- Home
- Entertainment
- Vikram : 'విక్రమ్' థియేటర్ ని తగలబెట్టేసిన సూర్య ఫ్యాన్స్.. రంగంలోకి పోలీసులు, కారణం ఇదే
Vikram : 'విక్రమ్' థియేటర్ ని తగలబెట్టేసిన సూర్య ఫ్యాన్స్.. రంగంలోకి పోలీసులు, కారణం ఇదే
లోక నాయకుడు కమల్ హాసన్ చాలా కాలం తర్వాత బాక్సాఫీస్ వద్ద సింహ గర్జన చేస్తున్నాడు. క్రేజీ యంగ్ డైరెక్టర్ లోకేష్ కనకరాజ్ దర్శకత్వంలో తెరకెక్కిన విక్రమ్ చిత్రం ఇటీవల విడుదలైన బ్లాక్ బస్టర్ టాక్ సొంతం చేసుకుంది.

లోక నాయకుడు కమల్ హాసన్ చాలా కాలం తర్వాత బాక్సాఫీస్ వద్ద సింహ గర్జన చేస్తున్నాడు. క్రేజీ యంగ్ డైరెక్టర్ లోకేష్ కనకరాజ్ దర్శకత్వంలో తెరకెక్కిన విక్రమ్ చిత్రం ఇటీవల విడుదలైన బ్లాక్ బస్టర్ టాక్ సొంతం చేసుకుంది. చాలా రోజుల తర్వాత కమల్ హాసన్ పవర్ ఫుల్ యాక్షన్ మూవీ లో నటించడంతో అభిమానుల సంతోషానికి అవధులు లేకుండా పోయింది.
దీనితో తమిళనాడుతో పాటు తెలుగు రాష్ట్రాల్లో కూడా జనాలు థియేటర్స్ కి ఎగబడుతున్నారు. ఈ చిత్రంలో ఫహద్ ఫాజిల్, విజయ్ సేతుపతి కీలక పాత్రల్లో నటించిన సంగతి తెలిసిందే. అలాగే హీరో సూర్య కూడా ఈ చిత్రంలో గెస్ట్ రోల్ లో మెరిశాడు. కమల్ హాసన్ సినిమాలో సూర్య కనిపించడంతో ఫ్యాన్స్ సంబరాలు మరోస్థాయికి చేరాయి.
సూర్య అభిమానుల అత్యుత్సాహం ఓ థియేటర్ లో అగ్ని ప్రమాదం సంభవించేలా చేసింది. పుదుచ్చేరిలో విక్రమ్ చిత్రం ప్రదర్శించబడుతున్న ఓ థియేటర్ లో సూర్య అభిమానుల సంబరాలు మితి మీరాయి. స్క్రీన్ పై సూర్య ఎంట్రీ ఇవ్వగానే అభిమానులు బాణా సంచా పేల్చారు. స్రీన్ వద్దే టపాకాయలు కాల్చడంతో అగ్నిప్రమాదం సంభవించింది.
దీనితో స్రీన్ పై మంటలు చెలరేగాయి. భయాందోళనకు గురైన ప్రేక్షకులు థియేటర్ నుంచి బయటకి పరుగులు తీశారు. కాసేపట్లో థియేటర్ లో చాలా భాగం మంటలు వ్యాపించాయి. థియేటర్ తగలబడిపోవడంతో యాజమాన్యానికి తీవ్ర నష్టం వాటిల్లింది.
దీనితో సంఘటన గురించి తెలుసుకున్న పోలీసులు, అగ్నిమాపక సిబ్బంది రంగంలోకి దిగి మంటల్ని అదుపు చేశారు. పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.
అభిమానం మితిమీరితే ఎంత ప్రమాదమో మరోసారి రుజువైంది. హీరో సూర్య కమల్ హాసన్ కి అభిమాని. కమల్ కోసం సూర్య ఈ చిత్రంలో గెస్ట్ రోల్ ప్లే చేశాడు. మొత్తంగా విక్రమ్ చిత్రానికి థండర్ రెస్పాన్స్ వస్తోంది.