- Home
- Entertainment
- పవిత్ర లోకేష్‌తో ప్రేమ ఎలా స్టార్ట్ అయ్యిందో బయటపెట్టిన నరేష్.. ఐ లవ్యూ చెబితే చెమటలు పట్టించిందట!
పవిత్ర లోకేష్‌తో ప్రేమ ఎలా స్టార్ట్ అయ్యిందో బయటపెట్టిన నరేష్.. ఐ లవ్యూ చెబితే చెమటలు పట్టించిందట!
పవిత్ర లోకేష్, నరేష్.. ప్రస్తుతం టాలీవుడ్‌లో అత్యంత క్రేజీ కపుల్. ఈ ఇద్దరు సహజీవనం చేస్తుండటం ఓ విశేషమైతే, తమ రిలేషన్‌షిప్ ఆధారంగానే సినిమా చేయడం మరో విశేషం. అయితే తాజాగా తన లవ్ స్టోరీ బయటపెట్టాడు నరేష్.

నరేష్, పవిత్ర లోకేష్. టాలీవుడ్ ఇప్పుడు హాట్ కపుల్, క్రేజీ కపుల్. ప్రస్తుతం వీరి గురించిన చర్చే జరుగుతుంది. త్వరలో పెళ్లి కూడా చేసుకోబోతున్నారు. ఇప్పుడు `మళ్ళీ పెళ్ళి` అనే చిత్రంలో కలిసి నటించారు. తమ లైఫ్‌లు ప్రతిబింబించేలా ఈ సినిమా సాగుతుంది. ఇది ఈ నెల 26న విడుదల కానుంది. ఈ చిత్ర ప్రమోషన్స్ లో భాగంగా తమ లవ్ స్టోరీ బయటపెట్టాడు నరేష్. తమ ప్రేమ ఎలా స్టార్ట్ అయ్యింది, ఎక్కడ స్టార్ట్ అయ్యిందో అన్నీ ఓపెన్ అయ్యాడు. ఫస్ట్ టైమ్ పవిత్ర లోకేష్‌తో ప్రేమకి గల మూలాలను బయటపెట్టాడీ సీనియర్ నటుడు.
ఎప్పుడో `ఆలయం` సినిమా సమయంలో ఓ సారి కలుసుకున్నారట. ఆ సమయంలో పవిత్ర లోకేష్ తనతో మాట్లాడలేదట. ఈ అమ్మాయికి పొగరేమో అనుకుని లైట్ తీసుకున్నాడట నరేష్. ఆ తర్వాత పదేళ్లకి `హ్యాపీ వెడ్డింగ్` సినిమా సమయంలో కలుసుకున్నారట. ఆ టైమ్‌లో తనతో గళగళ మాట్లాడుతూనే ఉందట. తన గురించి చాలా విషయాలు తెలుసుకుంటుందట. తనకు ఆశ్చర్యమేసింది. ఆ సమయంలోనే అమ్మాయి బాగుంది, అందంగా ఉందనిపించిందని, పాజిటివ్ ఎనర్జీ కలిగిందట. ఆ తర్వాత మళ్లీ మాట్లాడలేదట.
మరోసారి `సమ్మోహనం` సినిమా షూటింగ్‌లో కలుసుకున్నారట. `షూటింగ్ సమయంలోనే తను ఫ్యాన్ పెట్టుకుని కూర్చుంది, దీంతో నీ స్మెల్ నచ్చింది అని ఆమెతో ఓపెన్‌గా అన్నాను. ఆమె తన పర్‌ఫ్యూమ్ పేరు చెప్పింది. కానీ అది కాదు మీలోని స్మెల్ నచ్చిందని చెప్పా. ఆ తర్వాత మరో రోజు కిచెన్‌లో షూటింగ్ జరుగుతున్నప్పుడు ఆమె హుందాతనం, నడవడిక చూసి ఇలాంటి అమ్మాయి నా వంటింట్లో ఉంటే బాగుండూ అనిపించింది. సహజంగా ఇలాంటి అందమైన అమ్మాయిని చూస్తే తన బెడ్‌రూమ్‌లో ఉంటే బాగుండు అనిపిస్తుంది. కానీ నాకు మాత్రం వంటింట్లో ఉంటే బాగుండనిపించింద`ని వెల్లడించారు నరేష్.
`అప్పటికే ఫ్యామిలీ లైఫ్‌తో తాను సఫర్ అవుతున్నాను. దీంతో ఇలాంటి అమ్మాయి తన ఇంట్లో బాగుండు అనే ఫీలింగ్ ఉండిపోయింది. పైగా తాను మంచి వంటలు వండుతానని కూడా చెప్పింది. ఆ తర్వాత ఓ రోజు ఓ మెసేజ్ పెట్టాను, కానీ రియాక్ట్ కాలేదు. దీంతో పెద్ద జాదులా ఉందనుకున్నా. మళ్లీ ఆరు నెలల గ్యాప్ తర్వాత బెంగుళూరులో కలిసింది. షూటింగ్ కోసం వచ్చానని, కలుద్దామా అంటే ఓకే చెప్పింది. ఆ రోజు కాఫీ షాప్‌లో కలుసుకున్నాం, మధ్యాహ్నం నుంచి సాయంత్రం వరకు మాట్లాడుతూనే ఉన్నాం. దీంతో ఆ రోజు కనెక్ట్ అయిపోయాం` అని తెలిపారు. కానీ ఐ లవ్యూ చెప్పుకోలేదని, కేవలం ఫ్రెండ్‌షిప్ మాత్రమే అని వెల్లడించాడీ సీనియర్ నటుడు.
మళ్లీ `సమ్మోహనం`లో అనుకోకుండా కలిశారట. అప్పటికే తనకు లవ్ పుట్టిందని, ఈమె రైట్ పర్సన్ అనిపించిందని, డిన్నర్‌కి తీసుకెళ్లి భోజనం చేశాక ఐ లవ్యూ చెప్పాడట. ఆమె సైలెంట్‌గా ఉందట. ఏం రియాక్ట్ కాలేదు, దీంతో వణుకుతో చెమటలు పట్టాయని, ఉన్న ఫ్రెండ్‌షిప్ కూడా పోతుందేమో అనిపించిందట. కారులో సైలెంట్‌గా కూర్చొందట. హోటల్‌లో దిగి పోతున్న సమయంలో తనకు ఆన్సర్ ఇవ్వలేదని నరేష్ అడగ్గా, `కీప్ లవ్వింగ్ మీ` అనే మాట చెప్పి వెళ్లిపోయిందట. దీంతో తనకు ఏం అర్థం కాలేదని, ఆ రాత్రంతా నిద్ర కూడా పట్టలేదని, మార్నింగ్ మళ్లీ షూటింగ్‌కి వస్తే రెగ్యూలర్‌గానే మాట్లాడుతుందట. తన వల్ల కాక ఇంగ్లీష్‌లో ఓ పోయెమ్ రాశాడట. కోపంగా చూసిందట.
ఆ సెట్‌లోనే ఇంద్రగంటి మోహనకృష్ణ సమక్షంలోనే, సెట్‌లో అందరు ఉండగానే పవిత్ర లోకేష్ చేయి పట్టుకుని తీసుకెళ్లి నిలదీశాడట. అప్పుడు రియాక్ట్ కాలేదని, ఆ తర్వాత డిసెంబర్ 31 రోజు విషెస్ చెబుదామని,తనకు గుడ్ న్యూస్ వస్తుందేమో అని కేక్, బొకే తీసుకొని ఆమె వద్దకు వెళ్లాడట. ఇప్పుడైనా చెప్పు అని అడగ్గా, అప్పుడు ఐ లవ్యూ అని చెప్పిందని, అలా తమ లవ్ స్టోరీ సాగిందని చెప్పాడు నరేష్. తమ లవ్ ఇప్పుడు ఎక్కడికో వెళ్లిందని, సహజీవనం దాటుకుని ముందుకు పోయిందని చెప్పారు నరేష్. ప్రస్తుతం పవిత్ర, నరేష్‌ల లవ్ స్టోరీ నెట్టింట వైరల్ అవుతుంది.