- Home
- Entertainment
- Krithi Shetty on love affairs: అజ్ఞాతవ్యక్తి తో లవ్ ఎఫైర్... ఫైనల్ గా నోరు విప్పిన యంగ్ బ్యూటీ కృతి శెట్టి
Krithi Shetty on love affairs: అజ్ఞాతవ్యక్తి తో లవ్ ఎఫైర్... ఫైనల్ గా నోరు విప్పిన యంగ్ బ్యూటీ కృతి శెట్టి
యంగ్ హీరోయిన్ కృతి శెట్టి లవ్ లో పడ్డట్టు పలు కథనాలు వెలువడుతుండగా... ఫైనల్ గా ఆమె నోరు విప్పారు. తన లవ్ ఎఫైర్ పై స్పష్టత ఇచ్చారు. కృతి శెట్టి లేటెస్ట్ కామెంట్స్ వైరల్ అయ్యాయి.
krithi shetty
వస్తూ వస్తూనే సంచలనాలు చేసే అమ్మాయిలు చాలా అరుదు. అలాంటి అరుదైన హీరోయిన్స్ లో కృతి శెట్టి ఒకరు. ఒక్క సినిమా ఆఫర్ కోసం ఏళ్ల తరబడి తపస్సు చేసే రోజుల్లో కృతి మాత్రం అవలీలగా స్టారైపోయారు. చేతి నిండా సినిమాలతో బిజీ అయ్యారు.
krithi shetty
మొదటి చిత్రంతోనే బ్లాక్ బస్టర్ హిట్ కొట్టిన కృతి (Krithi shetty) చాలా త్వరగా స్టార్డం తెచ్చుకుంది. ఉప్పెన విజయంలో సింహ భాగం కృతి శెట్టిదే. తన వయసుకు సరిగ్గా సెట్ అయ్యే పాత్రలో కృతి చాలా సహజంగా నటించింది. చేపకళ్ళు, చొట్ట బుగ్గలకు తోడు మెస్మరైజ్ చేసే ముఖకవళికలు కుర్రకారుకు నిద్ర లేకుండా చేశాయి. చిన్న చిత్రంగా విడుదలైన ఉప్పెన స్టార్ హీరో మూవీ రేంజ్ వసూళ్లు సాధించి ట్రేడ్ వర్గాలను షాక్ కి గురిచేసింది. ఉప్పెన వరల్డ్ వైడ్ గా వంద కోట్లకు పైగా గ్రాస్ వసూళ్లు రాబట్టడం ఊహించని పరిణామం. ఉప్పెన విజయం నేపథ్యంలో కృతి శెట్టికి టాలీవుడ్ లో అవకాశాలు వరుస కట్టాయి.
ఇక శ్యామ్ సింగరాయ్ (Shyam Singha Roy) మూవీతో సెకండ్ హిట్ తన ఖాతాలో వేసుకుంది ఈ యంగ్ హీరోయిన్. కాగా శ్యామ్ సింగరాయ్ మూవీలో ఒకింత హద్దులు దాటి బోల్డ్ సన్నివేశాల్లో నటించారు. నానికి లిప్ లాక్స్ ఇవ్వడంతో పాటు బెడ్ సీన్స్ లో నటించింది.అలాగే బంగార్రాజు హిట్ తో కృతి హ్యాట్రిక్ పూర్తి చేసింది. వరుసగా మూడు హిట్ చిత్రాలలో నటించిన డెబ్యూ హీరోయిన్ గా రికార్డులకు ఎక్కింది. బంగార్రాజు మూవీలో కృతి పల్లెటూరు అమ్మాయి పాత్రలో కనువిందు చేశారు.
Krithi Shetty
ఇక వరుసగా చిత్రాలకు సైన్ చేస్తున్న కృతి నెక్స్ట్ హీరో సుధీర్ కి జంటగా 'ఆ అమ్మాయి గురించి మీకు చెప్పాలి' అనే మూవీలో నటిస్తున్నారు. రామ్-లింగుస్వామి కాంబినేషన్ లో రూపొందుతున్న బైలింగ్వెల్ మూవీ వారియర్ (Warrior)లో నటిస్తున్నారు. నితిన్ కి జంటగా మాచర్ల నియోజకవర్గం మూవీలో నటిస్తున్నారు.
అలాగే టాలెంటెడ్ స్టార్ సూర్య (Suriya)పక్కన ఛాన్స్ కొట్టేశారు. ప్రయోగాత్మక చిత్రాల దర్శకుడు బాలా తెరకెక్కిస్తున్న నెక్స్ట్ మూవీలో సూర్యకి జంటగా కృతి ఎంపికయ్యారు. ఇటీవలే ఈ ప్రాజెక్ట్ పై అధికారిక ప్రకటన జరిగింది. రోజురోజుకూ కృతి తన పాపులారిటీ పెంచుకుంటూ స్టార్ హీరోయిన్ హోదా వైపు పరుగులు తీస్తుంది.
ఈ క్రమంలో కృతి శెట్టి ప్రేమలో పడ్డట్లు వార్తలు వస్తున్నాయి. ఆమె ఓ అజ్ఞాత వ్యక్తిని ప్రేమిస్తున్నారట. ఈ విషయాన్ని ఆమె గోప్యంగా ఉంచుతున్నారనేది సదరు వార్తల సారాంశం. కుందనపు బొమ్మలా ఉండే కృతి శెట్టి ప్రేమని పొందిన ఆ అదృష్టవంతుడు ఎవరని కుర్రకారు కుళ్ళుకుంటుండగా, ఆమె బాంబు పేల్చారు.
తాజా ఇంటర్వ్యూలో తన గురించి వస్తున్న లవ్ ఎఫైర్ వార్తలపై స్పందించారు. తాను ఎవరినీ ప్రేమించడం లేదని తెలిపారు. నాకు ప్రేమించే వయసు ఇంకా రాలేదు. అలాగే అంత తీరిక కూడా లేదు. ప్రస్తుతం నా ఫోకస్ మొత్తం కెరీర్ పైనే, కాబట్టి ప్రచారం అవుతున్న కథనాల్లో నిజం లేదని తెల్చిపారేసింది. సో.. కృతి శెట్టిది ఇంకా సింగిలే అన్నమాట. ఇక కన్నడ భామలు వరుసగా టాలీవుడ్ ని ఏలేస్తుండగా కృతి ఏ రేంజ్ కి వెళుతుందో చూడాలి.