బాలకృష్ణ వదులుకున్న 5 బ్లాక్ బస్టర్ మూవీస్! ఇవి చేసి ఉంటే ఆయన రేంజ్ మరోలా ఉండేది!
నందమూరి బాలకృష్ణ వివిధ కారణాలతో పలు బ్లాక్ బస్టర్ చిత్రాలు వదులుకున్నాడు. ముఖ్యంగా ఆయన రిజెక్ట్ చేసిన 5 చిత్రాలు భారీ విజయాలు నమోదు చేశాయి. అవేమిటో చూద్దాం..
బాలకృష్ణ ఐదు దశాబ్దాలుగా పైగా చిత్ర పరిశ్రమలో రాణిస్తున్నారు. తాతమ్మ కల బాలయ్య మొదటి చిత్రం. ఈ మూవీలో ఆయన చైల్డ్ ఆర్టిస్ట్ అని చెప్పొచ్చు. అనంతరం హీరోగా మారి తండ్రి ఎన్టీఆర్ కి తగ్గ వారసుడు అనిపించుకున్నాడు. మాస్ హీరోగా విపరీతమైన ఫ్యాన్ బేస్ బాలకృష్ణ ఏర్పాటు చేసుకున్నారు. బాలయ్య డైలాగ్ చెబితే గూస్ బంప్స్ వస్తాయి. ఆయన ఒంటి చేత్తో వంద మందిని నరికినా ప్రేక్షకులు అంగీకరిస్తారు.
Movies rejected by Balakrishna
సుదీర్ఘ సినీ ప్రస్థానం లో అనేక బ్లాక్ బస్టర్స్ బాలకృష్ణ ఇచ్చారు. కాగా బాలకృష్ణ వదులుకున్న కొన్ని సినిమాలు ఇండస్ట్రీని చేశాయి. అవేమిటో చూద్దాం. కే రాఘవేంద్రరావు దర్శకుడిగా తెరకెక్కిన జానకిరాముడు సూపర్ హిట్. నాగార్జున-విజయశాంతి జంటగా నటించారు. విలేజ్ లవ్ అండ్ యాక్షన్ డ్రామాగా తెరకెక్కిన జానకిరాముడు సూపర్ హిట్. నాగార్జున కెరీర్ కి జానకిరాముడు హిట్ చాలా ఉపయోగపడింది. సాంగ్స్ అబ్బురపరుస్తాయి.
Movies rejected by Balakrishna
జానకిరాముడు ప్రాజెక్ట్ కోడి రామకృష్ణ దర్శకత్వంలో బాలకృష్ణ చేయాల్సింది. అనూహ్యంగా కోడి రామకృష్ణ ఈ ప్రాజెక్ట్ నుండి తప్పుకున్నాడు. దాంతో బాలయ్య కూడా జానకిరాముడు చేయనున్నారు. కే రాఘవేంద్రరావు జానకిరాముడు మూవీ నాగార్జునతో చేసి హిట్ కొట్టారు. ఈ సినిమాలోని సాంగ్స్ ఎవర్ గ్రీన్. బాలయ్యను వదులుకున్న మరొక చిత్రం చంటి. వెంకటేష్ కెరీర్లో చంటి బిగ్గెస్ట్ హిట్. అప్పట్లో నెలల తరబడి ఈ సినిమా థియేటర్స్ లో ఆడింది.
Movies rejected by Balakrishna
రాజశేఖర్ హీరోగా తెరకెక్కిన సింహరాశి చిత్రంగా కమర్షియల్ హిట్. రాజశేఖర్ హుందాగా నటించి మెప్పించారు. అమ్మ సెంటిమెంట్ ప్రధానంగా తెరకెక్కిన సింహరాశి విజయం సాధించింది. ఈ మూవీకి మొదటి చాయిస్ బాలకృష్ణ అట. ఆయన రిజెక్ట్ చేయడంతో రాజశేఖర్ తలుపు తట్టింది. సింహరాశి రిజెక్ట్ చేసిన బాలకృష్ణ ఓ హిట్ కోల్పోయాడు.
ఎన్టీఆర్ కి ఫస్ట్ ఇండస్ట్రీ హిట్ సింహాద్రితో దక్కింది. రాజమౌళి తన రెండో చిత్రంగా సింహాద్రి తెరకెక్కించారు. ఎన్టీఆర్-రాజమౌళి కాంబోలో సెకండ్ మూవీ. సింహాద్రి అనేక టాలీవుడ్ రికార్డ్స్ బ్రేక్ చేసింది. ఎన్టీఆర్ ని మాస్ హీరోల జాబితాలో చేర్చింది సింహాద్రి. కాగా ఫస్ట్ ఈ కథను రాజమౌళి బాలకృష్ణకు వినిపించారు. కానీ ఆయన ఆసక్తి చూపలేదు. రాజమౌళికి అప్పుడు ఇంతటి ఫేమ్ లేదు. ఈ కారణంగా బాలకృష్ణ సింహాద్రి ప్రాజెక్ట్ రద్దు చేయలేదు.
Movies rejected by Balakrishna
పరాజయాలతో సతమతం అవుతున్న రవితేజకు బ్రేక్ ఇచ్చిన చిత్రం క్రాక్ . గోపీచంద్ మలినేని తెరకెక్కించిన ఈ మూవీ లాక్ డౌన్ ఆంక్షల మధ్య విడుదలై కూడా మంచి వసూళ్లు రాబట్టింది. రవితేజ ఓ పవర్ఫుల్ పోలీస్ రోల్ చేశాడు. శృతి హాసన్ హీరోయిన్. ఈ మూవీని బాలయ్యతో చేయాలని గోపీచంద్ మలినేని భావించారు. బాలయ్య రిజెక్ట్ చేయడంతో రవితేజ వద్దకు పోయింది. ఆ విధంగా క్రాక్ రూపంలో మరో సూపర్ హిట్ బాలయ్యకు మిస్ అయ్యింది.