఫ్యామిలీ కనెక్షన్స్ ఇవే
Related Stories
Recommended image1
Roja Selvamani Daughter: హీరోయిన్ గా రోజా కూతురు అన్షు మాలిక ఎంట్రీ ఇవ్వబోతోందా? స్టార్ హీరో వారసుడితో జతకట్టబోతుందా?
Recommended image2
Mahesh Babu: అన్న కొడుకు కోసం రంగంలోకి మహేష్ బాబు, జయకృష్ణ కోసం ఏం చేయబోతున్నాడంటే?
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved