MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
  • Home
  • Entertainment
  • చంపటానికే స్కెచ్... పండ్ల ర‌సంలో ఎవ‌రో విషం క‌లిపి ఇచ్చారు

చంపటానికే స్కెచ్... పండ్ల ర‌సంలో ఎవ‌రో విషం క‌లిపి ఇచ్చారు

 కొందరు ఆయన చేత బలవంతంగా పండ జ్యూస్ తాగించారు. మళ్లీ కొంచెం దూరం వెళ్లిన తరువాత మజ్జిగ తాగించడంతో కడుపులో నొప్పిగా ఉందని ఆలీఖాన్ కిందపడిపోయాడు. 

2 Min read
Author : Surya Prakash
Published : Apr 19 2024, 12:35 PM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
17
Mansoor Ali Khan

Mansoor Ali Khan


మన్సూర్ అలీ ఖాన్ ఎప్పుడూ ఏదో ఒక వివాదంలో ఉంటూ వస్తున్నారు.  ఇప్పుడు తాజాగా మన్సూర్ అలీఖాన్‌పై విషం ప్రయోగం జరిగిందనే న్యూస్ తమిళనాడులో జరుగుతున్న పార్లమెంటు ఎన్నికలలో సంచలనం సృష్టిస్తున్నాయి. అయితే అందులో నిజం ఎంత అనేది తెలియదు కానీ ఈ విషయం మాత్రం హాట్ టాపిక్ గా అక్కడ మీడియాలో మారింది. ప్రస్తుతం ఆయన హాస్పటిల్ లో ఉన్నారు. 
 

Add Asianetnews Telugu as a Preferred SourcegooglePreferred
27


రీసెంట్ గా లోకేశ్ కనగరాజ్ దర్శకత్వంలో విజయ్ హీరోగా నటించిన లియో సినిమా మంచి హిట్ అయిన విష‌యం తెలిసిందే. ఇందులో మన్సూర్ అలీఖాన్ కూడా నటించారు. ఈయన తమిళ సినిమాల్లో రేప్ సీన్లు, విలన్ వేషాల్లో ఎక్కువగా కనిపించేవారు. అయితే ఈ సినిమా త‌ర్వాత త్రిష‌పై సంచ‌ల‌న ఆరోప‌ణ‌లు చేశాడు. ఇది పెద్ద వివాదంగా మారింది. మెగాస్టార్ చిరంజీవితో పాటు ప‌లువురు ప్రముఖులు ఆయ‌న తీరుని ఎండ‌గ‌ట్టారు.
 

37


దాంతో వారంతా  త్రిష‌కి సారీ చెప్పాల‌ని డిమాండ్ చేశారు. మొద‌ట్లో చెప్ప‌న‌ని అన్నా, త‌ర్వాత మాత్రం క్షమాప‌ణ‌లు కోరాడు. దీంతో వివాదం ముగిసింది.ఆయన సైలెంట్ గా ఉంటాడనుకుంటే  ఆయ‌న సంచ‌ల‌న ఆరోప‌ణ‌లు చేశారు. త‌న‌కు పండ్ల ర‌సంలో ఎవ‌రో విషం క‌లిపి ఇచ్చారంటూ షాకింగ్ కామెంట్స్ చేశాడు.

47


లోక్ సభ ఎన్నికల నేపథ్యంలో రాజకీయ పార్టీలు ముమ్మరంగా ప్రచారం చేస్తున్నాయి. నటుడు మన్సూర్ అలీఖాన్ కూడా పార్లమెంటు ఎన్నికలలో పోటీ చేస్తుండడంతో తీరిక లేకుండా ఆయన ప్రచారం నిర్వహిస్తున్నారు. వేలూరు ప్రచారం చేస్తుండగా కొందరు ఆయన చేత బలవంతంగా పండ జ్యూస్ తాగించారు. మళ్లీ కొంచెం దూరం వెళ్లిన తరువాత మజ్జిగ తాగించడంతో కడుపులో నొప్పిగా ఉందని ఆలీఖాన్ కిందపడిపోయాడు. 

57


ఆ స‌మ‌యంలో ఆయ‌న అస్వ‌స్థ‌త‌కు గుర‌య్యారు. వెంటనే గుడియాత్తంలోని ప్రైవేట్‌ ఆస్పత్రికి తరలించారు. చికిత్స తర్వాత గుడియాత్తం నుంచి చెన్నై కేకేనగర్‌లోని ప్రైవేట్‌ ఆస్పత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. అయితే ఆయ‌న‌ని ప్ర‌స్తుతం ఐసీయూలో ఉంచి చికిత్స అందిస్తున్నారు. ప్రస్తుతం ఆయన ఐసీయూలో చికిత్స పొందుతున్నారు. అయితే ఆయ‌న తాజాగా ఓ ప్ర‌క‌ట‌న విడుద‌ల చేసి అంద‌రి దృష్టిని ఆక‌ర్షించే ప్ర‌య‌త్నం చేశారు.

67
Mansoor Alikhan

Mansoor Alikhan

తనకు ఎవరో జ్యూస్‌లో విషం కలిపి ఇచ్చారంటూ కామెంట్ చేశారు.. గుడియాత్తం సంత నుంచి ఇంటికి బయలుదేరుతుండగా.. కొందరు పండ్ల రసం ఇచ్చారని, అది తాగిన కొద్దిసేపటికే గుండెనొప్పి మొదలైందని చెప్పారు. ఆ త‌ర్వాత త‌న‌ని ఆసుప‌త్రికి త‌ర‌లించార‌ని చెప్పుకొచ్చారు.  ఆయన అభిమానులు, పార్టీ కార్యకర్తలు ఆలీఖాన్ పై విషం ప్రయోగం జరిగిందని ఆరోపణలు చేశారు. రాజకీయమే కోసం విషం ప్రయోగం చేశారని వారు ఆగ్రహం వ్యక్తం చేశారు.

77
Actor Mansoor Ali Khan

Actor Mansoor Ali Khan

 
 అయితే తన అభిమానులెవరూ ఆందోళన చెందవద్దని ప్రస్తుతం తాను బాగానే ఉన్నానని చెప్పారు. పోలింగ్ స‌మ‌యంలో ఆయ‌న ఈ ప్ర‌క‌ట‌న విడుద‌ల చేయ‌డం ఇప్పుడు హాట్ టాపిక్‌గా మారింది. కాగా, మన్సూర్ అలీ ఖాన్ ఇటీవలే రాజకీయ పార్టీ ‘తమిళ దేశియ పులిగల్’ నుండి తొలగించబడ్డాడు. దాంతో స్వ‌తంత్య్ర అభ్య‌ర్ధిగా పోటీలో నిలుచున్నాడు.

About the Author

SP
Surya Prakash
తెలుగు సినిమా జర్నలిజం లో గత ఇరవై ఏళ్లుగా ఉన్నారు. కొన్ని వందల రివ్యూలు, విశ్లేషణాత్మక ఆర్టికల్స్ రాశారు. ఈయన ప్రముఖ సినీ విమర్శకుడు కూడా.

Latest Videos
Recommended Stories
Recommended image1
Pawan Kalyan ఫ్యామిలీతో ప్రధాని ముచ్చట్లు.. మోదీతో మార్క్ శంకర్ ని చూశారా, వైరల్ అవుతున్న ఫోటోలు!
Recommended image2
2026 Biggest Flops: బిగ్గెస్ట్ ఫ్లాప్ మూవీస్ లిస్ట్ లో పవన్, ప్రభాస్ సినిమాలు.. దారుణంగా దెబ్బ తీశాయిగా
Recommended image3
Aishwarya Rai కి క్షమాపణ చెప్పిన బాలకృష్ణ హీరోయిన్.. సడెన్ గా సినిమాల నుంచి మాయం, ఏం జరిగింది ?
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved